News April 24, 2025

కేంద్ర హోంశాఖ, IB, RAW ఎమర్జెన్సీ మీటింగ్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. దీనికి హోంశాఖ కార్యదర్శి, IB డైరెక్టర్, RAW చీఫ్ తదితరులు హాజరయ్యారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ వీరి భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.

News April 24, 2025

IPL: మరోసారి ‘ఛాంపియన్’గా ముంబై?

image

సరైన టైమ్‌లో ఊపందుకున్న ముంబై ఇండియన్స్ మిగతా జట్లలో గుబులు రేపుతోంది. తొలి 5 మ్యాచుల్లో ఒకటే గెలిచిన ఆ జట్టు ఒక్కసారిగా పుంజుకుంది. బుమ్రా, బౌల్ట్, చాహర్, శాంట్నర్ దుర్భేద్యమైన బౌలింగ్‌కి తోడు రోహిత్ ఫామ్ అందుకోవడం, సూర్య నాటౌట్‌గా మ్యాచులు ఫినిష్ చేస్తుండటం, హార్దిక్ కెప్టెన్సీ అన్నీ ముంబైకి కలిసొస్తున్నాయి. హాట్ ఫేవరెట్‌ను చేశాయి. ప్లే ఆఫ్స్‌కి చేరితే MIని కప్పు కొట్టకుండా అడ్డుకోవడం కష్టమే.

News April 24, 2025

ఆల్ పార్టీ మీటింగ్‌కు మమ్మల్నీ పిలవాలి: అసదుద్దీన్

image

పహల్‌గామ్ దాడిపై కేంద్రం నిర్వహించనున్న ఆల్ పార్టీ మీటింగ్‌కు తమలాంటి చిన్న పార్టీలనూ ఆహ్వానించాలని MIM చీఫ్ అసద్ డిమాండ్ చేశారు. ‘5-10 మంది MPలున్న పార్టీలనే ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. చిన్న పార్టీలు కూడా వస్తే మీటింగ్ టైమ్ ఎక్కువ పడుతుందని చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాలు వినడానికి PM 1hr అదనంగా కేటాయించలేరా? ఎంపీలందరినీ ఎన్నుకుంది భారతీయులే కదా’ అని ట్వీట్ చేశారు.

News April 24, 2025

పాక్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిపివేత

image

పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విటర్ పేజీ ఓపెన్ చేస్తే ‘విత్‌హెల్డ్’ అని చూపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రాకపోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్నీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్‌కు యాక్సెస్‌ లేకుండా అడ్డుకుంది.

News April 24, 2025

జమ్మూ ఎన్‌కౌంటర్ Live Update: భారత జవాన్ వీర మరణం

image

జమ్మూ కశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు. అక్కడ ముష్కరులు ఉన్నారని సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టగా ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ సోల్జర్ వీర మరణం పొందారని భద్రతా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అక్కడ భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

News April 24, 2025

GOVT SCHOOL విద్యార్థుల సత్తా.. 42 మందికి 500+ మార్కులు

image

AP: కర్నూలులోని ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ స్కూల్ టెన్త్ ఫలితాల్లో మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగోసారి 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 42 మంది 500కు పైగా మార్కులు సాధించారు. ఒక్క విద్యార్థికి 491 వచ్చాయి. సాయి లిఖితకు అత్యధికంగా 595 మార్కులు వచ్చాయి. 9 మంది 580-591 మధ్య మార్కులు పొందారు. కాగా ఈ స్కూల్‌ పలుమార్లు ఉత్తమ పాఠశాలగా నిలిచింది.

News April 24, 2025

ఉగ్రదాడి.. కలిమా చదివి తప్పించుకున్నాడు!

image

కలిమా చదవడంతో పహల్‌గామ్ ఉగ్రదాడి నుంచి అస్సాం వర్సిటీ ప్రొఫెసర్ దేబాశిష్ తప్పించుకున్నారు. ఫ్యామిలీతో టూర్‌కు వెళ్లిన ఆయన మాటల్లో.. ‘చుట్టూ జనాలు పడిపోతుండగా పక్కన కొందరు ‘కలిమా (ఇస్లాంపై విశ్వాస వాక్యం)’ చదువుతున్నారు. వారిని చూసి నేనూ అలా చదివాను. నా పక్కన వ్యక్తిని కాల్చిన టెర్రరిస్ట్.. నన్ను డౌట్‌తో మళ్లీ కలిమా చెప్పమన్నాడు. వణుకుతూనే చదివిన తర్వాత నన్ను వదిలేసి ముందుకెళ్లారు’ అని వివరించారు.

News April 24, 2025

కర్రెగుట్టలో కాల్పుల మోత.. ముగ్గురు మావోయిస్టులు మృతి

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లో సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. హిడ్మా, దేవా వంటి అగ్ర కమాండర్లు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని 3వేలకు పైగా బలగాలు చుట్టుముట్టాయి. నేలమీది నుంచి, గగనతలం నుంచి ముమ్మర కూంబింగ్‌తో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. ఈక్రమంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోలు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

News April 24, 2025

పాములాంటి పాకిస్థాన్‌తో ఒప్పందం.. MP సంచలన వ్యాఖ్యలు

image

సింధు నది జలాల నిలిపివేతతో పాకిస్థాన్ అల్లాడిపోతుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అన్నారు. దివంగత ప్రధాని నెహ్రూ పాకిస్థాన్‌కు నీరు ఇస్తే తనకు నోబెల్ బహుమతి వస్తుందని ఆశపడి పాము లాంటి ఆ దేశానికి సింధు జలాలను తరలించారన్నారు. PM మోదీ ఆ ఒప్పందాన్ని నిలిపివేసి, ఏమీ అందకుండా దెబ్బ కొట్టారని చెప్పారు. 52ఇంచుల ఛాతీ ఉన్న ధీరుడి నిర్ణయాలు ఆశ్చర్యకరంగానే ఉంటాయని మోదీని ఉద్దేశించి ప్రశంసించారు.

News April 24, 2025

ఆఫీస్‌కు వస్తారా.. మానేస్తారా?.. గూగుల్ అల్టిమేటం

image

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ అల్టిమేటం జారీ చేసింది. ఆఫీస్‌కు వస్తారా లేక పూర్తిగా మానేస్తారా అని ప్రశ్నిస్తూ ఉద్యోగులకు ఈ-మెయిల్‌ పంపినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పనిచేయాలని, ఇంటి నుంచే పనిచేస్తామంటే కుదరదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఏఐకి ప్రాధాన్యాన్ని ఇస్తున్న గూగుల్ ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగించింది.