News April 24, 2025

మూడు రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రానున్న మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందంది. రెండురోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప పగటి వేళల్లో ప్రజలు బయటకు వెళ్లరాదని సూచించింది. కాగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో గడిచిన మూడురోజుల్లో 19మంది వడదెబ్బతో మృతిచెందారు.

News April 24, 2025

గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఐసిస్ కశ్మీర్ నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్లు ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ తరహా బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ‘ఐ కిల్ యూ’ అని గంభీర్‌కు మెయిల్ వచ్చినట్లు సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 24, 2025

ఉగ్రదాడి: ఆ సినిమా విడుదలపై నిషేధం

image

పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాను భారత్‌లో విడుదల కానిచ్చేది లేదని పశ్చిమ భారత సినీ ఉద్యోగుల సంఘం(FWICE) స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ‘ఉగ్రదాడుల నేపథ్యంలో భారత సినిమాల్లో పాక్ నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులపై నిషేధం విధిస్తున్నాం. భారతీయ సినిమా నుంచి ఎవరూ వారితో కలిసి పనిచేయకూడదు. అబిర్ గులాల్ సినిమాను భారత్‌లో నిషేధిస్తున్నాం’ అని అందులో పేర్కొంది.

News April 24, 2025

ఉగ్ర దాడి.. మరో విషాదగాథ

image

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీ(33)కి రెండేళ్ల కిందటే పెళ్లైంది. UAEలో పనిచేస్తున్న అతను సిమ్లాలో ఓ పెళ్లి కోసం ఇటీవలే భార్యతో కలిసి INDకు వచ్చారు. అది పూర్తయ్యాక పహల్‌గామ్ వెళ్లి టెర్రరిస్టుల చేతిలో మరణించారు. ఇతని తండ్రి పదేళ్ల కిందటే చనిపోగా తల్లి జ్యోతి కష్టపడి చదివించారు. నీరజ్ చనిపోవడంతో తల్లి, భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు.

News April 24, 2025

SRH ఇక ఇంటికే..?

image

ఈ ఏడాది IPLలో SRH ప్లే ఆఫ్స్ ఆశలు ఇక ముగిసినట్లేనని క్రికెట్ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 8 మ్యాచులాడి రెండే గెలవడం, రన్‌రేట్ మరీ ఘోరంగా ఉండటం, ఇప్పటికే 2 జట్లు 12 పాయింట్లు, 4 జట్లు 10 పాయింట్లు సాధించడంతో మిగిలిన అన్ని మ్యాచులూ గెలిచినా SRH ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనంటున్నారు. నిన్న రాత్రి ముంబై మీద సన్‌రైజర్స్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లోనూ రైజర్స్ విఫలమవుతున్నారు.

News April 24, 2025

ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య మరోసారి వాగ్వాదం

image

ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా పరిగణించి, నాటోలో ఎప్పటికీ చేరనని హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షున్ని ట్రంప్ కోరారు. దీనికి జెలెన్‌స్కీ ఒప్పుకోకపోవడంతో US అధ్యక్షుడిగా ఒబామా ఉన్న కాలంలోనే క్రిమియా రష్యాలో కలిసిందని ఆ విషయంపై ప్రశ్నే తలెత్తదని ట్రంప్ మండిపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విరమణపై ఇద్దరు నేతలు లండన్‌లో చర్చలు జరిపారు.

News April 24, 2025

ట్రంప్‌పై కోర్టుకెక్కిన 12 రాష్ట్రాలు!

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌లపై ఆ దేశానికి చెందిన 12 రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించాయి. ‘1977లో చేసిన చట్టం ప్రకారం టారిఫ్‌ను విధించేందుకు అత్యవసర చర్యలు తీసుకునే అధికారం అధ్యక్షుడికి లేదు. చట్టసభకు మాత్రమే ఆ అధికారముంది. ఇష్టారాజ్యంగా టారిఫ్‌లు విధించి అధ్యక్షుడు రాజ్యాంగాన్ని మీరారు. దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేశారు’ అని తమ దావాలో ప్రభుత్వాలు ఆరోపించాయి.

News April 24, 2025

నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులైకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. గదుల కోటా బుకింగ్ మ.3 గంటలకు అందుబాటులో ఉంచనుంది. అలాగే మే నెలకు సంబంధించి పద్మావతి అమ్మవారి ఆలయం స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ.200 టికెట్లను కూడా రేపు ఉ. 10 గంటలకు రిలీజ్ చేయనుంది.
వెబ్‌సైట్: <>https://ttdevasthanams.ap.gov.in/<<>>

News April 24, 2025

ఉగ్రదాడిలో హస్తం లేకపోతే పాక్‌కు ఎందుకు ఉలికిపాటు?: మాజీ క్రికెటర్

image

పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ పాత్రపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. ‘ఉగ్రదాడిలో నిజంగా పాకిస్థాన్‌ పాత్ర లేకపోయి ఉంటే ప్రధాని షెహబాజ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? బలగాలెందుకు హై అలర్ట్‌లో ఉన్నాయి? ఎందుకంటే ఉగ్రవాదులకు నిలయంగా వారిని పెంచి పోషిస్తున్నామని పాక్‌కూ తెలుసు. సిగ్గు పడాలి’ అని ట్వీట్ చేశారు.

News April 24, 2025

9 ఏళ్ల తర్వాత వరుస హాఫ్ సెంచరీలు

image

ఈ ఐపీఎల్ తొలి నాలుగైదు మ్యాచ్‌లలో విఫలమైన రోహిత్ శర్మ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ నెల 20న CSKపై 76*, నిన్న SRHపై 70 రన్స్ చేశారు. ఇలా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడం 9 ఏళ్లలో తొలిసారి. చివరిసారిగా 2016లో 62, 65, 68*, 85* రన్స్ చేశారు. అంతకుముందు 2008లో 76*, 57, 2010లో 51, 68*, 2011లో 87, 56*, 2013లో 74*, 62* బ్యాక్ టు బ్యాక్ అర్ధ శతకాలు బాదారు.