News April 25, 2025

వడ్డీ రేట్లు తగ్గించిన మరో 2 బ్యాంకులు

image

ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25% తగ్గించడంతో ఆ మేర రుణ రేటును కుదించనున్నట్లు కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రకటించాయి. దీంతో కెనరా బ్యాంకులో హౌస్ లోన్ కనీస రేటు 7.90%, వాహన రుణ రేటు 8.20% నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్ బ్యాంక్ గృహ రుణ రేటు 7.90%, వెహికల్ లోన్ రేటు 8.25% నుంచి మొదలవుతాయి. ఈ నెల 12 నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.

News April 25, 2025

గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకు సేవలను వినియోగించుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్‌లు తీసుకోనున్నారు.

News April 25, 2025

HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే

image

AP: హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉ.8కి మొదలవనుంది. మీర్జా రియాజ్(MIM), గౌతంరావు(BJP) పోటీలో ఉన్నారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో 112 మందికి గాను 88 మంది ఓటు వేశారు. 45 ఓట్లు వచ్చినవారు విజేతగా నిలుస్తారు. MIMకు సింగిల్‌గానే 50 ఓట్లు ఉండటం, INC(14) కూడా మద్దతివ్వడంతో రియాజ్ గెలుపు లాంఛనమే. ఉ.10 గంటల్లోపే ఫలితం వెలువడనుంది. BRS సభ్యులు(24) ఓటింగ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

News April 25, 2025

143 మంది యాక్టర్లతో వాట్సాప్ గ్రూప్.. కానీ: నాని

image

బన్నీ, రానా, రామ్ చరణ్, మంచు లక్ష్మి సహా 143 మంది తెలుగు యాక్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఉందని హీరో నాని తెలిపారు. అయితే అది ప్రస్తుతం యాక్టివ్‌గా లేదని, తాను కూడా ఆ గ్రూప్‌ను మ్యూట్‌లో ఉంచుతానని చెప్పారు. సినిమాలను ప్రోత్సహించుకోవడానికి దాన్ని క్రియేట్ చేశామన్నారు. అప్పట్లో బాగా చాట్ చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయిందని పేర్కొన్నారు. కాగా ఆయన నటించిన ‘హిట్-3’ మే 1న రిలీజ్ కానుంది.

News April 25, 2025

డెత్ ఓవర్లలో RR బోల్తా.. ఏం జరుగుతోంది?

image

ఈ సీజన్‌లో RR ఛేజింగ్ డెత్ ఓవర్లలో విఫలమవుతోంది. వరుసగా 3 గెలవాల్సిన మ్యాచ్‌లలో ఓడిపోయింది. APR 16న(vsDC) చివరి ఓవర్లో 9 రన్స్ కావాల్సి ఉండగా టై చేసుకుని సూపర్ ఓవర్‌లో పరాజయం పాలైంది. APR 19న(vsLSG) 6 బంతుల్లో 9 రన్స్ చేయాల్సి ఉండగా 2 రన్స్ తేడాతో ఓడింది. నిన్న RCBతో మ్యాచ్‌లో 12 బంతుల్లో 18 రన్స్ చేయలేక 11 పరుగుల తేడాతో మట్టికరిచింది. దీంతో ఏం జరుగుతోందంటూ RR ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

News April 25, 2025

ఉగ్రదాడిని మిలిటెంట్ల దాడిగా పేర్కొన్న NYT.. US ఆగ్రహం

image

జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని న్యూయార్క్ టైమ్స్(NYT) పత్రిక మిలిటెంట్ల దాడిగా పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం మండిపడింది. ఇండియా/ఇజ్రాయెల్ లేదా మరేచోటైనా టెర్రరిజం విషయానికి వచ్చేసరికి NYT వాస్తవాల నుంచి దూరం జరుగుతుందని ఫైరయ్యింది. ఈ మేరకు US ఫారిన్ అఫైర్స్ కమిటీ Xలో పోస్టు చేసింది. ఆ పత్రిక క్లిప్పింగ్‌లో మిలిటెంట్లుగా పేర్కొన్న భాగాన్ని కొట్టేసి టెర్రరిస్టులుగా మార్పు చేసింది.

News April 25, 2025

రోజూ 40 రోటీలు తినేవాడిని: జైదీప్

image

తనకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజూ 40 రోటీలు తిని, లీటరున్నర పాలు తాగేవాడినని ‘పాతాళ్‌లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ వెల్లడించారు. అయినా తాను 70KGల బరువు దాటలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వయసు దాటాక తిండిలో మార్పులు చేసుకోవాలని, అప్పుడే జీవనశైలి బాగుంటుందని చెప్పారు. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇప్పటికీ ఇంటి ఆహారమే తింటానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుంటానని పేర్కొన్నారు.

News April 25, 2025

ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన ప్రయాణాలు

image

పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంపై భారత విమానయాన సంస్థలు స్పందించాయి. US, UK, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రయాణించే విమానాలు ప్రత్యామ్నాయ సుదూర మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో పేర్కొన్నాయి. ట్రావెల్ టైమ్ పెరగడంతో టికెట్ల ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

News April 25, 2025

కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

image

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.

News April 25, 2025

ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

image

✒ 1874: రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
✒ 1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
✒ 2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం(ఫొటోలో)
✒ 2005: గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి మరణం
✒ 2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
✒ నేడు మలేరియా దినోత్సవం