News September 5, 2025

మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం: సీఎం

image

AP: ప్రజలకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. అందుకు ప్రత్యేకమైన మెళకువలు అవసరం’ అని తెలిపారు. ప్రభుత్వం క్వాంటమ్‌ వ్యాలీని ఏర్పాటు చేయబోతోందని, అవసరమైన ఎకో సిస్టమ్‌ తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.

News September 5, 2025

అనుష్క ‘ఘాటీ’ రివ్యూ&రేటింగ్

image

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ‘ఘాటీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఓ అమ్మాయి లెజెండ్‌గా ఎలా మారిందనేదే కథ. అనుష్క, చైతన్యరావు (విలన్) నటన, సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి. విక్రమ్ ప్రభు పరిధి మేరకు నటించారు. మూవీ గ్రాండ్‌గా ఉన్నప్పటికీ ఔట్‌డేటెడ్ స్టోరీ, ఎమోషన్స్ లేకపోవడం, సంగీతం, కథ చెప్పే విధానం సరిగ్గా లేకపోవడం మైనస్.
Way2News రేటింగ్: 2.25/5

News September 5, 2025

920 ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

image

* భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌(BEML)లో 440 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. www.bemlindia.in
* బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) కాంట్రాక్టు ప్రాతిపదికన 5 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు. బీఈ/బీటెక్ పాసైన వారు అర్హులు. https://www.bis.gov.in/
* IOCL లో 475 అప్రెంటిస్ పోస్టులు. టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ అర్హత. https://iocl.com/

News September 5, 2025

దండించినా.. ప్రయోజకులయ్యేలా చేశారు!

image

ప్రస్తుతం ఉన్నత పదవుల్లో, ఉద్యోగాల్లో ఉన్న ఎంతోమంది ఎప్పుడో ఓసారి టీచర్ల చేతిలో దెబ్బలు తినే ఉంటారు. క్రమశిక్షణ కోసమే వారలా దండిస్తూ సరైన మార్గంలో నడిపించారు. దండించిన గురువుల దెబ్బలు మనల్ని గాడిలో పెడితే, అభిమాన ఉపాధ్యాయుల ప్రోత్సాహం జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధింపజేసింది. ఇవన్నీ ఇప్పుడు మధుర జ్ఞాపకాల్లా మారిపోయాయి. ఇప్పటి పిల్లలకు ఇవి తెలియవు. మీరు చదివిన స్కూల్‌, ఫేవరెట్ టీచర్ ఎవరు? COMMENT

News September 5, 2025

అందమైన ముక్కోణం, అదిరే రుచి= సమోసా!

image

భారతీయులకు సమోసా ఓ ఎమోషన్. మధ్యప్రాచ్యానికి చెందిన ఈ స్నాక్‌ వ్యాపారులు, యాత్రికుల ద్వారా 13వ శతాబ్దంలో ఇండియాలోకి ప్రవేశించింది. మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో ఇది ఒక విలాసవంతమైన వంటకంగా ఉండేది. తొలుత సమోసాలో మాంసం ఉండేదట. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దీనిలో బంగాళాదుంపను పెట్టారు. ఈ మార్పుతో ఇది ప్రజలకు మరింత చేరువైంది. తక్కువ నూనెతో, ఎయిర్-ఫ్రైయర్‌తో చేసిన సమోసాలు తినడం మేలు. *వరల్డ్ సమోసా డే*

News September 5, 2025

BRSకు సుప్రీం కేసీఆరే: హరీశ్ రావు

image

TG: కవిత <<17599702>>ఆరోపణలపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు పరోక్షంగా స్పందించారు. BRSకు సుప్రీం కేసీఆరే అని, ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే KCR తమకు నేర్పించారని తెలిపారు. ‘కాళేశ్వరం’ అవినీతికి హరీశ్ రావు కారణమంటూ ఆరోపణలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

News September 5, 2025

US: రక్షణ శాఖ ఇకపై యుద్ధ శాఖ

image

US రక్షణశాఖ (పెంటగాన్‌)ను ఇక నుంచి యుద్ధశాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్)గా పిలవాలని ట్రంప్ ఆదేశించారు. ‘డిఫెన్స్ సెక్రటరీ’ని ‘వార్ సెక్రటరీ’గా పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. నిజానికి ఆ దేశ రక్షణశాఖ 1789-1947 మధ్య డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌గా ఉండేది. ఆ తర్వాత రక్షణ శాఖగా మార్చారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ పాత పేరు పెట్టారు. ప్రత్యర్థులకు తమ యుద్ధ సన్నద్ధతను తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News September 5, 2025

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

image

ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. 10 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 80,863 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు లాభం పొంది 24,788 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. M&M, రిలయన్స్, టాటా మోటర్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాల్లో, ITC, HDFC, ICICI, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News September 5, 2025

తర్వాతి సినిమా నా కూతురు చూసేలా ఉండాలి: అలియా

image

తాను చేయబోయే తర్వాతి సినిమా కూతురు రాహా చూసేలా ఉండాలనుకుంటున్నట్లు హీరోయిన్ అలియా భట్ చెప్పారు. కూతురు చూసే సినిమాలను తాను ఇప్పటివరకూ చేయలేదని అన్నారు. చిన్నారి కోసమే జానర్ మార్చి కామెడీ కథలను ఎంచుకోనున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే కొత్త ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె నటిస్తోన్న ‘లవ్ అండ్ వార్’ 2026 మార్చి 20న రిలీజ్ కానుంది.

News September 5, 2025

రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరిగి రూ.1,07,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.700 ఎగబాకి రూ.98,650 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,36,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.