India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధించుకోవడం, దేశ సరిహద్దుల్లో సైన్యం తరలింపు, మిస్సైళ్ల ప్రయోగంతో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో హోంమంత్రి అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనేదానిపై వీరు చర్చించినట్లు సమాచారం.
మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మాను భద్రతా బలగాలు ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత జరుగుతోంది. ఈ క్రమంలో హిడ్మాను ట్రాప్ చేసిన పోలీసులు అతడిని సజీవంగా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరువైపులా జరిగిన భీకర దాడుల్లో ఆరుగురు నక్సల్స్ మృతిచెందారు. హిడ్మా ఆచూకీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై మరో నటి అపర్ణ జాన్ ఆరోపణలు చేశారు. ‘సూత్రవాక్యం’ మూవీ షూటింగ్‌లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. AUSలో ఉన్న ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. <<16115833>>గతంలో విన్సీ<<>> చెప్పినవి 100% నిజమని పేర్కొన్నారు. తరచూ ఏదో తెల్లటి పౌడర్ నమిలేవాడని, గ్లూకోజ్ అని భావించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఇదే సినిమా సెట్‌లో తనతో అనుచితంగా ప్రవర్తించాడని విన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
AP: వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మాధవ్ సహా ఆరుగురు నిందితులను రాజమండ్రి జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు.
AP: ఉగ్రదాడి ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ చౌకీదార్ ప్రభుత్వం సొంత ప్రజలపై లాఠీ ఝులిపిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వెంటాడటంలో బిజీగా ఉండి సరిహద్దుల్లో రక్షణ కల్పించడంలో ఫెయిలైందని దుయ్యబట్టారు. ‘ప్రధాని మోదీజీ. ఇదిగో మీ లాఠీ. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించే వారిపై కాకుండా మన శత్రువులపై ఉపయోగించండి’ అని లాఠీ పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.
AP: పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కవలలు టెన్త్ ఫలితాల్లో సాధించిన మార్కులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బలిజిపేట (M) వంతరాం గ్రామానికి చెందిన బెవర శ్రవణ్, బెవర సింధు కవలలు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ఇద్దరికీ 582 చొప్పున మార్కులు రాగా, స్థానికంగా ఈ విషయం ఆసక్తి రేపింది. మంచి మార్కులు సాధించినందుకు వీరి తల్లిదండ్రులు ఉమా, రాము సంతోషపడ్డారు.
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లోని ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు చేపట్టింది. ఏకకాలంలో మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు PMLA కింద కేసు నమోదు చేసింది. ఫిట్జీ తమకు సంబంధించిన కొన్ని కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేయడం ద్వారా రూ.11.11 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు చేపట్టింది. మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది.
AP: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) పాలిసెట్-2025 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://polycetap.nic.in సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు కేవలం ఆన్‌లైన్ విధానంలోనే అందుబాటులో ఉంటాయని, పోస్ట్ లేదా ఇతర ఆఫ్‌లైన్ పద్ధతుల్లో పంపబోమని అధికారులు స్పష్టం చేశారు.
పహల్గామ్ దాడి అమాయకులపై జరిగింది కాదని, మొత్తం కశ్మీర్‌పై జరిగిన దాడి అని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కశ్మీరీలు మౌనం వీడి, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని ఆయన ఎక్స్‌లో పిలుపునిచ్చారు. ‘పహల్‌గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడి నా హృదయాన్ని మెలిపెట్టింది. ఈ దుశ్చర్య చూసి రక్తం మరిగిపోతోంది. ఇలాంటి చర్యలను అస్సలు క్షమించకూడదు. ఇదో పిరికిపంద చర్య’ అని ఆయన సుదీర్ఘ నోట్ రాశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చర్యలను రాష్ట్రపతికి వివరించారు. దేశ భద్రత, పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలపై చర్చించారు.
Sorry, no posts matched your criteria.