India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసిన నేపథ్యంలో పాక్‌లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశం లభించింది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. సింధుకు ఉప నదులైన చీనాబ్, జీలం భారత్‌లో పుట్టగా, చైనాలో జన్మించిన సింధు..IND నుంచి పాక్‌లోకి ప్రవహిస్తుంది.
ముంబైతో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్ ఓ మాదిరి స్కోరు చేసింది. టాపార్డర్ వైఫల్యంతో ఓవర్లన్నీ ఆడి 143/8 స్కోర్ నమోదు చేసింది. క్లాసెన్ (71) ఒంటరి పోరాటం చేశారు. జట్టు 35/5తో కష్టాల్లో ఉన్న దశలో క్లాసెన్ క్రీజులోకి వచ్చి ఆదుకున్నారు. అతడికి అభినవ్ (43) సహకారం అందించారు. హెడ్ (0), అభిషేక్ (8), ఇషాన్ (1), నితీశ్ (2) ఘోరంగా విఫలమయ్యారు. బౌల్ట్ 4, చాహర్ 2 వికెట్లు తీశారు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర క్యాబినేట్ భేటీ ముగిసింది. PM మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. దాదాపు 2గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదుల ఏరివేత, తదితరాలపై చర్చించారు. మరోవైపు, కేంద్ర హోంశాఖ కాసేపట్లో ఈ భేటీపై ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఉగ్రవాదుల సమాచారం తెలిపిన వారికి రూ.20లక్షల నజరానా అందిస్తామని అనంతనాగ్ పోలీసులు తెలిపారు.
TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులపాటు తీవ్ర వడగాలులతోపాటు ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పహల్గామ్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. AK-47తో ఆయనను వెంటాడి వేటాడి చంపినట్లు సమాచారం. కాగా మధు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. హాలిడే ట్రిప్ కోసం తన ఫ్యామిలీతో కలిసి ఆయన కశ్మీర్ పర్యటనకు వెళ్లి ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
వేసవి కావడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే సెల్‌ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడికి ఫోన్లు ఓవర్ హీట్ అవుతాయి. ఆ సమయంలో మొబైల్‌కు అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. అప్పుడు ఫోన్ వాడకూడదు. చల్లగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి, బ్యాటరీ కూల్ అయ్యాకే వినియోగించాలి.
MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు హెడ్, కిషన్, అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి వెంటవెంటనే వెనుదిరిగారు. ఉప్పల్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై ఇలాంటి బ్యాటింగ్ ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 4.1 ఓవర్లకు SRH స్కోర్ 13/4.
IPL మెగా వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి కొందరిని సొంతం చేసుకున్నాయి. కానీ తీరా టోర్నీలో మాత్రం వారిని బెంచ్‌కే పరిమితం చేస్తున్నాయి. వీరిలో నటరాజన్ (రూ.10.75 కోట్లు), జాకబ్ బేతేల్ (రూ.2.6cr), గెరాల్డ్ కొయెట్జీ (రూ.2.4cr), డెవాల్డ్ బ్రెవిస్ (రూ.2.2cr), లామ్రోర్ (రూ.1.7cr), తుషారా (రూ.1.6cr), మపాకా (రూ.1.5cr), పావెల్ (రూ.1.5cr), హర్దీ (రూ.1.25cr) ఎంగిడి రూ.కోటి) తదితరులు ఉన్నారు.
AP: మద్యం కుంభకోణం వ్యవహారంలో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కాగా, తాజాగా A8 చాణక్యను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, రాజ్ కసిరెడ్డి విచారణలో పూర్తి వివరాలు వెల్లడించలేదని సిట్ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జమ్మూ కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కుల్గాంలోని టంగ్‌మార్గ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పహల్గామ్ దాడికి కారణమైన TRF ఉగ్రవాదుల కమాండర్ అసిఫ్ ఫౌజీని ట్రాప్ చేశారు. టెర్రరిస్టులు తలదాచుకున్న ప్రాంతాన్ని అన్నివైపుల నుంచి బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఈ దాడుల్లో అసిఫ్ ఫౌజీ నేరుగా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.