India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. పెంచిన పెన్షన్‌ను 2024 జనవరి నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ హామీ అమలు కోసం త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు ప్రకటించింది.
TG: పెండింగ్‌లో ఉన్న 5 DAల్లో ఒక్కటి మాత్రమే ప్రభుత్వం ఇస్తామని చెప్పడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇది తమను నిరాశకు గురిచేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం లైట్ తీసుకుందని, సంఘాలు సైతం పోరాడలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపడం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
AP: CM చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 6న క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించేందుకు ప్రతిపాదనలను నవంబర్ 4వ తేదీ సా.4 గంటలలోపు పంపాలని అన్ని శాఖలను CS నీరబ్ ఆదేశించారు. ఈ భేటీలో పూర్తిస్థాయి బడ్జెట్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్‌తో ముగియనుంది.
AP: అన్న క్యాంటీన్ పేరుతో ప్రభుత్వం ఛారిటబుల్ ట్రస్టును వచ్చే నెలలో ఏర్పాటుచేయనుంది. ఇందుకు IT శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాలు అనుమతి ఇచ్చాయి. విరాళాలు ఇచ్చే వారికి IT మినహాయింపు లభించనుంది. కార్పొరేట్ కంపెనీలు, సామాన్యుల నుంచి విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ అందుబాటులోకి రానుంది. 100 క్యాంటీన్లలో మూడు పూటలకు కలిపి రూ.26.25 లక్షలు ఇచ్చేవారికి రోజంతా వారిపేరుతోనే ఆహారం అందిస్తారు.
AP: పాఠశాల విద్య తర్వాత ఏం చదవాలి? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారి కోసం ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ గైడెన్స్ నిపుణులను విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. దీనిద్వారా విద్యార్థులను ఉత్తమ భవిష్యత్ వైపు మార్గనిర్దేశనం చేసేందుకు అవకాశం ఉంటుంది. యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా టీచర్లకు కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై నేటి నుంచి 3 రోజులు విజయవాడలో శిక్షణ ఇవ్వనుంది.
తెలంగాణలో రేపటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. కొన్ని రోజులుగా మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండగా, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్యయోజన(AB-PMJAY)ను రేపు ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధిపొందుతారు. 29వేలకు పైగా ఆస్పత్రుల్లో సేవలు లభిస్తాయి. అర్హులైనవారు PMJAY పోర్టల్ లేదా ఆయుష్మాన్ భారత్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
TG: పలు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని <<14463743>>సస్పెండ్<<>> చేసిన అధికారులు వారిలో 10 మందిని డిస్మిస్ చేశారు. ఈ మేరకు ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.
బాడీ గార్డే తనను లైంగికంగా వేధించాడని నటి అవికా గోర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గతంలో నేను ఓ బాడీగార్డును నియమించుకున్నా. ఎవరూ నన్ను తాకకుండా చూడాల్సిన అతడే ఓ ఈవెంట్లో అసభ్యంగా తాకాడు. నేను సీరియస్ కాగా వెంటనే సారీ చెప్పాడు. కానీ మరోసారి కూడా అలాగే ప్రవర్తించాడు. అప్పుడు ధైర్యం లేక కొట్టలేదు. ఇప్పుడు మాత్రం ధైర్యం ఉంది. ఎవరైనా అలా బిహేవ్ చేస్తే కచ్చితంగా కొడతా’ అని తెలిపారు.
క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. బిహార్‌లో అధికార పార్టీ జేడీయూలో చేరారు. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సమక్షంలో కండువా కప్పుకున్నారు. సీఎం నితీశ్ కుమార్ తనకు ఆదర్శమని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు. కాగా గతంలో ఆయన ఇదే పార్టీలోనే ఉండేవారు. అయితే కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దడం కోసం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.