News November 5, 2025

భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు BCCI జట్టును ప్రకటించింది. పంత్, అక్షర్ జట్టులోకి వచ్చారు.
✒ టెస్ట్ టీమ్: గిల్(C), పంత్ (VC), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురెల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్‌, నితీశ్, సిరాజ్, ఆకాశ్, కుల్దీప్

✒ ODI IND-A టీమ్: తిలక్‌(C), రుతురాజ్‌(VC), అభిషేక్‌, పరాగ్‌, ఇషాన్‌, బదోని, నిషాంత్‌, V నిగమ్‌, M సుతార్‌, హర్షిత్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్, ఖలీల్, ప్రభ్‌సిమ్రాన్

News November 5, 2025

GET READY: మరికాసేపట్లో..

image

మరికొన్ని నిమిషాల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా సా.6.49 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి కనువిందు చేయనున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే భూమికి దగ్గరగా చంద్రుడు రావడంతో 14% పెద్దగా, 30% అధిక కాంతితో దర్శనమిస్తాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.

News November 5, 2025

ఓటేసేందుకు వెళ్తున్న బిహారీలు.. ఆగిన నిర్మాణ పనులు

image

దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర్మాణం, హోటల్స్ సహా అనేక రంగాల్లో లక్షలాది మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారు. ఈనెల 6, 11 తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వారంతా స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా రంగాలపై ప్రభావం పడుతోంది. దాదాపు 8 లక్షల మంది బిహార్ కార్మికులు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు అంచనా. వీరంతా వచ్చే వరకు 10 రోజులు పనులకు ఇబ్బంది తప్పదని నిర్మాణ పరిశ్రమ తెలిపింది.

News November 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 57 సమాధానాలు

image

1. శబరి రాముడి కోసం ‘మాతంగి రుషి’ ఆశ్రమంలో ఎదురు చూసింది.
2. విశ్వామిత్రుడి శిష్యులలో శతానందుడు ‘గౌతముడి’ పుత్రుడు.
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ‘అలక’.
4. నారదుడు ‘వీణ’ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు.
5. కాలానికి అధిపతి ‘యముడు’. కొన్ని సందర్భాల్లో కాళిదేవి, కాళుడు అని కూడా చెబుతారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 5, 2025

రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

image

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్‌ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.

News November 5, 2025

NEET-SS దరఖాస్తులు ప్రారంభం

image

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.

News November 5, 2025

ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

News November 5, 2025

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

image

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

News November 5, 2025

ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69వేలు!

image

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?

News November 5, 2025

ఉమ్మనీరు ఎక్కువైతే ఏం చేయాలంటే?

image

తల్లికి షుగర్ నియంత్రణలో లేకపోతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్ట్రా సౌండ్‌ గైడెడ్‌ ఆమ్నియోసెంటెసిస్‌ ద్వారా కూడా ఉమ్మనీరును కొంతవరకు నియంత్రణలో ఉంచవచ్చు. తల్లికి డెలివరీ కాంప్లికేషన్లు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు అధిక ఉమ్మనీరు కాన్పు సమయంలో బిడ్డకు ప్రాణాంతకమై నియోనేటల్ సేవలు అవసరమవుతాయి. కాబట్టి అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే మంచిది.