News April 24, 2025

సునీల్ కుమార్‌పై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు

image

AP: సర్వీసు నిబంధనల ఉల్లంఘన, వివిధ అభియోగాలతో CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు చేసింది. ప్రభుత్వానికి తెలియకుండా ఆయన పలుమార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపింది. జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని 2సార్లు UAE, మరోసారి ప్రభుత్వానికి తెలియకుండా స్వీడన్, ఇంకోసారి US వెళ్లారని పేర్కొంది. ప్రతి అభియోగంపై 30రోజుల్లో రాతపూర్వక జవాబివ్వాలని ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది.

News April 24, 2025

ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు

image

AP: రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం)లలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఏప్రిల్ 27 నుంచి మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పదో తరగతి మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు ఉంటాయి. అప్లికేషన్ ఫీజు రూ.300. దరఖాస్తు చేసుకోవాల్సిన సైట్: http://www.rgukt.in/

News April 24, 2025

యుద్ధం వస్తే మన ముందు పాక్ నిలుస్తుందా?

image

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే మనకు వ్యతిరేకంగా పాక్ నిలువగలదా? మన సైన్యం సంఖ్య 1.44 మిలియన్. 4500 యుద్ధ ట్యాంకులు, 538 యుద్ధ విమానాలు, అధునాతన క్రూయిజ్ క్షిపణులు, భీమ్ ట్యాంకులు, సబ్‌మెరైన్లు ఉన్నాయి. కానీ పాక్ వద్ద ఇవేమీ చెప్పుకోదగ్గ సంఖ్యలో కూడా లేవు. యుద్ధం వస్తే మన ముందు పాకిస్థాన్ ఎంతోకాలం నిలవదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

News April 24, 2025

‘రామాయణ్’లో సీత పాత్ర అందుకే తిరస్కరించా: శ్రీనిధి శెట్టి

image

నితీశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణ్’ సినిమాలో సీత పాత్రలో నటించమని తనకు ఆఫర్ వచ్చినట్లు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలిపారు. అయితే ఇందులో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలిసి ఆ పాత్ర వద్దనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యశ్‌తో కలిసి ఈ అమ్మడు KGF సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. కాగా ‘రామాయణ్‌’లో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు.

News April 24, 2025

దానం దారి.. అందుకే ‘మారుతోందా?’

image

ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ BRSకు అనుకూల వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2023లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ సాక్షిగా గులాబీ సభ్యులపై దానం ధ్వజమెత్తడం అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల BRSకు అనుకూలంగా <<16202054>>మాట్లాడుతున్నారు<<>>. పార్టీ ఫిరాయించిన వారిపై సుప్రీంలో విచారణ, బై పోల్ వస్తే సవాళ్లు, స్థానిక కాంగ్రెస్‌లో వర్గపోరు తదితరాలతో దానం మళ్లీ దారి మార్చుకున్నట్లు టాక్.

News April 24, 2025

PSL ప్రసారంపై నిషేధం

image

మన దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పహల్‌గామ్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్‌లో PSL‌ను స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్‌ లైవ్ ఇస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇవాళ్టి నుంచి PSL ప్రసారం ఆగిపోనుంది. భారత్ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోదని ఇప్పటికే BCCI ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 24, 2025

ఉగ్రదాడి: అఖిలపక్ష సమావేశం ప్రారంభం

image

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం భేటీ అయింది. ఇందులో కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్, నిర్మల, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడి అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రులు ఆ సమావేశంలో వివరిస్తున్నారు.

News April 24, 2025

శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. శుక్రవారం 17 మండలాల్లో(శ్రీకాకుళం 4,విజయనగరం 5, మన్యం 8) తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్నట్లు APSDMA వివరించింది. ఇవాళ నంద్యాల(D) దొర్నిపాడులో 43.8°C అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలోని పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

News April 24, 2025

అఖిలపక్ష భేటీకి అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం

image

పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీకి AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం అందింది. అమిత్ షా తనకు కాల్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించినట్లు ఒవైసీ తెలిపారు. ఈ సందర్భంగా అందరి అభిప్రాయాలు వినేందుకు PM ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు. ఇవాళ ఉదయం అఖిల‌పక్ష భేటీకి 5-10 MPలు ఉన్న చిన్న పార్టీలనూ పిలవాలని ఒవైసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

News April 24, 2025

భానుడి భగభగలు.. ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత

image

TG: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాలలో 45.3, ఆదిలాబాద్-45.2, నిర్మల్-45.2, మంచిర్యాల-45.1, ఆసిఫాబాద్-45, నల్గొండ-44.9, కామారెడ్డి-44.6, కరీంనగర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొట్టాయి. ఐఎస్ సదన్‌లో అత్యధికంగా 42, మాదాపూర్‌లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.