News September 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 5, 2025

శుభ సమయం (5-09-2025) శుక్రవారం

image

✒ తిథి: శుక్ల త్రయోదశి రా.1.37 వరకు
✒ నక్షత్రం: శ్రవణం రా.11.15 వరకు
✒ శుభ సమయములు: ఉ.10.10-10.40, తిరిగి సా.5.10-5.22 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00 వరకు
✒ యమగండం: మ.3.00-సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, తిరిగి మ.12.24-1.12
✒ వర్జ్యం: తె.3.16-4.52 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.36-2.14 వరకు

News September 5, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ
* APలోని పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా.. క్యాబినెట్ నిర్ణయం
* SLBC పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించాం: భట్టి
* కలుషిత నీటితోనే తురకపాలెంలో మరణాలు: అంబటి
* భార్గవ్‌పై ఆరోపణలు అవాస్తవం: సజ్జల రామకృష్ణారెడ్డి
* హైదరాబాద్‌లో గణేశ్ లడ్డూకు రూ.51 లక్షల రికార్డు ధర

News September 5, 2025

రేపు ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకోనున్న సీఎం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖైరతాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌, మంత్రులు పొన్నం, సురేఖ కూడా వెళ్తారు. కాగా శనివారం మహాగణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఇవాళ రాత్రి 12 గంటల నుంచే భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు.

News September 5, 2025

నేపాల్‌లో సోషల్ మీడియా యాప్స్‌పై బ్యాన్

image

నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, X, రెడిట్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇవాళ రాత్రి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఐటీ చట్టాల నిబంధనలను పాటించడంతో విఫలం కావడమే నిషేధానికి కారణమని వెల్లడించింది. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News September 5, 2025

చెవిరెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు

image

AP: లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. ‘సిట్ అధికారుల ఆదేశాలతో చెవిరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశాం. కంపెనీల వివరాలు, పలు రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నాం. వాటిని విచారణ కోసం సిట్‌కు పంపుతాం. 6 కంపెనీలకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంపెనీల వివరాలు పరిశీలించాం’ అని విజిలెన్స్ ఎస్పీ తెలిపారు.

News September 5, 2025

PKL: బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్

image

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచులో 37-32 పాయింట్ల తేడాతో గెలిచింది. టైటాన్స్ ప్లేయర్లు విజయ్ మాలిక్, భరత్ చెరో 8 పాయింట్లతో అదరగొట్టారు. డిఫెన్స్‌లో ఏకంగా 14 పాయింట్లు రాబట్టారు. అంతకుముందు రెండు మ్యాచుల్లోనూ తెలుగు టైటాన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

News September 5, 2025

ఏయూకు స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో 4వ స్థానం

image

AP: స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ విభాగంలో 23వ స్థానానికి చేరుకుంది. ఏయూ ఫార్మసీ కాలేజీ 31, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ 88వ స్థానంలో, డాక్టర్ BR అంబేడ్కర్ న్యాయ కళాశాల 16వ స్థానంలో నిలిచాయి. AU నాలుగో స్థానంలో నిలవడం పట్ల మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు.

News September 5, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రేపు ఉదయం 8.30 గంటల్లోపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, KNR, జగిత్యాల, సిరిసిల్ల, PDPL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, MHBD, WGL, HNK, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డికి IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News September 4, 2025

టెక్ దిగ్గజాలకు ట్రంప్ డిన్నర్.. మస్క్‌కు నో ఎంట్రీ

image

టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ కంపెనీల ఫౌండర్లు, CEOలకు US అధ్యక్షుడు ట్రంప్ ఈ రాత్రికి డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు. దీనికి బిల్‌గేట్స్, టిమ్ కుక్, జుకర్‌బర్గ్, పిచాయ్, సత్య నాదెళ్ల, ఆల్ట్‌మన్ తదితరులు హాజరుకానున్నారు. అయితే మస్క్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. ట్రంప్ అధికారం చేపట్టాక ఆయనకు కీలక పదవి ఇవ్వగా, తర్వాత ఇద్దరికీ చెడింది. దీంతో మస్క్‌ను ట్రంప్ దూరం పెడుతూ వస్తున్నారు.