News February 21, 2026
AUSWతో మ్యాచ్.. భారత్ స్కోర్ 176/6

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ 176/6 స్కోర్ చేసింది. స్మృతి మంధాన 55 బంతుల్లో 82(8 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా 59, రిచా ఘోష్ 18, షెఫాలీ వర్మ 7 రన్స్ చేశారు. టీమ్ ఇండియా చివరి 9 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. 3 టీ20ల సిరీస్‌లో IND, AUSలు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.
Similar News
News February 22, 2026
పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే వారికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. చాలామంది పిల్లలకు తర్వాత పెద్దవాళ్ల సబ్బులే వాడుతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్, మినరల్ ఆయిల్స్, సల్ఫేట్స్ లేకుండా pH5.5% ఉండేలా చూసుకోవాలంటున్నారు.
News February 22, 2026
NIT దుర్గాపూర్‌లో ఉద్యోగాలు

NIT దుర్గాపూర్ 3 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్(2), రీసెర్చ్ అసిస్టెంట్(1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(సోషల్ సైన్స్), NET/M.Phil/PhD అర్హత ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitdgp.ac.in
News February 22, 2026
అష్టలక్ష్మి: ఆదిలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

ఆదిలక్ష్మి అమ్మవారే ఈ సృష్టికి మూలం. ఎంతో శక్తిమంతమైన ఈ తల్లి స్వచ్ఛత, శాంతి, జ్ఞానానికి చిహ్నం. అందుకే ఆ మాతను పూజించేటప్పుడు తెలుపు రంగు వస్త్రం, పూలను సమర్పించడం శ్రేష్ఠం. తద్వారా మనస్సు నిర్మలంగా మారుతుంది. జీవితంలో ఎదురయ్యే గందరగోళం తొలగి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి పనిని ధర్మబద్ధంగా ప్రారంభించే శక్తి లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి, మనశ్శాంతికి ఆదిలక్ష్మి దేవి అనుగ్రహం చాలా అవసరం.


