India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తురకపాలెం <<17599008>>మరణాలపై<<>> కారణాలు ఇప్పటికీ తెలియలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. వైద్యపరీక్షల్లో మెలియాయిడోసిస్ ఆనవాళ్లు లేవని తేలిందని, రక్తనమూనాలను చెన్నై ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. ఫలితాలు ఇంకా రాలేదని, వైరస్ కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. మరణాల విషయంలో అలసత్వం వహించిన DMHOపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే గ్రామంలో సాధారణ పరిస్థితి తీసుకొస్తామన్నారు.
ముంబై పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. రేపు గణేశ్ నిమజ్జనంలో విధ్వంసం సృష్టిస్తామని వారికి బాంబు బెదిరింపులు అందాయి. లష్కర్ ఏ జిహాదీ పేరిట.. ’14మంది పాక్ టెర్రరిస్టులు భారత్‌లోకి చొరబడ్డారు. 34 వాహనాల్లో మానవ బాంబులను సిద్ధం చేశాం. 400 కిలోల ఆర్డీఎక్స్‌తో పేలుళ్లు ప్లాన్ చేశాం. కోటిమంది చనిపోగలరు’ అని వాట్సాప్ మెసేజ్ పంపారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు.
TG: తెలంగాణ ఉద్యమంలో టీచర్లదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేశారని గుర్తు చేశారు. శిల్పకళావేదికలో గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చాలా చోట్ల కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందడం లేదని తెలిపారు. పదేళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని పేర్కొన్నారు.
ఇన్ని రోజులు అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చాలాచోట్ల రహదారులు కూడా కొట్టుకుపోయాయి. ఊళ్లకి ఊళ్లు మునిగిపోయాయి. నిన్నటి నుంచి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 10 వరకు ఈ తరహా వాతావరణమే ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.
APలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని మంత్రి లోకేశ్ PM మోదీని కోరారు. APకి సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు సంస్కరణలు అమలు చేస్తున్నామని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మోదీకి వివరించారు. రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని మోదీ బదులిచ్చారు.
AP: అనంతపురం(D) బుక్కరాయసముద్రంలో నెల క్రితం అమ్మవారి హుండీ డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఉన్నట్టుండి వారి పిల్లలకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఎత్తుకెళ్లిన సొమ్ము(₹లక్షకుపైగా)తో పాటు ఓ లేఖ కూడా ఆలయం వద్ద పెట్టి వెళ్లారు. ఆ లేఖలో ‘చోరీ చేసిన తర్వాత మా పిల్లల ఆరోగ్యం క్షీణించింది. అందుకే డబ్బు తిరిగి వదిలేస్తున్నాం’ అని రాశారు. దీంతో గ్రామస్థులు, పోలీసులు ఆశ్చర్యపోయారు.
రేపు HYDలోని ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది. ప్రయాణికులు, భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వేడుకలు చేసుకోవాలని సూచించింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ రుణఖాతాలు మోసపూరితమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించినట్టు Stock Exchangesకు ఆ సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే BOB ఆరోపణలను ఖండిస్తున్నట్టు అనిల్ అధికార ప్రతినిధి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఆయన న్యాయ సలహాలు తీసుకుంటారని వెల్లడించారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి తిరుమల శ్రీదేవి(HM-పండిట్ నెహ్రూ GVMC మున్సిపల్ హైస్కూల్), తెలంగాణ నుంచి పవిత్ర(పెన్‌పహడ్ స్కూల్) అవార్డు అందుకున్నారు. ఇక ప్రొఫెసర్ విభాగంలో ఏపీకి చెందిన ప్రొ.విజయలక్ష్మి, దేవానందకుమార్, TG నుంచి గోయల్, వినీత్ అవార్డులు స్వీకరించారు.
Sorry, no posts matched your criteria.