News September 9, 2025

ఆర్మీ చేతుల్లోకి పాలన.. నేపాల్‌లో హై అలర్ట్

image

నేపాల్‌లో యువత ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇవాళ రాత్రి గం.10PM నుంచి లా&ఆర్డర్‌ను చేతుల్లోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశంలో హై అలర్ట్ విధించింది. ఆందోళనలను ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు ప్రజా ఆస్తులు ధ్వంసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నాయంది. అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. పరిస్థితులపై సమీక్షించి అప్డేట్స్ ఇస్తామని వెల్లడించింది.

News September 9, 2025

క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించిన మంత్రి

image

TG: క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ఏర్పాటు ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఆయన వర్చువల్‌గా సంగారెడ్డిలో ప్రారంభించారు. క్యాన్సర్‌ను సమయానికి గుర్తించకపోతే ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందన్నారు. రాబోయే కాలంలో 70% క్యాన్సర్ కేసులు పెరగొచ్చని, అందుకే ముందుగా స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.

News September 9, 2025

రేపే భారత్ మ్యాచ్.. టీమ్ ఇదేనా?

image

ఆసియా కప్-2025లో భాగంగా భారత్ రేపు తన తొలి మ్యాచ్ ఆడనుంది. యూఏఈతో జరిగే ఆ మ్యాచ్ బుధవారం రాత్రి 8 గం.కు ప్రారంభం కానుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం జట్టు అంచనా..
టీమ్: గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, జితేశ్ శర్మ (WK), బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

News September 9, 2025

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ భేటీ

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ కోరారు. దీనికి సంబంధించి 90% భూసేకరణ పూర్తయిందని ఆయనకు వివరించారు. రావిర్యాల-అమన్‌గల్-మన్ననూర్ రోడ్డును 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని కోరారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుమతివ్వాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

News September 9, 2025

రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

image

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన CP రాధాకృష్ణన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రజాజీవితంలో మీ దశాబ్దాల అనుభవం దేశ ప్రగతికి ఎంతో దోహదపడనుంది. మీ బాధ్యతల్లో విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నా’ అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘పేదల ఉన్నతికి, సమాజ సేవకు జీవితం అంకితం చేశారు. ఉత్తమ VPగా నిలుస్తారన్న నమ్మకం నాకు ఉంది’ అని PM మోదీ పేర్కొన్నారు. అమిత్‌షా, CBN, పవన్, లోకేశ్, జగన్ ఆయనకు విషెస్ తెలిపారు.

News September 9, 2025

ALERT: ఇక ఎగ్జామ్ పేపర్స్ షేర్ చేస్తే జైలుకే!

image

అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. SM, ఆన్‌లైన్లో ఎగ్జామ్ పేపర్స్‌పై చర్చించడం, షేర్ చేయడం నేరమని తెలిపింది. ఇలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఎగ్జామ్స్‌‌లో అవకతవకలు నివారించడానికి కేంద్రం ఇటీవల పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024‌ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జైలు శిక్ష, భారీ ఫైన్స్‌ ఎదుర్కోవాల్సి ఉంటుందని SSC హెచ్చరించింది.

News September 9, 2025

10 పోస్టులకు APPSC నోటిఫికేషన్

image

AP: అటవీ శాఖలో 10 ఠాణేదార్ (అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌తో సమానం)పోస్టులకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 1 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ ఉంటుందని, త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని APPSC పేర్కొంది. పూర్తి వివరాలు, ఎగ్జామ్ సిలబస్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 9, 2025

తమిళనాడు నుంచి మూడో ఉపరాష్ట్రపతి

image

దేశానికి అత్యధిక మంది ఉపరాష్ట్రపతులను అందించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తాజాగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వైస్ ప్రెసిడెంట్‌ అయిన మూడో వ్యక్తి కావడం విశేషం. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్(1952-62, రెండు సార్లు), రామస్వామి వెంకటరామన్(1984-87) ఎన్నికయ్యారు. కాగా ఉమ్మడి AP నుంచి గతంలో జాకీర్ హుస్సేన్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సేవలందించారు.

News September 9, 2025

ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి

image

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి స్పందించారు. ‘ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమినీ స్వీకరించాలి. మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా’ అని తెలిపారు. కాగా ఫలితాల్లో NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.

News September 9, 2025

ప్చ్.. ఓటేయడం రాని నేతలను ఎన్నుకున్నాం!

image

ఉపరాష్ట్రపతి ఎన్నికలో 15 మంది MPల <<17659975>>ఓట్లు<<>> చెల్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకే ఓటు వేయరాకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేతలను ఎన్నుకొని ఏం లాభమని అంటున్నారు. ఈ 15 ఓట్లతో ఫలితం మారకున్నా మెజార్టీపై ప్రభావం పడేది. గతంలో TGలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో భారీగా గ్రాడ్యుయేట్ల ఓట్లు చెల్లకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మీ కామెంట్?