India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్ HYDకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఈ కేసు గురించి చర్చించేందుకే సీబీఐ డైరెక్టర్ వచ్చారా? అనే చర్చ మొదలైంది. మరోవైపు న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసును దర్యాప్తు చేయాలని ఇటీవల సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ కేసు విషయమై ప్రవీణ్ సూద్ వచ్చారా? అనేది తెలియాల్సి ఉంది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని విష్ణు ట్వీట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నంబర్ 1గా ట్రెండ్ అవుతోందని తెలిపారు. ప్రేక్షకులు చూపుతున్న ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.
TG: రాష్ట్రంలోని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉపశమనం కలిగే వార్త చెప్పారు. రేపు రాష్ట్రానికి మరో 9,039 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు తెలిపారు. రానున్న 20 రోజుల్లో 10వేల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. బస్తాల కోసం రైతులు దుకాణాల ముందు రోజులకొద్దీ వేచిచూస్తున్నారు.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పీఏ దేవరాజులును సిట్ విచారణకు పిలిచింది. కేసుకు సంబంధించి ఆయనను ప్రశ్నిస్తోంది. ఆయన చెప్పే సమాధానాలు కేసుకు కీలకంగా మారనున్నట్లు సిట్ భావిస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో వైసీసీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు.
AP: రబీ సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. యూరియా స్టాక్, సప్లై, పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో యూరియా కొరత ఉంది. ఆ జిల్లాల్లో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి. యూరియా నిల్వల్లో తేడా లేకుండా చూసుకోవాలి’ అని ఆదేశించారు.
TG: HYD వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. గతేడాది డీజే చప్పుళ్లతో చాలామంది ప్రాణాలు కోల్పోయారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా సహకరిస్తోందన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ఉ.6 గంటలకు ప్రారంభమై మ.1.30 గంటలలోపు పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 29వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంట్లో ఫంక్షన్లు, పండుగలకు తప్ప మహిళలు చీరలు కట్టుకోవడం బాగా తగ్గింది. అయితే రోజూ చీరను ధరించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. చీర భారతీయ సంస్కృతి, సంప్రదాయ, గౌరవానికి చిహ్నం. చీర థర్మోస్‌లాగా పనిచేసి వేసవిలో శరీరాన్ని చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. చీర వదులుగా ఉండటం వలన రక్తప్రసరణ బాగుంటుంది. అలాగే చీర మనలో పాజిటివ్ ఎనర్జీని, కాన్ఫిడెన్స్‌ను తీసుకొస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
మహిళలు పీరియడ్స్‌లో న్యాప్‌కిన్స్, మెన్‌స్ట్రువల్ కప్స్, ట్యాంపన్స్ వాడతారు. కానీ వీటి ఎక్స్‌పైరీడేట్ గురించి పట్టించుకోరు. ఎక్స్‌పైర్ అయిన ప్రొడక్ట్స్‌పై బ్యాక్టీరియా, వైరస్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని వాడితే జననేంద్రియాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటిని వినియోగించేముందు లేబుల్‌ని తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 455 సెక్యూరిటీ అసిస్టెంట్(మోటార్ ట్రాన్స్‌పోర్ట్) ఉద్యోగాలకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఏడాది అనుభవం, మోటార్ మెకానిజం పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. 18-27ఏళ్ల వయసుండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, డ్రైవింగ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://www.ncs.gov.in/
Sorry, no posts matched your criteria.