News April 24, 2025

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: రామ్మోహన్

image

కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖ ఎయిర్‌పోర్టులో ఎంతో బాధతో స్వీకరించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చనిపోయిన వారికి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నివాళులు అర్పించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామన్నారు.

News April 24, 2025

భారత్ ఆరోపణలు.. పాక్ ప్రధాని రేపు కీలక భేటీ

image

పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని దాయాది దేశంపై భారత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో విజయవంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న వేళ దాడులకు పాల్పడినట్లు విమర్శించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ రేపు నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ తెలిపారు. భారత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారన్నారు.

News April 24, 2025

SRH ఘోర ఓటమి

image

IPLలో SRH ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉప్పల్‌లో ముంబైతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 144 పరుగుల టార్గెట్‌ను ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 70 రన్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సూర్య 40*, జాక్స్ 22 రన్స్ చేశారు. ఈ ఓటమితో SRH ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు కాగా ముంబైకి ఇది వరుసగా నాలుగో విజయం.

News April 23, 2025

పాత బెడ్‌పై నిద్రిస్తున్నారా?

image

మనం పడుకునే బెడ్ కూడా నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏడేళ్లకు మించి ఒకే పరుపును ఉపయోగించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పాత బెడ్‌పై నిద్రిస్తే చేతులు, కాళ్ల నొప్పులతోపాటు నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. వెన్నునొప్పి సమస్యకు దారితీస్తుంది. పరుపుల తయారీలో వాడే నాఫ్తలీన్, బెంజీన్ వంటి వాటి వల్ల అలర్జీ, దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. 2-3 ఏళ్లకోసారి బెడ్స్‌ను మార్చడం బెటర్.

News April 23, 2025

టీ20ల్లో 12వేల పరుగుల క్లబ్‌లోకి హిట్‌మ్యాన్

image

SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. 456 మ్యాచుల్లో హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించారు. ఈ 12K T20 క్ల‌బ్‌లో కోహ్లీ తర్వాత చోటు దక్కించుకున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించారు. ఓవరాల్‌ T20 క్రికెట్‌లో 8వ ప్లేయర్‌గా నిలిచారు. 12వేలు పరుగులు చేసిన లిస్టులో గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, పోలార్డ్, కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోష్ బట్లర్ ఉన్నారు.

News April 23, 2025

చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

image

ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన అవతరించారు. హైదరాబాద్‌తో మ్యాచులో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పారు. 237 ఇన్నింగ్సుల్లో ఆయన ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ నిలిచారు. అగ్ర స్థానంలో ఆండ్రూ టై ఉన్నారు. అతడు 208 మ్యాచుల్లోనే 300 వికెట్ల మార్కును అందుకున్నారు.

News April 23, 2025

ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

image

పహల్‌గామ్‌లో టూరిస్టులపై నిన్న ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ దేశస్థుడు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ఉగ్రదాడిని ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు.

News April 23, 2025

ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: CM చంద్రబాబు

image

AP: పహల్‌గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి CM చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామన్నారు. చంద్రమౌళితో పాటు కావలికి చెందిన మరో వ్యక్తి మరణించగా, ఇరు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉగ్రదాడి జరిగిందని, సరిహద్దుల్లో చొరబాటుదారులను సమర్థంగా అడ్డుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

News April 23, 2025

నేడు అర్ధరాత్రి ఓటీటీలోకి ‘ఎంపురాన్’

image

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.280 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగానూ రికార్డు సృష్టించింది.

News April 23, 2025

ట్రెండింగ్: ఇషాన్ కిషన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

image

IPL: MIతో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే ఔట్ అయిన ఇషాన్ కిషన్‌పై SMలో ఫిక్సింగ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బ్యాట్‌కు బంతి తగలకుండానే ఔట్ అయినట్లు భావించి పెవిలియన్‌కు <<16194207>>చేరడమే<<>> దీనికి కారణం. బౌలర్, కీపర్, ఫీల్డర్లెవరూ అప్పీల్ చేయకుండానే క్రీజు నుంచి వెళ్లిపోవడంపై క్రీడాభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. BCCI తిరిగి ఇతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వడం దండగ అని సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.