News April 25, 2025

రేపటి నుంచి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు మొదలవుతాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. రేపటితో వడగాలులు ముగుస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని, ముఖ్యంగా 26న వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని వివరించారు.

News April 25, 2025

ఉగ్రదాడిని పాకిస్థాన్ ఒప్పుకున్నట్లేనా?

image

ఉగ్రదాడిలో PAK హస్తముందని ఆరోపిస్తూ IND ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు పాక్ తీరు తప్పును ఒప్పుకున్నట్లే ఉంది. దాడి చేయకపోతే, చేయలేదని చెప్పకుండా ప్రతీకార చర్యలకు దిగింది. సరిహద్దులకు సైన్యాన్ని పంపి యుద్ధానికి సై అంటోంది. IND ఆరోపణలు అవాస్తమైతే దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సింది పోయి PAK వ్యవహరిస్తున్న తీరు దోషినని ఒప్పుకున్నట్లుగానే ఉంది.

News April 24, 2025

మేడిగడ్డ బ్యారేజీపై సంచలన నివేదిక!

image

TG: మేడిగడ్డలోని బ్లాక్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని NDSA నివేదిక పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధ్యయనం చేసిన కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేసింది. బ్యారేజీలలో నిర్వహణ లోపాలే సమస్యలు తెచ్చిపెట్టాయని తెలిపింది. మేడిగడ్డ బ్లాక్-7 ఎక్కువ దెబ్బతిందని, ప్రాజెక్ట్ వినియోగం ముప్పేనని తేల్చి చెప్పింది. నిర్మాణ లోపాలపై నిపుణుల పరిశీలన అవసరమని సూచించింది.

News April 24, 2025

6 మ్యాచుల్లో గెలుస్తామనుకుంటున్నాం: ఫ్లెమింగ్

image

ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలపై CSK కోచ్ ఫ్లెమింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఆరు మ్యాచుల్లోనూ తాము గెలుస్తామని ఆశిస్తున్నామని చెప్పారు. కొందరు నవ్వుకున్నా గత ఏడాది ఆర్సీబీ ఇదే చేసిందన్నారు. రాబోయే మ్యాచుల్లో ఆటగాళ్లు అద్భుతంగా ఆడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ వర్కౌట్ కాకపోతే పేలవ సీజన్ నుంచి నేర్చుకుంటామన్నారు.

News April 24, 2025

టీ20ల్లో సరికొత్త రికార్డు

image

టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన సమయంలో అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ(62) సరికొత్త రికార్డు నెలకొల్పారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ చేయడంతో బాబర్(61)ను అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో గేల్(57), వార్నర్(55), బట్లర్(52), డుప్లెసిస్(52) ఉన్నారు.

News April 24, 2025

యుద్ధానికి రెడీ అవుతున్న భారత్?

image

పాకిస్థాన్‌పై విరుచుకుపడేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. LoC, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘించడంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని (సీజ్ ఫైర్) రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అటు హిందూ, అరేబియా సముద్రాల్లో నేవీ మోహరించినట్లు వార్తలొస్తున్నాయి. INS విక్రాంత్‌ పాకిస్థాన్ వైపు వెళ్తోందని సమాచారం. ఇక వైమానిక దళం రఫేల్ యుద్ధవిమానాలను పలు ఎయిర్‌బేస్‌లకు తరలించింది.

News April 24, 2025

IPL: ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RRతో జరిగిన మ్యాచ్‌లో RCB 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(70), దేవదత్ పడిక్కల్(50) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 26 పరుగులతో శుభారంభం అందించారు. చివర్లో టిమ్ డేవిడ్(23), జితేశ్ శర్మ(20*) బౌండరీలతో మెరిపించారు. సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. RR టార్గెట్ 206.

News April 24, 2025

నాయీ బ్రాహ్మణుల కమీషన్ పెంపు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు కనీస కమీషన్‌ను రూ.20వేల నుంచి రూ.25వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 6ఏ కేటగిరీలోని 44 దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. కనీసం ఆలయాల్లో 100 రోజుల పాటు సేవలు అందించేవారికి ఈ పెంపు వర్తించనుంది. ఏడాదికి రూ.50లక్షల నుంచి రూ.2 కోట్లు ఆదాయం వచ్చే ఆలయాలు 6A కేటగిరీలోకి వస్తాయి.

News April 24, 2025

యుద్ధానికి సిద్ధమవుతోన్న పాక్!

image

భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న PAK కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా LOCకి అటువైపు ఆర్మీ దళాలను భారీగా మోహరిస్తోంది. కేవలం బంకర్ల నుంచే నిఘా ఉంచాలని సైనికులను ఆదేశించింది. రావల్పిండి కేంద్రంగా పని చేస్తున్న 10దళాల సైనికులను అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని PAK ఆర్మీ ఆదేశించింది. LOCతో పాటు అంతర్జాతీయ సరిహద్దులైన సియాల్‌కోట్, గుజ్రాన్‌వాలా వద్ద ఉన్న సైనికులనూ అలర్ట్‌ చేసింది.

News April 24, 2025

ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ కీలక ప్రకటన

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పరిధిలో కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఇందులో డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ టీమ్స్ పాల్గొన్నాయని వెల్లడించారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోల సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.