News December 15, 2024
AUSvsIND: సెంచరీ చేసిన హెడ్

భారత్ అంటే చెలరేగిపోయే ట్రావిస్ హెడ్ మూడో టెస్టులోనూ తన జోరు కొనసాగించారు. గత మ్యాచ్‌లో 140 పరుగులు చేసిన ఆయన, గబ్బా మ్యాచ్‌లోనూ సెంచరీ చేశారు. క్రీజులోకి వచ్చిన తర్వాత హెడ్ దాదాపు ప్రతి ఓవర్లోనూ ఓ ఫోర్ బాదడం గమనార్హం. భారత బౌలర్లు ఎంత కష్టపడినా హెడ్ వికెట్ తీయలేకపోతున్నారు. గతంలోనూ టెస్టు ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయాన్ని హెడ్ అడ్డుకున్నారు.
Similar News
News September 15, 2025
వ్యాయామం, రన్నింగ్.. మితంగా చేస్తేనే మేలు!

రోజూ వ్యాయామం చేయడం మంచిదే. కానీ అతిగా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వారానికి 30-50kms రన్నింగ్ చేయొచ్చు. అలాగే రోజుకు 7000-10,000 అడుగుల నడక ఉత్తమం. ఎక్కువ దూరం పరిగెత్తడం వల్ల గుండె, కీళ్ల సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ సరిపోతుంది. మితమైన వ్యాయామం, సరైన విశ్రాంతి ముఖ్యం’ అని సూచిస్తున్నారు. SHARE IT
News September 15, 2025
రేపు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

TG: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రికి లేఖలు ఇచ్చింది.
News September 15, 2025
సిరాజ్‌కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.