India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

1. శబరి రాముడి కోసం ‘మాతంగి రుషి’ ఆశ్రమంలో ఎదురు చూసింది.
2. విశ్వామిత్రుడి శిష్యులలో శతానందుడు ‘గౌతముడి’ పుత్రుడు.
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ‘అలక’.
4. నారదుడు ‘వీణ’ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు.
5. కాలానికి అధిపతి ‘యముడు’. కొన్ని సందర్భాల్లో కాళిదేవి, కాళుడు అని కూడా చెబుతారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?

తల్లికి షుగర్ నియంత్రణలో లేకపోతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్ట్రా సౌండ్ గైడెడ్ ఆమ్నియోసెంటెసిస్ ద్వారా కూడా ఉమ్మనీరును కొంతవరకు నియంత్రణలో ఉంచవచ్చు. తల్లికి డెలివరీ కాంప్లికేషన్లు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు అధిక ఉమ్మనీరు కాన్పు సమయంలో బిడ్డకు ప్రాణాంతకమై నియోనేటల్ సేవలు అవసరమవుతాయి. కాబట్టి అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే మంచిది.

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి ఉ.కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

TG: జూ.పంచాయతీ కార్యదర్శుల ఎంపికలో భాగంగా 2 రోజులపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ వెల్లడించింది. 2019లో కోర్టు వివాదాల నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారితో పాటు కొత్తగా ఎంపికైన 172 మంది ధ్రువపత్రాలను ఈ నెల 10, 11 తేదీల్లో ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల వరకు పరిశీలించనున్నట్లు తెలిపింది.

AP: రాష్ట్రంలో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటల నమోదుకు గడువును మరో 2 రోజులు పొడిగించినట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫానుతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ-క్రాప్ నమోదు వంద శాతం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై జగన్ అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వస్తే ఈ-క్రాప్ నమోదు అయిందో లేదో చూపిస్తానని సవాల్ చేశారు.
Sorry, no posts matched your criteria.