News October 28, 2024

DMK, AIDMKలో విజయ్ ముంచేది దేనిని?

image

యాక్టర్ విజయ్ TVK పార్టీ TN రాజకీయ సమీకరణాలను మార్చేస్తోంది. DMK, AIDMKలో ఎవరి కొంప ముంచుతుందోనన్న చర్చ నెలకొంది! ఇన్నాళ్లూ DMKకు అండగా ఉన్న క్రిస్టియన్, దళిత ఓట్లలో మెజారిటీ TVKకు వెళ్తాయని అంచనా. జయలలిత తర్వాత పటిష్ఠ నాయకత్వం లేక నైరాశ్యంలో ఉన్న AIDMK యూత్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల న్యూట్రల్ ఓట్లూ కొంత టర్నవుతాయి. ఇది అసెంబ్లీలో 37% నుంచి లోక్‌సభలో 26%కి ఓట్లు పడిపోయిన DMKకే నష్టం కావొచ్చని అంచనా.

News October 28, 2024

TVK అధినేత విజయ్‌కు పవన్ విషెస్

image

తమిళ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు జనసేనాని పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు. సాధువులు & సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ యాత్రను ప్రారంభించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. కాగా నిన్న విజయ్ నిర్వహించిన టీవీకే పార్టీ మహా సభకు లక్షలాదిగా జనం తరలి వచ్చిన విషయం తెలిసిందే.

News October 28, 2024

గణపతి పూజకు మోదీ రావడంపై CJI చంద్రచూడ్ వివరణ ఇదే

image

CJI, హైకోర్టు CJల ఇళ్లకు PM, CMలు మర్యాదపూర్వకంగా వెళ్తుంటారని CJI DY చంద్రచూడ్ అన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, పిల్లల పెళ్లిళ్లు, శుభకార్యాలు, కోర్టు భవనాల నిర్మాణాల కోసం జడ్జిలు, పొలిటీషియన్స్ తరచుగా కలుస్తారన్నారు. ఎవరి బాధ్యతలేంటో వారికి తెలుసని, కోర్టు మ్యాటర్స్ అసలు డిస్కస్ చేయరని స్పష్టం చేశారు. గణపతి పూజకు మోదీ తమ ఇంటికి రావడంపై విమర్శలు అనవసరం, అర్థరహితమని వెల్లడించారు.

News October 28, 2024

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా?

image

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ OTT స్ట్రీమింగ్ ఖరారైనట్లు తెలుస్తోంది. నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సోషల్ సబ్జెక్ట్ మూవీ యావరేజ్‌గా నిలిచింది. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

News October 28, 2024

రెండు రోజుల సమయం కావాలి: రాజ్ పాకాల

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని పోలీసులకు KTR బావమరిది రాజ్ పాకాల లేఖ రాశారు. రెండు రోజుల గడువు కోరుతూ మోకిల పోలీసులకు న్యాయవాదుల ద్వారా లేఖ పంపారు. ఇవాళ విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.

News October 28, 2024

జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కన్నుమూత

image

ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ప్రభుత్వంపై పోరాడిన జస్టిస్ కేఎస్ పుట్టస్వామి(98) కన్నుమూశారు. ఆయన కర్ణాటక హైకోర్టు జడ్జిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2012లో ఆయన ఆధార్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత ఆధార్‌కూ కొన్ని పరిమితులున్నాయంటూ కోర్టు తీర్పునిచ్చింది.

News October 28, 2024

శాప్ నెట్‌ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: సొసైటీ ఫర్ ఏపీ నెట్‌వర్క్(శాప్ నెట్)ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్ నెట్ సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేసింది. 2018లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాప్ నెట్, మన టీవీ ద్వారా విద్యారంగానికి సేవలు అందించింది. ఇప్పుడు ఆ సేవలను విద్యామండలి నుంచే సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

News October 28, 2024

కోహ్లీ దేశవాళి క్రికెట్ ఆడాలి: DK

image

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రాణించలేకపోవడంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఫామ్‌ను పొందేందుకు కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడడం బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్పిన్‌ బౌలింగ్‌ను కోహ్లీ ఎదుర్కోలేకపోవడంతో ఆయన ఈ సజెషన్ ఇచ్చారు. భారత్ 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై సిరీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

News October 28, 2024

పాకిస్థాన్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

image

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ టీమ్ వైట్ బాల్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీని PCB నియమించింది. నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లకు ఆయన కోచ్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. గ్యారీ కిర్‌స్టెన్ రిజైన్‌ను యాక్సెప్ట్ చేసినట్లు ప్రకటించింది. AUS తరఫున 71 టెస్టులు, 97 వన్డేలు ఆడిన గిలెస్పీ మొత్తం 401 వికెట్స్ తీశారు. ప్రస్తుతం పాక్ టెస్ట్ టీమ్ కోచ్‌గా ఉన్నారు.

News October 28, 2024

కమలకే భారతీయ అమెరికన్ల మద్దతు

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో రానున్న ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికనే దానిపై ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే వివరాలు వెల్లడించింది. 61శాతం మంది భారతీయ అమెరికన్లు హారిస్ వైపే మొగ్గుచూపుతున్నారని, ట్రంప్‌నకు 31శాతం మంది మద్దతు ఉందని పేర్కొంది. నవంబర్ 5న ఎన్నికలు జరుగుతాయి.