News November 5, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

image

కార్తీక పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.900 పతనమై రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ. 2,000 తగ్గి రూ. 1,63,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 5, 2025

భార్యకు చిత్రహింసలు.. 86 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష

image

ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వృద్ధాప్యంలో ఓ వ్యక్తి భార్యపై క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. బంధువులను కలవనీయకుండా శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అవమానించాడు. బాధలను తట్టుకోలేని ఆమె కోర్టుకు వెళ్లింది. దీంతో 86ఏళ్ల ధనశీలన్‌కు 6 నెలల జైలు శిక్ష, ₹5K ఫైన్ విధించింది. దీనిపై మరోకోర్టు స్టే విధించగా, శిక్ష కరెక్టేనని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. వివాహం అంటే బాధలను భరించడం కాదని చెప్పింది.

News November 5, 2025

నేడు గిరి ప్రదక్షిణ చేస్తే..?

image

అరుణాచలంలోని అన్నామలై కొండను శివలింగంగా భావించి చేసే ప్రదక్షిణనే ‘గిరి ప్రదక్షిణ’ అంటారు. అయితే ఈ ప్రదక్షిణను కార్తీక పౌర్ణమి రోజున చేయడం వల్ల మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. 14KM ఉండే ఈ గిరి చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరి, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పున్నమి వెలుగులో ప్రదక్షిణ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.

News November 5, 2025

త్వరలో పెన్షన్లపై తనిఖీలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే చేయూత పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీలు చేసేందుకు సెర్ప్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు, మండల పింఛన్ ఇన్‌ఛార్జులకు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. పెన్షన్ల పంపిణీ, చెల్లింపులో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది.

News November 5, 2025

విమాన ప్రయాణికులకు శుభవార్త

image

విమాన టికెట్ల రద్దు అంశంపై ప్రయాణికులకు DGCA గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్లు బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి ఛార్జీ లేకుండా రద్దు చేసుకోవడం/ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. క్రెడిట్ కార్డు ద్వారా అయితే 7 రోజుల్లో, ట్రావెల్ ఏజెంట్/పోర్టల్ ద్వారా బుక్ చేసుకుంటే 21 పనిదినాల్లో రిఫండ్ అందుతుంది. దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5D, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో 15D లోపు ఈ సౌకర్యం వర్తించదు.

News November 5, 2025

ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

image

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.

News November 5, 2025

పంచాయతీ కార్యదర్శులపై కీలక నిర్ణయం

image

AP: గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్(GPDO)గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వేతనాల్లో మార్పుల్లేకుండా ప్రస్తుతమున్న 5 కేడర్‌లను నాలుగుకు కుదించింది. ఇకపై 7,224 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పనిచేయనున్నాయి. 359 అర్బన్, 3,082 గ్రేడ్-1, 3,163 గ్రేడ్-2, 6,747 గ్రేడ్-3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. అదే మాదిరిగా ఉద్యోగుల కేడర్‌ మారింది.

News November 5, 2025

నేడు కార్తీక పౌర్ణమి.. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు

image

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని, శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు పొందుతారని, సాయంత్రం దీపారాధన తర్వాత పండ్లు తినొచ్చని అంటున్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని, ఈ రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు.

News November 5, 2025

సినిమా అప్డేట్స్

image

* తాను నటిస్తోన్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కోసం హీరో నవీన్ పొలిశెట్టి ఓ పాట పాడారు. దీన్ని ఈ నెల మూడో వారంలో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం JAN 14న విడుదల కానుంది.
* సుధా కొంగర డైరెక్షన్‌లో శివకార్తికేయన్ నటిస్తోన్న ‘పరాశక్తి’ నుంచి ఫస్ట్ సింగిల్ రేపు రిలీజవనుంది.
* తాను రీఎంట్రీ ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిరాధారమని, ఎలాంటి చిత్రాలనూ నిర్మించడం లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.

News November 5, 2025

APSRTCలో 277 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>APSRTC‌<<>>లో 277 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి నవంబర్ 8 ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ముందు www.apprenticeshipindia.gov.in నమోదు చేసుకోవాలి. అనంతరం వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి జిల్లాను ఎంచుకుని పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.118. వెబ్‌సైట్: https://apsrtc.ap.gov.in/ మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.