India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
GST సవరణలో భాగంగా పలు కార్ల ధరలు భారీగా తగ్గనున్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి. కానీ మహీంద్రా కంపెనీ ముందే శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచే వారి SUV వాహనాలపై జీఎస్టీ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రూ.1.56 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రామిస్ చేయడమే కాదు.. చేసి చూపిస్తాం. థాంక్యూ మహీంద్రా ఆటో’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 102 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రేడ్-Cలో 3 పోస్టులు, గ్రేడ్-Bలో 97పోస్టులు, గ్రేడ్-Aలో 2పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, PG, MBA, PGBM, CA, ICWA, CS ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
వెబ్సైట్: <
TG: కవిత సంచలన ఆరోపణల తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు తొలిసారి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిశారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లిలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ కూడా అక్కడే ఉండటంతో ముగ్గురూ సమావేశం అయ్యారు. ఇందులో కవిత అంశం చర్చకు వస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా హరీశ్‌పై ఆరోపణలు చేసిన కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్‌కు ఓ బిలియనీర్ రూ.10 వేల కోట్ల (£846M) ఆస్తిని రాసిచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీలునామా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్‌కు చెందిన ఓ గుర్తు తెలియని 31 ఏళ్ల బిలియనీర్‌కు పిల్లలు లేరు. ఇటీవల ఆయన మరణించేముందు తన ఫేవరెట్ సాకర్ స్టార్ నెయ్‌మార్‌కు తన సంపదను రాసిచ్చారు. కాగా ఈ వీలునామాపై తమకు అధికారిక సమాచారం అందలేదని నెయ్మార్ టీమ్ తెలిపింది.
సాధారణంగా పిల్లలు ఏడ్చో, బెదిరించో వారికి కావాల్సింది సాధిస్తారు. కొన్నిసార్లు ఇతరుల దగ్గరా ఇలానే ప్రవర్తిస్తారు. కాబట్టి వారు పేచీ పెడితే మనసు మళ్లించండి. ఓపికతో నచ్చజెప్పండి. ఫలానా పని చేస్తేనే ఇస్తా అని లక్ష్యాన్ని నిర్దేశించండి. అది పూర్తి చేసే వరకూ కాస్త కఠినంగా ఉండాలి. పిల్లలతో తరచూ మాట్లాడండి. మనసులోని బాధ, కోపాన్ని బయటపెడితేనే పిల్లల్లో మొండితనం, కోపం తక్కువగా ఉంటాయంటున్నాయి పరిశోధనలు.
‘జింక్’ లోపం వల్ల మొక్కల ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుకు మారతాయి. ఆకుల మధ్య కాండం పొడవు తగ్గి ఆకులు గుబురుగా కనిపిస్తాయి. కొమ్మ చివర్ల నుంచి కింద వరకు ఎండిపోతుంది. కాయ నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. పండ్లు చిన్నవిగా తొక్క మందంగా మారి రుచిగా ఉండవు. దీని నివారణకు ప్రతి చెట్టు మొదలులో 100గ్రా. జింక్ సల్ఫేట్‌ను మట్టిలో కలిసేలా వేసి పత్రాలపై కూడా 0.1% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
పొలం చుట్టూ నాలుగు వరుసల్లో మరో పంట మొక్కలను పెంచి పందుల బారి నుంచి పంటను రక్షించుకోవచ్చు. వేరుశనగ పొలం చుట్టూ నాలుగు వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూడాలి. గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలను తగిన పరిమాణంలో కలిపి అందించాలి. లూసెర్న్, బర్సిమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వొచ్చు. రాత్రి పచ్చిరొట్టను పెట్టాలి. దోస, క్యారెట్, పాలకూర, ముల్లంగి, గోధుమగడ్డి, గుమ్మడి, నీటిలో పెరిగే మొక్కలు, మొలకలను పెట్టవచ్చు.
హైదరాబాద్‌లోని బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకుంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా, రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉంటారని భక్తుల నమ్మకం. 1994లో రూ.450తో మొదలై ఏటా పెరుగుతూ రూ.35లక్షలకు చేరింది. మొదటి నుంచి 21kgల లడ్డూను స్వామికి సమర్పిస్తున్నారు. 1998లో రూ.51వేలు పలికిన ధర 2002లో తొలిసారి రూ.లక్ష దాటింది. 2008లో రూ.5L, 2015లో రూ.10L క్రాస్ చేసింది. 2020లో కొవిడ్ వల్ల వేలం జరగలేదు. గతేడాది రూ.30.01 లక్షలు పలికింది.
AP: యూరియా కొరత, రైతుల సమస్యలపై నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 9న ‘అన్నదాత పోరు’ పేరిట కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఆ రోజు ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.