India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జమ్మూకశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యాలయాలపై పార్టీ జెండాను ఇవాళ అవతనం చేయాలన్నారు. సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు.
AP: పదో తరగతి ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. మొత్తం 6,14,459 మంది పరీక్షలు రాయగా, 4,98,585 మంది పాసైనట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా (93.90%) తొలి స్థానంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా (47.64%) చివరిస్థానంలో నిలిచాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు అత్యధిక ఉత్తీర్ణత శాతం (95.02%) సాధించాయి.
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేశ్ X వేదికగా ఫలితాలను ప్రకటించారు. Way2News యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఆ మార్క్స్ జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
SHARE IT
J&K పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన సాజిద్‌ను సైఫుల్లా కసూరీగానూ పిలుస్తారు. NIA ఇతడిని కఠినమైన ఉగ్రవాదిగా పేర్కొంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్స్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థానీ ISI, ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 28కి చేరినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు (నేపాల్, UAE) ఉన్నట్లు తెలిపారు. నాలుగు ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. నిన్న ఉగ్రవాదులు సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురు టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
పహల్గామ్ ఘటనతో జమ్మూకశ్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అక్కడ ఉన్న టూరిస్టులు వారి నివాస స్థలాలకు పయనమవుతున్నారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయం ప్రయాణికులతో నిండిపోయింది. రద్దీ దృష్ట్యా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. కాగా రహదారిపై కొండచరియలు పడటంతో తాత్కాలికంగా దానిని మూసివేశారు. దీంతో రైలు లేదా విమాన మార్గాల్లో వెళ్లాల్సి వస్తుంది.
ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరోసారి దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతను పెంచారు. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా ఉరి నాలా వద్ద నియంత్రణ రేఖ నుంచి ఇద్దరు, ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. వారి చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ అడ్డుకుంది. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భారీగా కాల్పులు జరుగుతున్నాయి.
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉ.10 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. Way2News యాప్ ద్వారా సులభంగా, వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్కుల లిస్ట్ వస్తుంది. దాన్ని సులభంగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
J&Kలో అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారతీయులు కోపంతో రగిలిపోతున్నారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో పాకిస్థాన్‌కు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మరోసారి దాయాది గడ్డపైకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని, భారత్ అంటేనే భయపడేలా చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.