News December 15, 2024

AUSvsIND: రెండో రోజు మ్యాచ్‌కి వర్షం అంచనాలివే

image

బ్రిస్బేన్‌ మ్యాచ్‌లో తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆ తర్వాత వరుణుడు అడ్డుపడ్డాడు. మరి రెండోరోజు పరిస్థితేంటి? వాతావరణ అంచనాల ప్రకారం ఆదివారం పరిస్థితి కొంత మెరుగ్గానే ఉండొచ్చు. శనివారం కంటే ఎక్కువగానే ఆట సాధ్యం కావొచ్చు. కానీ వర్షం ముప్పు మాత్రం ఉంది. తొలిరోజు తరహాలోనే ఏదొక సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను కొంచెం ముందుగానే ప్రారంభించనున్నారు.

Similar News

News October 29, 2025

SECLలో 595 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్‌(SECL)లో<> 595 <<>>పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మైనింగ్ సిర్దార్, జూనియర్ ఓవర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా , మైనింగ్ సిర్దార్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పాటు పని అనుభవం గల అభ్యర్థులు రేపటివరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://secl-cil.in

News October 29, 2025

తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

image

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించింది.

News October 29, 2025

భారీ వర్షాలు.. కల్లాల మీద ధాన్యం ఉందా?

image

కోతకోసి కుప్ప మీద ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రైతులు రక్షించుకోవాలి. నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలులేని పరిస్థితుల్లో ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక లేదా ఎండు వరిగడ్డిని కలిపితే గింజను వారం రోజులపాటు మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టి, తూర్పార పట్టి నిలువ చేసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ సూచించింది.