India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మోమోస్ తిని మహిళ <<14473401>>మృతి<<>> చెందిన ఘటనపై GHMC దర్యాప్తు చేపట్టింది. చింతల్‌బస్తీలోని ‘వావ్ హాట్ మోమోస్’ షాపులో వాటిని తయారుచేసినట్లు గుర్తించి తనిఖీలు చేపట్టింది. అయితే అక్కడి పరిసరాలు చూసి అధికారులు షాక్ అయ్యారు. ఏ మాత్రం పరిశుభ్రత లేని ప్రదేశంలో మోమోస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో టెస్టుల కోసం ఫుడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.
AP: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలన్నారు.
హరియాణాలో రోహ్‌తక్ నుంచి ఢిల్లీ వెళుతున్న ప్యాసింజర్ రైలులో పేలుడు కలకలం రేపింది. పేలుడుకు మంటలు చెలరేగడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సంప్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రయాణికులు రైలులో పేలుడు స్వభావం ఉన్న పదార్థాలను తీసుకువెళ్లడంతో ఇలా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
AP: జగన్‌కు మద్దతుగా పాదయాత్ర చేయాలని షర్మిలను భారతీనే అడిగారని ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘యాత్ర సందర్భంగా ఆమె పార్టీని ఎత్తుకుపోతోందని జగన్‌తో సజ్జల చెప్పారు. జగన్‌కు అప్పటి నుంచే అభద్రతాభావం మొదలైంది. మధ్యలో చాలామంది చిచ్చులు పెట్టారు. TGలో పార్టీ పెట్టాలని షర్మిలను PK అడిగారు. ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయని, KCRతో ఇబ్బంది అవుతుందని జగన్ వద్దన్నారు’ అని అనిల్ చెప్పారు.
జేఈఈ మెయిన్స్ 2025-26కు షెడ్యూల్‌ను NTA విడుదల చేసింది. రెండు సెషన్స్‌గా పరీక్షలు జరగనున్నాయి. తొలి సెషన్ దరఖాస్తులకు నవంబర్ 22 వరకు గడువు ఉంది. జనవరి 22 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 12లోపు ఫలితాలు రానున్నాయి. రెండో సెషన్ దరఖాస్తులు ఫిబ్రవరిలో స్వీకరించనుండగా, ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి.
TG: జూనియర్ లెక్చరర్స్ ప్రొవిజినల్ లిస్ట్‌ను TGPSC విడుదల చేసింది. కెమిస్ట్రీ, హిస్టరీ, సంస్కృతం, ఫిజిక్స్ సబ్జెక్టుల వారీగా JL లిస్టును <
AP: వైసీపీ చీఫ్ జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లికీ వద్దని Xలో రాసుకొచ్చింది. ‘వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మని దింపేసిన సైకో కొడుకు జగన్ ఆమెను ఇంట్లోంచి కూడా గెంటేశాడు. ఇప్పుడు ఏకంగా కేసు పెట్టి కోర్టుకి లాగాడు. 70 ఏళ్ల వయసులో ఏ తల్లికీ ఇంత క్షోభ ఉండదు’ అని ట్వీట్ చేసింది.
రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ భాగస్వామి RAILOFY రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దూర ప్రయాణాలలో దీని ద్వారా పలు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా +917441111266 నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. నచ్చిన భాషను ఎంచుకొని వివరాలతో పాటు డెలివరీ స్టేషన్ ఎంచుకోవాలి. సమీపంలో రెస్టారెంట్‌ను సెలక్ట్ చేసి ఆర్డర్ చేస్తే సీటు వద్దకే ఫుడ్ డెలివరీ చేస్తారు.
నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు తన తల్లి అంజనా దేవి వీరాభిమాని అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఏఎన్నార్ ఫ్యాన్స్‌లో సీనియర్ ఫ్యాన్ మా అమ్మ. నేను కడుపులో ఉన్నప్పుడు ఆయన సినిమా విడుదలైంది. అమ్మ నిండు గర్భిణిగా ఉన్నా తన బలవంతం మీద నాన్న జట్కా బండిలో సినిమాకు తీసుకెళ్లారు. దారిలో బండి తిరగబడినా సినిమా చూశాకే తిరిగి ఇంటికి వచ్చారు. ఏఎన్నార్ అంటే అమ్మకు అంత పిచ్చి ఉండేది’ అని వెల్లడించారు.
బారామతిలో తనకు వ్యతిరేకంగా మరొకరిని పోటీకి దింపి శరద్ పవార్ కుటుంబంలో చీలిక తెచ్చారని Dy.CM అజిత్ పవార్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి తన భార్యను పోటీకి దింపి తప్పు చేసినట్టు అంగీకరించానని, అయితే ఇప్పుడు ఇతరులు కూడా తప్పు చేస్తున్నట్టు కనబడుతోందన్నారు. అజిత్ సోమవారం నామినేషన్ వేశారు. అజిత్‌కు వ్యతిరేకంగా మనవడు యుగేంద్రను శరద్ పవార్ రంగంలోకి దింపారు.
Sorry, no posts matched your criteria.