News April 24, 2025

వక్ఫ్ నిరసనలకు తాత్కాలిక బ్రేక్: ముస్లిం లా బోర్డు

image

పహల్గాం ఉగ్రదాడిపై ఆలిండియా ముస్లిం లా బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘పహల్గాం దాడి చాలా విషాదకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. ఈ విషాద సమయంలో వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనలను 3రోజుల పాటు ఆపుతున్నాం’ అని ప్రకటించింది.

News April 24, 2025

OTTలోకి కొత్త సినిమాలు

image

ఇటీవల థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు OTTలో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ పార్ట్-2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో, మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’ జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మ్యాడ్ స్క్వేర్, సైఫ్ అలీఖాన్ ‘జ్యువెల్ థీఫ్’ అందుబాటులోకి రానున్నాయి.

News April 24, 2025

పాక్‌పై భారత్ ఆంక్షలు.. నష్టాల్లో మార్కెట్లు

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్‌ కఠిన ఆంక్షలు విధించడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టపోయి 79,891 వద్ద ట్రేడ్ అవుతోంది. నిప్టీ 50 పాయింట్లు కోల్పోయి 24,278 వద్ద కొనసాగుతోంది.

News April 24, 2025

BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

image

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదంపూర్‌లోని బసంత్‌గఢ్‌లో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం బేస్ క్యాంపుల నుంచి అక్కడకు భారీగా అదనపు బలగాలను రప్పిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
——
☞ ఇది ఇప్పుడే అందిన ఇన్‌పుట్. వచ్చే మరిన్ని వివరాల ప్రకారం ఈ ఆర్టికల్ సమాచారం అప్‌డేట్ చేస్తాము.

News April 24, 2025

ఉగ్రదాడి ఎఫెక్ట్.. 90శాతం బుకింగ్స్ క్యాన్సిల్

image

పహల్‌‌గామ్ ఉగ్రదాడి ఘటన జమ్మూకశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జమ్మూకశ్మీర్ పర్యటన కోసం చేసుకున్న బుకింగ్స్ 90 శాతం వరకూ రద్దు చేసుకున్నట్లు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడకు వెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపడం లేదని తెలిపాయి. కాగా ముష్కరుల దాడి నేపథ్యంలో అక్కడినుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తిరిగి వస్తున్నారు.

News April 24, 2025

పాక్ హై కమిషనర్‌కు కేంద్రం సమన్లు

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ హై కమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వారంలో భారత్‌ను విడిచి వెళ్లాలని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌ను ఆదేశించింది. మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రేటా’ జారీ చేసింది.

News April 24, 2025

42 ఏళ్లు బహ్రెయిన్‌లో చిక్కుకున్నాడు.. ఎట్టకేలకు విముక్తి

image

కేరళకు చెందిన గోపాలన్ చంద్రన్ బతుకుదెరువు కోసం 1983లో బహ్రెయిన్ వెళ్లారు. అక్కడ ఆశ్రయం కల్పించిన యజమాని చనిపోవడంతో ఆయనకిచ్చిన పాస్‌పోర్టు కూడా మిస్ అయింది. అప్పటి నుంచి చంద్రన్ బహ్రెయిన్‌లోనే చిక్కుకున్నారు. ఎట్టకేలకు ‘ప్రవాసీ లీగల్’ సంస్థ సాయంతో ఇన్నేళ్లకు భారత్‌కు తిరిగొచ్చారు. 4 దశాబ్దాలుగా బిడ్డ రాక కోసం చూస్తున్న 95 ఏళ్ల తల్లి ఎదురుచూపులు ఫలించాయి.

News April 24, 2025

RESULTS: తండ్రీకూతుళ్లు ఒకేసారి టెన్త్ పాస్

image

AP: చిత్తూరు(D) రొంపిచెర్లకు చెందిన షబ్బీర్ 1996లో టెన్త్ ఫెయిలయ్యారు. ఇటీవల ఓపెన్ స్కూల్ పరీక్షలు రాశారు. నిన్న వెలువడిన ఫలితాల్లో షబ్బీర్ 319, ఆయన కూతురు 309 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అన్నమయ్య(D) ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేశ్ 9వ తరగతి వరకు చదివి ఆపేశారు. మళ్లీ ఇప్పుడు టెన్త్ చదివి పరీక్షలు రాయగా 268 మార్కులు వచ్చాయి. ఆయన కూతురు పూజిత 585 మార్కులు సాధించింది.

News April 24, 2025

పాక్ హీరోతో సినిమా.. భారత హీరోయిన్‌పై ఫైర్

image

పాక్ హీరో ఫవాద్ ఖాన్ మూవీని ప్రమోట్ చేశారంటూ విమర్శల నేపథ్యంలో బాలీవుడ్ నటి వాణీ కపూర్‌ ‘X’లో అందుకు సంబంధించిన పోస్టర్‌ను డిలీట్ చేశారు. ఫవాద్, వాణీ ‘అబీర్ గులాల్’లో జంటగా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ పోస్టర్‌ను నిన్న ‘X’లో షేర్ చేశారు. అయితే పహల్‌గామ్ ఉగ్రదాడి సందర్భంగా పాక్ నటుడి చిత్రాన్ని ప్రమోట్ చేస్తారా? అంటూ నెటిజన్స్ నటిపై ఫైర్ అయ్యారు. దీంతో ఆ పోస్టర్‌ను ఆమె తొలగించారు.

News April 24, 2025

చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్

image

నిన్న SRHతో మ్యాచ్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. ముంబై ఇండియన్స్(IPL&CLT) తరఫున అత్యధిక సిక్సర్లు(259) బాదిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కీరన్ పొలార్డ్(258), సూర్యకుమార్(127), హార్దిక్ పాండ్య(115), ఇషాన్ కిషన్(106) ఉన్నారు. 2009-14 మధ్య ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని ఎడిషన్లకు MIకి రోహిత్, పొలార్డ్ ప్రాతినిధ్యం వహించారు.