India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫొటోను జాతీయ మీడియా బయటపెట్టింది. రైఫిల్ పట్టుకుని పరిగెత్తుతూ కనిపించాడు. ఈ దాడిలో 8-10 మంది పాల్గొన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వారిలో 5-7 మంది పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పేర్కొంటున్నాయి. కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చేస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివిధ దేశాల నాయకులు Xలో పోస్టులు పెట్టారు. దాడిలో నష్టపోయిన వారి ఆలోచనలు నా మదిలో మెదులుతున్నాయని UK ప్రధాన మంత్రి తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జర్మన్ ఛాన్స్‌లర్ అన్నారు. ఈ సమయంలో యూరప్ మీతో ఉంటుందని EUకమిషన్ ఛైర్మన్ Xలో తెలిపారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఉప్పల్ వేదికగా ఇవాళ రా.7.30కు SRH-MI మధ్య మ్యాచ్ జరగనుంది. హ్యాట్రిక్ విజయాల జోరును కొనసాగించాలని హార్దిక్ సేన, హోంగ్రౌండులో అదరగొట్టి గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తున్నాయి. 5 ఓటములతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న SRHకు ప్రతి మ్యాచూ కీలకమే. ఒక్కటి ఓడినా ప్లేఆఫ్స్ ఛాన్స్ సంక్లిష్టమవుతుంది. దీంతో కమిన్స్ సేన సర్వశక్తులూ ఒడ్డనుంది.
ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు?
జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించారు. విశాఖకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి <<16187025>>చంద్రమౌళితోపాటు<<>> కావలి(నెల్లూరు జిల్లా)కి చెందిన మధుసూదన్ కూడా తూటాలకు బలయ్యారు. బెంగళూరులో స్థిరపడిన మధుసూదన్ ఫ్యామిలీతో కలిసి ఇటీవల కశ్మీర్‌కు విహారయాత్రకు వెళ్లారు. హైదరాబాద్ SIB కార్యాలయంలో పనిచేస్తున్న మనీశ్ రంజన్(బిహార్ వాసి) కూడా కాల్పుల్లో చనిపోయారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన టెర్రర్ అటాక్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చ.అ.లకు తగ్గకుండా, 600 చ.అ.లకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని సూచించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని, అనర్హులను ఎంపిక చేస్తే ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
పహల్గామ్ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో గాయపడ్డ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలని, వారికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని Xలో పోస్ట్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, DVV దానయ్య నిర్మిస్తున్నారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్‌పోల్ (84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 43 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఆయన 7 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేశారు. 18 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 167 మ్యాచుల్లో 10,100 రన్స్, 148 వికెట్స్ సాధించారు. ఆయన మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది.
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లోని కరాచి నుంచి రెండు ఎయిర్ ఫోర్స్ సరఫరా విమానాలు ఉత్తర సరిహద్దుకు చేరుకున్నాయని Xలో పోస్టుల వైరలవుతున్నాయి. వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసింది. వీటిలో మిలిటరీ సామగ్రి తరలించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ సరిహద్దు జమ్ముాకశ్మీర్‌కు సమీపాన ఉంటుంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లేదు.
Sorry, no posts matched your criteria.