News November 5, 2025

ఈ సరసమైన రీఛార్జ్ ప్యాక్స్ అవసరం.. AIRTEL, JIOలకు విజ్ఞప్తులు!

image

అతితక్కువ మొబైల్ డేటాను వాడే సీనియర్ సిటిజన్లు, WiFi యూజర్లను దృష్టిలో ఉంచుకుని రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని AIRTEL, JIOలకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ప్రతి నెలా ₹100 కంటే తక్కువ ధరకు వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను అందించండి. అవసరం లేకపోయినా, ప్రజలు డేటాను తీసుకోవలసి వస్తుంది. డైలీ 1GB & వాయిస్ కాల్స్ ఇచ్చే నెల, వార్షిక ప్లాన్స్ ఇవ్వండి. BSNLలో సరసమైన ప్లాన్స్ ఉన్నాయి’ అని సూచిస్తున్నారు.

News November 5, 2025

ఇంటి చిట్కాలు

image

* కార్పెట్లను శుభ్రం చేయడానికి పావుకప్పు వెనిగర్, చెంచా మొక్కజొన్న పిండి, పావు కప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ల మీద చల్లి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* చెంచా కాఫీపొడి, గుప్పెడు పుదీనా ఆకులు, చెంచా బేకింగ్ సోడా, కాసిన్ని నిమ్మతొక్కలు, కొద్దిగా నిమ్మరసం ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.

News November 5, 2025

రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

image

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్‌పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

News November 5, 2025

ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించవచ్చా?

image

దీపం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. అయితే దీపాన్ని మరో దీపంతో వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోనే తిరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఇలా చేస్తే మొదటి దీపం ఆకర్షించిన ప్రతికూలత రెండవ దీపానికి చేరుతుంది. దీనివల్ల ఆ ప్రతికూల శక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మీ చుట్టూర వ్యాపిస్తుంది. ఇలా జరగకూడదన్నా, అశుభ సంఘటనల నుంచి బయటపడలన్నా ఈ తప్పు చేయకూడదు’ అని సూచిస్తున్నారు.

News November 5, 2025

‘మీర్జాగూడ’ ప్రమాదం.. బస్సును 60 మీటర్లు ఈడ్చుకెళ్లిన టిప్పర్

image

TG: రంగారెడ్డి(D) మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్.. బస్సును ఢీకొట్టిన తర్వాత 50-60M ఈడ్చుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బ్రేక్ వేయకపోవడం లేదా పడకపోవడం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 24 మంది చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

News November 5, 2025

ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్‌లో విజయం

image

న్యూయార్క్ (అమెరికా) మేయర్‌గా <<18202940>>మమ్‌దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.

News November 5, 2025

‌ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

<>ఇండియన్ బ్యాంక్‌<<>> 6 ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ(ఫైర్), బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులకు రూ.175. వెబ్‌సైట్: https://indianbank.bank.in

News November 5, 2025

వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

image

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.

News November 5, 2025

‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేశ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, MPTC, ZPTC, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.

News November 5, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

image

కార్తీక పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.900 పతనమై రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ. 2,000 తగ్గి రూ. 1,63,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.