India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG:రామగుండం కార్పొరేషన్ కేంద్రంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. పెద్దపల్లి జిల్లా మొత్తాన్ని రుడా పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు 191 గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో చేరడంపై గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక ప్రభుత్వం GO జారీ చేసే ఛాన్సుంది.
సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి(85) బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో కన్నుమూశారు. తొలుత సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు. వియ్యాలవారి కయ్యాలు, ప్రతిబింబాలు, ఒక దీపం వెలిగింది, శ్రీవినాయక విజయం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త వంటి సినిమాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వర్‌రావుతో 1982లో ఆయన తీసిన ‘ప్రతిబింబాలు’ 2022లో విడుదలైంది.
ఏపీలో పెట్టుబడులపై టెస్లా CFO వైభవ్ తనేజాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. USలోని ఆస్టిన్‌లో ఉన్న టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో 72GW రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తే తమ లక్ష్యమని, దీనికి టెస్లా వంటి గ్లోబల్ కంపెనీ సహాయ, సహకారాలు అవసరమని పేర్కొన్నారు.
భవ్యమందిరంలో అయోధ్య రామయ్య తొలి దీపావళి వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. పండగరోజున సాకేతపురి, సరయూ తీరం 28 లక్షల దీపాలతో శోభాయమానంగా వెలిగిపోనుంది. UP Govt ఈ దీపోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీపాలు ఎక్కువసేపు వెలిగేలా, కాలుష్యం వెలువడకుండా ప్రత్యేకమైన కుందులను తయారు చేయిస్తోంది. 2వేల సూపర్ వైజర్లు, 30వేల మంది వాలంటీర్లు 55 ఘాట్లలో దీపాలు అలంకరిస్తారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయి.
TG: దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. పెంచిన పెన్షన్‌ను 2024 జనవరి నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ హామీ అమలు కోసం త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు ప్రకటించింది.
TG: పెండింగ్‌లో ఉన్న 5 DAల్లో ఒక్కటి మాత్రమే ప్రభుత్వం ఇస్తామని చెప్పడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇది తమను నిరాశకు గురిచేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం లైట్ తీసుకుందని, సంఘాలు సైతం పోరాడలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపడం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
AP: CM చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 6న క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించేందుకు ప్రతిపాదనలను నవంబర్ 4వ తేదీ సా.4 గంటలలోపు పంపాలని అన్ని శాఖలను CS నీరబ్ ఆదేశించారు. ఈ భేటీలో పూర్తిస్థాయి బడ్జెట్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్‌తో ముగియనుంది.
AP: అన్న క్యాంటీన్ పేరుతో ప్రభుత్వం ఛారిటబుల్ ట్రస్టును వచ్చే నెలలో ఏర్పాటుచేయనుంది. ఇందుకు IT శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాలు అనుమతి ఇచ్చాయి. విరాళాలు ఇచ్చే వారికి IT మినహాయింపు లభించనుంది. కార్పొరేట్ కంపెనీలు, సామాన్యుల నుంచి విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ అందుబాటులోకి రానుంది. 100 క్యాంటీన్లలో మూడు పూటలకు కలిపి రూ.26.25 లక్షలు ఇచ్చేవారికి రోజంతా వారిపేరుతోనే ఆహారం అందిస్తారు.
AP: పాఠశాల విద్య తర్వాత ఏం చదవాలి? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారి కోసం ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ గైడెన్స్ నిపుణులను విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. దీనిద్వారా విద్యార్థులను ఉత్తమ భవిష్యత్ వైపు మార్గనిర్దేశనం చేసేందుకు అవకాశం ఉంటుంది. యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా టీచర్లకు కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై నేటి నుంచి 3 రోజులు విజయవాడలో శిక్షణ ఇవ్వనుంది.
తెలంగాణలో రేపటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. కొన్ని రోజులుగా మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండగా, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.