India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉగ్రదాడికి కౌంటర్‌గా పాకిస్థాన్‌పై భారత్ నిన్న ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ సైతం అదే దారిలో నడిచింది. వీసాల రద్దు, హైకమిషన్ కార్యాలయంలో దౌత్య సిబ్బంది తగ్గింపు, అట్టారీ వాఘా బోర్డర్ మూసివేత, వాణిజ్య కార్యకలాపాల రద్దు ఇలా ప్రతి దాంట్లోనూ మనల్నే కాపీ కొట్టింది. ఇక 1972లో కుదిరిన షిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలపై కేంద్రం వివరించింది. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రేపు శ్రీనగర్ వెళ్లనున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన అక్కడ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌కు ప్లేఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జట్టుకు 91% ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. అతి తక్కువగా CSKకు 0.8 శాతం మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ(85%), బెంగళూరు(62%), పంజాబ్(58%), ముంబై(51%), లక్నో(34%), కోల్‌కతా(15%), రాజస్థాన్(2%), హైదరాబాద్(1%) ఉన్నాయి.
‘రెట్రో’ సినిమా కథను దళపతి విజయ్ కోసం రాశారన్న ప్రచారంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్పందించారు. రజినీకాంత్ కోసం ఈ స్టోరీ రాసుకున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేశానని తెలిపారు. సూర్య రావడంతో పలు మార్పులు చేసినట్లు చెప్పారు. సినిమాలో రొమాంటిక్ డ్రామాను జోడించినట్లు పేర్కొన్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. బీజేపీ మద్దతుతో సౌత్ అండమాన్‌లోని శ్రీవిజయపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 24 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో టీడీపీ 15 ఓట్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి సాహుల్ హమీద్ గెలుపొందారు.
భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో 2 దేశాల వద్ద ఉన్న సైనిక బలాలేంటో తెలుసుకుందాం.
♦ ఆర్మీ సైనికులు: 14,55,550 (భారత్), 6,54,000 (పాక్)
♦ వైమానిక ట్యాంకర్లు: 6 (భారత్), 4 (పాక్)
♦ అణు జలాంతర్గాములు: 293(భారత్), 121 (పాక్)
భారత్→ 2,299 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 జెట్స్
పాక్→ 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 జెట్స్
▶ అలాగే, భారత్ వద్ద 1.15M రిజర్వ్, 25 లక్షల పారా మిలిటరీ బలగాలున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడిలో మోదీ సర్కారు కుట్ర ఉందన్న అస్సాం AIDUF ఎమ్మెల్యే <<16202042>>అమినుల్ ఇస్లాంను<<>> పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయడానికి ప్రయత్నించినా సహించేది లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. సదరు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని అమినుల్ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి.
ఉగ్రదాడిపై స్పందించేందుకు సెలబ్రిటీలు తటపటాయిస్తుంటే తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల చేసిన పనికి ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ (నెల్లూరు) భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె, కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతేడాది విజయవాడ, ఖమ్మం వరదల సమయంలోనూ తన వంతు బాధ్యతగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడినవారికి ముంబైలోని సర్ హెచ్ఎన్ ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ‘ఉగ్రదాడి మానవాళికే మచ్చ. అది ఏ రూపంలో ఉన్నా సహించకూడదు. ప్రాణాలు కోల్పోయినవారికి నా ప్రగాఢ సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దేశం తరఫున అంబానీ కుటుంబం ఎప్పుడూ నిల్చునే ఉంటుంది’ అంటూ ఆయన పేర్కొన్నారు.
నాని, శైలేష్ కొలను కాంబినేషన్లో తెరకెక్కిన ‘హిట్-3’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం సినిమా నిడివి 2.37:06 గంటలుగా ఉంది. సినిమాలో బూతు పదాల వాడుకను పరిమితం చేసింది. హింస ఎక్కువగా ఉన్న సీన్లలో మార్పులు సూచించింది. ఈ మూవీ మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా A సర్టిఫికెట్ మూవీస్‌కి 18+ వయసున్న అభిమానులనే థియేటర్లకు అనుమతించాలని సెన్సార్ బోర్డు పేర్కొంటుంది.
Sorry, no posts matched your criteria.