News September 5, 2025

శివకార్తికేయన్ ‘మదరాసి’ రివ్యూ&రేటింగ్

image

తమిళనాడులోకి గన్ కల్చర్‌ రాకుండా అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటమే ‘మదరాసి’. యాక్షన్ సీన్లు, హీరోయిన్‌తో శివకార్తికేయన్ కెమిస్ట్రీ బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నతంగా ఉన్నాయి. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో డైరెక్టర్ మురగదాస్ దారి తప్పారు. కథను కొత్తగా చెప్పడంలో సక్సెస్ కాలేకపోయారు. ఊహించే సీన్లు, సాగదీత విసుగు తెప్పిస్తాయి. అనిరుధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
రేటింగ్: 2.25/5

News September 5, 2025

హెల్త్ ఎమర్జెన్సీగా తురకపాలెం మరణాలు: సీఎం చంద్రబాబు

image

AP: గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలపై మరింత లోతుగా పరిశోధన చేయాలని CM చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. శని, ఆదివారాల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపి సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలన్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

News September 5, 2025

భవిష్యత్తులో GST 3.0.. నిర్మల ఏం చెప్పారంటే?

image

సామాన్యులపై భారం తగ్గేలా జీఎస్టీ 2.0 తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ India Todayతో అన్నారు. భవిష్యత్తులో జీఎస్టీ 3.0 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. దాని ద్వారా ధరల్లో స్థిరత్వం, పారదర్శకత తీసుకురానున్నట్లు వెల్లడించారు. చిరు వ్యాపారుల్లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ట్యాక్స్‌ల నిబంధనలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. వారిపై భారం పడకుండా చూస్తామని నిర్మల వెల్లడించారు.

News September 5, 2025

రాస్ టేలర్ సంచలన నిర్ణయం

image

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన తల్లి పుట్టిన సమోవా దేశం తరఫున త్వరలో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ దేశ పాస్‌పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 41 ఏళ్ల టేలర్ కివీస్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేలకుపైగా పరుగులు సాధించారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు.

News September 5, 2025

వరద బాధితులకు అక్షయ్ కమార్ రూ.5 కోట్ల సాయం

image

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ వరద బాధితుల కోసం ఆయన రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. దీనిని ప్రజా సేవగా భావిస్తున్నానని, విరాళం అనుకోనని ఆయన తెలిపారు. కాగా వరద బాధితులకు ఇప్పటికే ప్రీతి జింటా-రూ.33 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు దిల్జిత్ దోసాంజ్, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, సోనూ సూద్ తదితరులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటామని వెల్లడించారు.

News September 5, 2025

ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ

image

SA టీ20లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. లీగ్ కమిషనర్ గ్రేమీ స్మిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే సీజన్ వరకు దాదా ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తారు. ఈ లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పటివరకు ఆ జట్టు ఒక్క టైటిల్ కూడా కొట్టలేదు. ఒకే ఒక్కసారి రన్నరప్‌గా నిలిచింది. దాదా ఆధ్వర్యంలో ఈసారి కప్ సాధించాలని ప్రిటోరియా భావిస్తోంది.

News September 5, 2025

హైదరాబాద్‌కు సీబీఐ డైరెక్టర్.. కాళేశ్వరం కేసు గురించేనా?

image

TG: CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్ HYDకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఈ కేసు గురించి చర్చించేందుకే సీబీఐ డైరెక్టర్ వచ్చారా? అనే చర్చ మొదలైంది. మరోవైపు న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసును దర్యాప్తు చేయాలని ఇటీవల సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ కేసు విషయమై ప్రవీణ్ సూద్ వచ్చారా? అనేది తెలియాల్సి ఉంది.

News September 5, 2025

ఓటీటీలో ట్రెండింగ్‌ నం.1గా ‘కన్నప్ప’: మంచు విష్ణు

image

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని విష్ణు ట్వీట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నంబర్ 1గా ట్రెండ్ అవుతోందని తెలిపారు. ప్రేక్షకులు చూపుతున్న ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.

News September 5, 2025

రేపు రాష్ట్రానికి 9,039 మెట్రిక్ టన్నుల యూరియా: తుమ్మల

image

TG: రాష్ట్రంలోని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉపశమనం కలిగే వార్త చెప్పారు. రేపు రాష్ట్రానికి మరో 9,039 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు తెలిపారు. రానున్న 20 రోజుల్లో 10వేల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. బస్తాల కోసం రైతులు దుకాణాల ముందు రోజులకొద్దీ వేచిచూస్తున్నారు.

News September 5, 2025

ఈ జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?