News October 29, 2024

త్వరలోనే వాళ్లు అరెస్ట్ అవుతారు: సీఎం రేవంత్

image

TG: మీడియాతో చిట్‌చాట్‌లో ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులు రద్దు చేశామని, త్వరలోనే వాళ్లు అరెస్ట్ అవుతారని చెప్పారు. ఇక బీఆర్ఎస్ నేతలు మూసీ పరీవాహక ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని, దమ్ముంటే కేటీఆర్, హరీశ్, ఈటల తనతో రావాలని సవాల్ విసిరారు.

News October 29, 2024

రేపు డబుల్ ధమాకా

image

సినీ అభిమానులకు రేపు డబుల్ ట్రీట్ లభించనుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ‘జై హనుమాన్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా నుంచి కూడా టైటిల్ & ఫస్ట్‌లుక్ రేపు సాయత్రం 4.05 గంటలకు విడుదలవనుంది. దీంతో దీపావళి తమకు ముందుగానే వచ్చేస్తోందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

News October 29, 2024

టీడీపీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఇసుక: VSR

image

AP: టీడీపీ పచ్చ ఇసుకాసురులు ప్రజల్ని హింసిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘ఉచిత ఇసుక ఇస్తామంటూ ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు తిరగబడండి అంటూ పిలుపునిస్తున్నారు. దీన్ని చూస్తుంటే సీఎంగా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పాల్సిన పని లేదు. బాబుని పొగిడే పచ్చమీడియా ప్రజల ఇబ్బందుల్ని గమనించాలి. టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఇసుకను విడిపించండి’ అని Xలో విమర్శలు చేశారు.

News October 29, 2024

VIRAL: విల్లా కొంటే లంబోర్గిని ఫ్రీ

image

యూపీకి చెందిన ఓ రియల్ వ్యాపారి తన వద్ద విల్లా కొంటే లంబోర్గిని కార్ ఫ్రీ అని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. నోయిడాకు చెందిన జేపీ గ్రీన్స్ తమ వెంచర్‌లోని రూ.26 కోట్ల విలువైన విల్లాను కొనుగోలు చేస్తే రూ.4 కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్ కారు ఇస్తానని తెలిపారు. స్విమ్మింగ్ పూల్, థియేటర్, గోల్ఫ్ కోర్స్ కోసం అదనంగా రూ.50 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు.

News October 29, 2024

ఏడాదిలో కేసీఆర్ అనే పదం కనిపించదు: CM రేవంత్

image

TG: కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని ఆపై KCR అనే పదమే కనిపించదని CM రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. KCR ఉనికి లేకుండా KTRను వాడాను. త్వరలో KTR ఉనికి లేకుండా బావ హరీశ్‌ను వాడతాను. ఇద్దరినీ ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. రాజ్‌పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. దీపావళి పార్టీ అని ఎలా అంటారు?’ అని CM ప్రశ్నించారు.

News October 29, 2024

నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు ప్రారంభం: CM

image

TG: మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు నవంబర్ 1న ప్రారంభిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ‘నవంబర్‌లోపు టెండర్లు పిలుస్తాం. మూసీపై ముందడుగే తప్ప వెనకడుగు వేయం. మొదటి విడతలో బాపూఘాట్ నుంచి 30 కి.మీ మేర పనులు చేపడతాం. ఇప్పటికే రూ.140 కోట్లతో DPR తయారీకి ఆదేశాలిచ్చాం. నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని సదుపాయాలు కల్పిస్తాం. మూసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.

News October 29, 2024

CM చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్

image

AP: భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి ఆయన సీఎంతో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనిని అమరావతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 29, 2024

ఆ మాటకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కొల్లు

image

AP: నిర్మాణ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. బోట్ మెన్ అసోసియేషన్ల ద్వారా కూడా ఉచిత ఇసుకను అందిస్తామని పేర్కొన్నారు. సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు. లారీలకు సైతం అనుమతులిచ్చామన్నారు. గత ప్రభుత్వం మైనింగ్ వ్యవస్థలో దోచుకుందని ఆరోపించారు.

News October 29, 2024

పునీత్‌ను గుర్తుచేసుకుంటూ భార్య ఎమోషనల్ ట్వీట్

image

కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ మూడో వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అశ్విని ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అప్పూ మన జ్ఞాపకాల్లో, మనం చేసే పనుల్లో ఎప్పటికీ మనతో ఉంటారు. మన హృదయాల్లో ఓ మార్గదర్శిగా శాశ్వతంగా ఉండిపోతారు’ అని ఆమె Xలో పోస్ట్ చేశారు. అభిమానులు సైతం పునీత్‌ చేసిన గొప్ప పనులను గుర్తుచేసుకుంటున్నారు. ఆయన స్థాపించిన సేవా సంస్థలు ఎంతోమందికి చదువు చెప్పిస్తున్న విషయం తెలిసిందే.

News October 29, 2024

అమెరికాకు షాక్: GEకి పెనాల్టీ వేసిన మోదీ సర్కార్!

image

అమెరికా/GEకి కేంద్రం షాక్ ఇచ్చినట్టు సమాచారం. తేజస్ ఫైటర్ జెట్లకు ఇంజిన్ల సరఫరా ఆలస్యం చేయడంతో భారీ స్థాయిలో జరిమానా విధించినట్టు తెలుస్తోంది. నిజానికి 2023 మార్చి నాటికే డెలివరీ ఆరంభించాల్సింది. మోదీ, రాజ్‌నాథ్ చాలాసార్లు దీనిపై చర్చించినా US ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టులోని పెనాల్టీ క్లాజ్‌ను ఉపయోగించి ఒకటి కన్నా ఎక్కువ సార్లే ఫైన్ వేశారని వార్తలొస్తున్నాయి.