India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000గా ఉంది. https://www.bse.ap.gov.in/ సైట్‌లో HM లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినీతో పాటు గోపీపై కేసు నమోదైంది. ఈక్రమంలోనే అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ హమాస్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయుధాలను, ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలని హుకుం జారీ చేశారు. ‘హమాస్ కుక్కల్లారా.. బందీలను వెంటనే విడిచిపెట్టండి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధం ఆగాలి. బందీల కోసమంటూ ఆ దేశం నరకం సృష్టిస్తోంది. వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు’ అని సూచించారు. కాగా హమాస్‌పై పాలస్తీనా నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడం ఇదే తొలిసారి.
J&K ఉగ్రదాడి నుంచి 4 కుటుంబాలకు చెందిన 11 మందిని కశ్మీరీ దుస్తుల వ్యాపారి నజకత్ అలీ కాపాడారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీరు ఇటీవల పహల్‌గామ్ వెళ్లారు. పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఉండగా కాల్పులు జరిగాయి. అక్కడే ఉన్న నజకత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయన వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని శివాంశ్ జైన్, అరవింద్ అగర్వాల్, హ్యాపీ వధావన్, కుల్దీప్ స్థాపక్ వెల్లడించారు.
ఇవాళ RCB, RR మధ్య బెంగళూరు వేదికగా రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచులు ఆడగా RCB 16, రాజస్థాన్ 14 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు (10pts) నాలుగు, RR ఎనిమిదో (4pts) స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు RCB తన సొంత గ్రౌండ్‌లో గెలవలేదు. అటు RR గెలవాల్సిన మ్యాచుల్లో చేజేతులా ఓడుతోంది. ఆ జట్టు కెప్టెన్ శాంసన్ నేటి మ్యాచుకూ దూరం కానున్నట్లు సమాచారం.
పహల్‌గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచల్‌ప్రదేశ్‌లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌తో బార్డర్‌ను పంచుకునే చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
SRH ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. IPL హిస్టరీలో 100 ఓటములను ఎదుర్కొన్న ఏడో టీమ్‌గా నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో ఢిల్లీ(137), పంజాబ్(137), ఆర్సీబీ(132), KKR(125), ముంబై(121), రాజస్థాన్(113), CSK(105) ఉన్నాయి. SRHకు ముందు 2008-12 మధ్య హైదరాబాద్ వేదికగా ఉన్న డెక్కన్ ఛార్జర్స్ 75 మ్యాచ్‌లలో 46సార్లు ఓడిపోయింది.
AP: వేతనాల పెంపుతో పాటు వేసవి సెలవులు, సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మే 20న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. లబ్ధిదారులకు అందించే సరుకులన్నీ విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని, ఫేస్ యాప్ ఇన్, ఔట్ లొకేషన్ తొలగించాలని వారు కోరుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ డైరెక్షన్‌లో ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తారని తెలుస్తోంది. ఇది మహిళలపై అణచివేత, సామాజిక సమస్యలే కథాంశంగా రూపొందుతుందని టాక్. జులైలో షూటింగ్ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.3శాతానికి పరిమితం కానున్నట్లు ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా ఏర్పడ్డ విధాన అనిశ్చితి, ఆర్థిక బలహీనతల కారణంగా ఈ ఏడాది వృద్ధి మందగించనున్నట్లు పేర్కొంది. ఇది వరకు భారత వృద్ధిరేటు 6.7శాతం ఉండవచ్చని అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు ప్రస్తుతం 6.3శాతానికి కుదించింది. కాగా IMF భారత వృద్ధి రేటు 6.2శాతం ఉండనున్నట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.