News November 8, 2024

AUSvsPAK: రెండో వన్డేలో పాక్ ఘన విజయం

image

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూలు 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటయ్యారు. హారిస్ రౌఫ్ 5, షాహీన్ అఫ్రిదీ 3 వికెట్లు తీశారు. 164 రన్స్ లక్ష్యాన్ని పాక్ 26.3 ఓవర్లలో ఛేదించింది. సయీమ్ ఆయుబ్ 82, అబ్దుల్లా 64*, బాబర్ 15* రన్స్ చేశారు. 3 వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో ఉన్నాయి.

Similar News

News November 8, 2024

చదువుకున్న వాళ్లు కమలకు.. మిగిలిన వారు ట్రంప్‌నకు ఓటేశారు

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు విద్యార్హ‌త‌ల ఆధారంగా విడిపోయిన‌ట్టు యాక్సియోస్ నివేదిక అంచ‌నా వేసింది. కాలేజీ గ్రాడ్యుయేట్లు అత్య‌ధికంగా ఉన్న రాష్ట్రాలు క‌మ‌ల వైపు నిలిస్తే, డిగ్రీ లేని వారు అత్య‌ధికంగా ఉన్న రాష్ట్రాలు ట్రంప్‌న‌కు జైకొట్టాయి. మొత్తం గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌లో 55% మంది క‌మ‌ల‌కు, గ్రాడ్యుయేష‌న్ లేనివారిలో 55% మంది ట్రంప్‌న‌కు ఓటేసిన‌ట్టు నివేదిక వెల్ల‌డించింది.

News November 8, 2024

మా సినిమా ట్రైలర్ లాక్ అయింది: పుష్ప టీమ్

image

పుష్ప-2 సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. రిలీజ్ ట్రైలర్‌ను లాక్ చేసినట్లు ప్రకటించింది. ‘ఎదురుచూపులు ముగిశాయి. ది రూల్ టేక్స్ ఓవర్. త్వరలో ట్రైలర్ అనౌన్స్‌మెట్’ అని ట్వీట్ చేసింది. వచ్చే నెల 5న పుష్ప: ది రూల్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

News November 8, 2024

రంజీల్లో ఆడటం వృథానేనా?: హర్భజన్

image

రంజీల్లో 6000 రన్స్, 400 వికెట్స్ తీసిన తొలి క్రికెటర్‌గా కేరళ ప్లేయర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించారు. అయితే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నా అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయట్లేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ హర్భజన్ ‘అతడిని ఇండియా-Aకైనా ఎంపిక చేయాల్సింది. రంజీల్లో ఆడటం వృథానేనా? ప్లేయర్లు IPL నుంచే ఎంపికవుతున్నారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.