India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రాణించలేకపోవడంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఫామ్‌ను పొందేందుకు కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడడం బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్పిన్ బౌలింగ్‌ను కోహ్లీ ఎదుర్కోలేకపోవడంతో ఆయన ఈ సజెషన్ ఇచ్చారు. భారత్ 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై సిరీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ పురుషుల క్రికెట్ టీమ్ వైట్ బాల్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీని PCB నియమించింది. నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లకు ఆయన కోచ్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. గ్యారీ కిర్‌స్టెన్ రిజైన్‌ను యాక్సెప్ట్ చేసినట్లు ప్రకటించింది. AUS తరఫున 71 టెస్టులు, 97 వన్డేలు ఆడిన గిలెస్పీ మొత్తం 401 వికెట్స్ తీశారు. ప్రస్తుతం పాక్ టెస్ట్ టీమ్ కోచ్‌గా ఉన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో రానున్న ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికనే దానిపై ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే వివరాలు వెల్లడించింది. 61శాతం మంది భారతీయ అమెరికన్లు హారిస్ వైపే మొగ్గుచూపుతున్నారని, ట్రంప్‌నకు 31శాతం మంది మద్దతు ఉందని పేర్కొంది. నవంబర్ 5న ఎన్నికలు జరుగుతాయి.
HYDలో 163సెక్షన్(పాత 144) అమలుతో వస్తున్న విమర్శలపై CP సీవీ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. ‘ఈ నోటిఫికేషన్‌కి, దీపావళి వేడుకలకు సంబంధం లేదు. కొన్ని మూకలు సచివాలయం, సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్‌ల ముట్టడికి ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ తెలిపింది. అందుకే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఈ నోటిఫికేషన్ ఇచ్చాం. ఇది కర్ఫ్యూ కూడా కాదు. కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.
TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీకి సంబంధించిన కేసులో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఆయనకు చెందిన భవనానికి పోలీసులు నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
తాను ఫేస్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘నేను ఎక్కువగా ఐబ్రోస్ చేయించుకోవడాన్ని ఇష్టపడతా. కొన్నేళ్లుగా నా ఐబ్రోస్‌లో మార్పులు వస్తుండటంతో నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నానని కొందరు భావించి ఉండొచ్చు’ అని ఆమె అన్నారు.
TG: అసెంబ్లీలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష BRS పీఏసీ ఛైర్మన్ నియామకంపై అభ్యంతరం తెలిపింది. ఈ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించింది. BRS నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన BRS నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో కారు పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.
TG: ఈసారి పత్తి పంట సాగు చేసిన రైతులకు కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. పంటలు సరిగా పండక, పండిన పంటకు ఆశించిన ధర దక్కకపోవడంతో రైతన్నలు ఆవేదనకు గురవుతున్నారు. క్వింటాకు రూ.6,200 కూడా దాటడం లేదని వాపోతున్నారు. పెట్టుబడి ఖర్చులైనా రావడం లేదని, ఇక చేసిన అప్పులు ఎలా తీర్చాలని విలపిస్తున్నారు. అటు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా చోట్ల పంటను ధ్వంసం చేసి వేరే పంట వేయాల్సిన దుస్థితి నెలకొంది.
AP: రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారని YCP ట్వీట్ చేసింది. ‘మూడు పోర్టులను జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలోనే చేపట్టారు. ఇప్పుడు పోర్టులు పూర్తవుతున్న దశలో వాటిని ఆపాలని కమీషన్ల కోసం కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నావా చంద్రబాబు’ అని పేర్కొంది.
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.490, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.450 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.79,800కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.73,150గా నమోదైంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ ధర రూ.1,07,000గా ఉంది.
Sorry, no posts matched your criteria.