News April 23, 2025

మే తొలి వారంలో టెన్త్ ఫలితాలు?

image

TG: తెలంగాణలో పదో తరగతి ఫలితాలపై అప్డేట్ వచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో రిజల్ట్స్ విడుదల కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మెమోలపై సర్కారు నిర్ణయం కోసం ఎస్సెస్సీ బోర్డు ఎదురుచూస్తోంది. అందులో మార్కులు ఎలా ముద్రించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే ఫలితాలు విడుదల చేయనున్నారు.

News April 23, 2025

ఫలితాలు రాకముందే ఆత్మహత్య.. తీరా రిజల్ట్స్ చూస్తే..

image

TG: గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని బాధతో రిజల్ట్స్ రాకముందే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అతనికి నిన్న వచ్చిన ఫలితాలలో 391 మార్కులు వచ్చాయి. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల్లో విఫలమయ్యామని మనస్తాపంతో ఐదుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

News April 23, 2025

ఫలితాలు రాకముందే ఆత్మహత్య.. తీరా రిజల్ట్స్ చూస్తే..

image

TG: గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని బాధతో రిజల్ట్స్ రాకముందే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అతనికి నిన్న వచ్చిన ఫలితాలలో 391 మార్కులు వచ్చాయి. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల్లో విఫలమయ్యామని మనస్తాపంతో ఐదుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

News April 23, 2025

PHOTO: పహల్‌గామ్‌లో దాడి చేసింది వీరే

image

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫొటో బయటకు వచ్చింది. నలుగురు ముష్కరులు కలిసి ఉన్న ఫొటోను అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.

News April 23, 2025

టెన్త్ ఫలితాలు.. ఒక్క మార్క్ మాత్రమే వచ్చింది!

image

ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ స్టూడెంట్‌కు షాకింగ్ ఫలితాలు వచ్చాయి. 600 మార్కులకు గాను ఒక్క మార్క్ మాత్రమే వచ్చింది. సైన్స్‌లో ఒక్క మార్కు రాగా, మిగతా 5 సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వచ్చాయి. దీంతో ఫలితాలు ఇలా రావడం ఫస్ట్ టైమ్ అనే చర్చ జరుగుతోంది.
*ప్రైవసీ దృష్ట్యా సదరు విద్యార్థి వివరాలను ఇక్కడ ఇవ్వట్లేదు.

News April 23, 2025

IPL: నల్ల బ్యాండ్లు ధరించనున్న ప్లేయర్లు

image

పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఇవాళ SRHvsMI మ్యాచులో ప్లేయర్లు, అంపైర్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించనున్నారు. అలాగే మ్యాచుకు ముందు నిమిషం పాటు మౌనం పాటిస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి. చీర్ లీడర్లు, ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్‌ను కూడా నిర్వాహకులు రద్దు చేశారని పేర్కొన్నాయి. ఇవాళ HYD ఉప్పల్ స్టేడియంలో రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.

News April 23, 2025

‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే?’

image

బాలీవుడ్ సెలబ్రిటీలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాకు సంబంధించి ‘All Eyes On Rafah’ అని SMలో ఊదరగొట్టిన బీటౌన్ బడా నటులంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. J&K పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతే వారికి పట్టడం లేదంటూ విమర్శిస్తున్నారు. ‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే’ అని నిలదీస్తున్నారు.

News April 23, 2025

ఒక్క మార్కు తేడాతో 1.85లక్షల మంది ఫెయిల్

image

TG: ఇంటర్మీడియట్‌లో ఒక్క మార్కు తేడాతో 1.85లక్షల మంది విద్యార్థులు ఫెయిలైనట్లు బోర్డ్ వర్గాలు తెలిపాయి.. BiPCలో ఓ విద్యార్థినికి అత్యధికంగా 997 మార్కులు రాగా, MPCలో నలుగురు విద్యార్థులు 996 మార్కులు సాధించారు. దేవరకొండ గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివిన ఓ విద్యార్థిని BiPCలో 996 మార్కులు సాధించింది. గురుకుల కళాశాలల్లో 83.17శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మెుత్తంగా 71.37శాతం ఉత్తీర్ణత నమోదైంది.

News April 23, 2025

ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్‌లు విడుదల

image

పహల్‌గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ముగ్గురికి సంబంధించిన స్కెచ్‌లను భద్రతా సంస్థలు రిలీజ్ చేశాయి. వారిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా అధికారులు గుర్తించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 23, 2025

PSR ఆంజనేయులుకు రిమాండ్

image

AP: ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులుకు విజయవాడ మూడో ఏసీజేఎం కోర్టు మే 7 వరకు రిమాండ్ విధించింది. ముంబై నటి జెత్వానీ కేసులో నిన్న సీఐడీ పోలీసులు ఆయనను HYDలో అరెస్టు చేశారు. ఆమెపై అక్రమ కేసు బనాయించిన కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఈయన జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు.