News November 6, 2025

కుంకుమ పువ్వుతో ఎన్నో ప్రయోజనాలు

image

ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు తీసుకుంటే బిడ్డ తెల్లగా పుడతాడని చాలామంది భావిస్తారు. బిడ్డ చర్మ ఛాయ తల్లిదండ్రుల జీన్స్‌ని బట్టి ఉంటుందంటున్నారు నిపుణులు. కానీ ప్రెగ్నెన్సీలో కుంకుమపువ్వును తీసుకుంటే అజీర్తి, మూడ్‌ స్వింగ్స్‌, యాంగ్జైటీ, ఒత్తిడి, వేవిళ్లు, అధిక రక్తపోటు, ఐరన్ లోపం వంటివి తగ్గుతాయి. రోజుకు 2-3 రేకల్ని గ్లాసుపాలలో వేసుకొని తీసుకుంటే చాలు. దీనికి ముందు డాక్టరు సలహా తీసుకోవడం ముఖ్యం.

News November 6, 2025

మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలంటే?

image

మనం చేసే ఏ పనినైనా కృష్ణార్పణంగానే చేయాలని ఆ భగవంతుడే ఉపదేశించాడు. ఎప్పుడూ భగవంతుని పనులలోనే నిమగ్నమై ఉంటే, ఇతర ఆలోచనలకు తావుండదు. దీన్నే అవ్యభిచారిత భక్తి అంటారు. ఏకాగ్రత, నిశ్చలత కలిగిన ఈ భక్తిని శుద్ధ భక్తి, అనన్య భక్తి అని పిలుస్తారు. ఈ భక్తి మార్గం గురించి శ్రీమద్భగవద్గీతలో వివరంగా ఉంది. మనం చేసే కర్మలన్నీ భగవంతునికి అర్పించడమే నిజమైన, శుద్ధ భక్తి. వీటన్నింటి సారం తెలియాలంటే భగవద్గీత చదవాలి.

News November 6, 2025

ముగ్గురు కూతుళ్లు మృతి.. పరిహారం అందజేత

image

TG: బస్సు ప్రమాదంలో మరణించిన <<18204239>>ముగ్గురు<<>> అమ్మాయిల (తనూష, సాయి ప్రియ, నందిని) తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ క్రమంలో తండ్రి తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ రోదించారు. ‘నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది?’ అంటూ గుండెలు బాదుకున్నారు.

News November 6, 2025

‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

image

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.

News November 6, 2025

TG SETకు దరఖాస్తు చేశారా?

image

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించే <>TG SE<<>>T-2025 దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులో తప్పుల సవరణ నవంబర్ 26 నుంచి 28 వరకు చేసుకోవచ్చు. డిసెంబర్ 3న వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/

News November 6, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.

News November 6, 2025

‘SIR’ను వ్యతిరేకించిన మమతకూ ఫామ్ ఇచ్చిన BLO

image

SIRకు వ్యతిరేకంగా 2 రోజుల కిందట బెంగాల్ CM మమతా బెనర్జీ <<18197344>>ర్యాలీ<<>> నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఓటర్ లిస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఆమె అందుకున్నారు. కోల్‌కతాలోని CM నివాసానికి నిన్న బూత్ లెవల్ ఆఫీసర్ వెళ్లారు. ఫామ్‌ను నేరుగా మమతకే ఇస్తానని సెక్యూరిటీ సిబ్బందికి BLO చెప్పినట్లు సమాచారం. దీంతో స్వయంగా మమత వచ్చి తీసుకున్నారని తెలుస్తోంది. దాన్ని నింపిన తర్వాత BLOకు ఇవ్వనున్నారు.

News November 6, 2025

ONGCలో 2,623 అప్రెంటీస్‌లు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/

News November 6, 2025

అఫ్గాన్‌తో చర్చలు విఫలమైతే యుద్ధమే: పాక్

image

ఇవాళ ఇస్తాంబుల్‌లో శాంతి చర్చల నేపథ్యంలో అఫ్గాన్ ప్రభుత్వానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అఫ్గాన్‌లో తాలిబన్లను ఎదుర్కోవడానికి సైనిక ఘర్షణే ఏకైక పరిష్కారమా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘చర్చలు విఫలమైతే యుద్ధం జరుగుతుంది’ అని ఆసిఫ్ పేర్కొన్నారు. గత నెల ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్‌ఫైర్ ఒప్పందానికి కొనసాగింపుగా ఇవాళ తుర్కియే, ఖతర్ చొరవతో మరోసారి చర్చలు జరగనున్నాయి.

News November 6, 2025

వంటింటి చిట్కాలు

image

* పూరీలు తెల్లగా రావాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికలు చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయిస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ వస్తాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించేముందు కాసేపు ఎండలో పెడితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.