India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టెన్త్ పరీక్షల్లో పలువురు విద్యార్థులు మార్కుల సునామీని సృష్టించారు. కాకినాడకు చెందిన <<16188784>>నేహాంజనికి<<>> 600కు 600 మార్కులు రాగా రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు 599 మార్కులు సాధించారు. వారిలో లిఖిత(విశాఖ), తన్వి(పెందుర్తి), అనీషా(ఎలమంచలి), ప్రేమసత్య లిఖిత(పిఠాపురం), హర్షిత్(బొమ్మూరు), షేక్ హిష్రత్(నంద్యాల) ఉన్నారు. మరో 14 మందికి 598 మార్కులు వచ్చాయి.
TG: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వచ్చే నెల 5న రాష్ట్రంలో పర్యటించనున్నారు. HYDలో నిర్మించిన గోల్నాక, BHEL ఫ్లైఓవర్లు, ఆరాంఘర్-శంషాబాద్ మధ్య విస్తరించిన హైవేను ప్రారంభిస్తారు. అలాగే నల్గొండ చుట్టూ రూ.516 కోట్లతో నిర్మించనున్న రింగ్ రోడ్డుకు, హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఆయన చేయాల్సిన సినిమాల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పవర్ స్టార్ తాజాగా నిర్మాతలు ఏఎం రత్నం, మైత్రీమూవీ మేకర్స్, డీవీవీ దానయ్యతో భేటీ అయినట్లు సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేస్తానని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. తొలుత హరిహర వీరమల్లు, తర్వాత ఓజీ, చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తవుతాయని టాక్.
బంగారం ధరలు పెరగడం రిటైల్ మార్కెట్లో ఆభరణాల కొనుగోలుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ధరలు హెచ్చువల్ల నగల అమ్మకాలు 9నుంచి 11శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. అయితే విక్రయ సంస్థల ఆదాయం మాత్రం 13నుంచి 15శాతం పెరగొచ్చని పేర్కొంది. 2024-25లో భౌగోళిక, రాజకీయ ఆందోళనలతో పసిడి ధరలు 25శాతం పెరిగాయి. ఫలితంగా రిటైలర్ల అమ్మకాలు 4-5శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
AP: ప్రధాని మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆరోజు మ.3 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మ.3.30 గంటలకు అమరావతికి వచ్చి 1.1 కి.మీ మేర 15 నిమిషాలపాటు రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. సా.4 నుంచి 5 వరకు సభలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు.
ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ ఉదంతంలో మరో హృదయవిదారక అంశం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న అతను హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. వీసా రిజెక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌గా భావించే పహల్‌గామ్ వెళ్లి ఉగ్రతూటాకు బలయ్యారు. అతడికి చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని ఉండేదని, అందుకే నేవీలో చేరాడని పేరెంట్స్ చెప్పారు.
AP: అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 2025-26 విద్యాసంవత్సరంలో 25% ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఫస్ట్ క్లాస్‌లో సీట్ల కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా ధ్రువీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు అవసరం. విద్యార్థుల వయసు 01.06.2025 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/
J&K పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్‌లో గుబులు మొదలైంది. ISI హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా సరిహద్దు గ్రామాలను ఆర్మీ ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌ఫోర్స్ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఉరి దాడికి కౌంటర్‌గా 2016లో POK, పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే.
TG: తీవ్ర కాలేయ వ్యాధి(లివర్ సిరోసిస్) బారిన పడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 50 శాతం వేతనంతో కూడి ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వారు కోలుకునే వరకు ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు గుండె జబ్బు, టీబీ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, ఎయిడ్స్, మూత్రకోశ, మెదడు వ్యాధులకు ఇలాంటి సదుపాయం ఉండగా కాలేయ వ్యాధులకూ విస్తరించారు.
సింహాచలంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు టికెట్ల(రూ.300, రూ.1,000) విక్రయాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో సింహాచలం పాత పీఆర్వో ఆఫీస్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉంటాయి.
Sorry, no posts matched your criteria.