News September 4, 2025

రేపు విశాఖ, విజయవాడలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు విశాఖపట్నం, విజయవాడల్లో పర్యటించనున్నారు. ఉ.7.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విశాఖకు బయలుదేరుతారు. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం అమరావతికి వెళ్తారు. సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవాల్లో పాల్గొంటారు. 175 మంది ఉత్తమ టీచర్లకు అవార్డులు అందజేయనున్నారు.

News September 4, 2025

అర్మానీ.. ‘Its a Brand’ 1/2

image

మనలో చాలామందికి సుపరిచితమైన ‘అర్మానీ’ దుస్తుల బ్రాండ్ ఓనర్ జార్జియో అర్మానీ(91) <<17614096>>కన్నుమూశారు<<>>. ఇటలీలో 1975లో అర్మానీ, ఆయన పార్ట్‌నర్ సెర్జియో గలాటీ మెన్స్‌వేర్ దుకాణాన్ని తెరిచారు. అందుకు తమ వద్దనున్న పాత వోక్స్‌వ్యాగన్ కారును అమ్మేశారు. వ్యాపారం బాగా నడవడంతో తర్వాత ఏడాదికి మహిళల దుస్తులనూ విక్రయించడం ప్రారంభించారు. ఆ తర్వాత వారి వ్యాపార సామ్రాజ్యం సరిహద్దులు దాటింది. ఖండాంతరాలకు విస్తరించింది.

News September 4, 2025

అర్మానీ.. ‘Its a Brand’ 2/2

image

అర్మానీ కంపెనీ కేవలం దుస్తులకే పరిమితం కాకుండా యాక్సెసరీస్‌లు, హోమ్ ఫర్నిషింగ్స్, పెర్‌ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బుక్స్, ఫ్లవర్స్, చాకోలెట్స్‌ తదితర విక్రయాల్లోనూ తన బ్రాండ్ పవర్ చూపించింది. జార్జియో అర్మానీకి సొంత బాస్కెట్‌బాల్ టీమ్‌తో పాటు పలు దేశాల్లో బార్లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం ఆయన సంపద 10 బిలియన్ డాలర్లు.

News September 4, 2025

ఆ కోర్సుల్లో దృష్టి లోపం గల దివ్యాంగులకు అనుమతి: విద్యాశాఖ

image

AP: మంత్రి లోకేశ్ చొరవతో దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు MPC, బైపీసీ కోర్సులు చదవడానికి అనుమతి లభించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ GO జారీ చేసింది. సైన్స్ కోర్సుల్లో తమకు అవకాశం కల్పించాలన్న దివ్యాంగుల విజ్ఞప్తికి స్పందించిన లోకేశ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్స్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరవ్వడం కష్టమని అధికారులు తెలపగా, బదులుగా లఘురూప ప్రశ్నలతో ఎసెస్‌మెంట్ చేయాలని మంత్రి సూచించారు.

News September 4, 2025

నల్ల కళ్లజోడుతో మంత్రి పార్థసారథి.. ఎందుకంటే?

image

AP: క్యాబినెట్ భేటీలో, ఆ తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన సమయంలో మంత్రి పార్థసారథి నల్ల కళ్లజోడుతో కన్పించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై పలువురు ఆరా తీశారు. కాగా ఇటీవల మంత్రి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కళ్లకు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. అందుకే కళ్లజోడు పెట్టుకొని కనిపించారని వెల్లడించారు.

News September 4, 2025

కలుషిత నీటితోనే తురకపాలెంలో మరణాలు: అంబటి

image

AP: కలుషిత నీటిని ఉపయోగించడమే తురకపాలెంలో <<17599008>>మరణాలకు<<>> కారణమని తమ పరిశీలనలో తేలిందని YCP నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ నీటిని వాడటంతో అవయవాలు దెబ్బతిని చనిపోతున్నారని ఆరోపించారు. గుంటూరు తురకపాలెంలో పర్యటించిన నేతలు మరణాలకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు.

News September 4, 2025

ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం

image

TG: ఇకపై లబ్ధిదారులే తమ ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. దాన్ని బట్టి బిల్లులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈమేరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఫొటోలు తీయడం ఆలస్యం కావడంతో బిల్లులు రాక ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించామన్నారు.

News September 4, 2025

SLBC పనులకు సీఎం రేవంత్ డెడ్‌లైన్

image

TG: SLBC పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కాంట్రాక్టర్ ఒక్కరోజు పనులు ఆలస్యం చేసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. టన్నెల్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం-అక్కంపల్లి రిజర్వాయర్‌ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలు వాడుకోవాలని, నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలన్నారు.

News September 4, 2025

మోదీతో ట్రంప్ బంధం తెగిపోయింది: బోల్టన్

image

భారత ప్రధాని మోదీతో ట్రంప్‌కు ఉన్న అనుబంధం తెగిపోయిందని యూఎస్ మాజీ NSA బోల్టన్ అన్నారు. ఇది ప్రతి ఒక్కరికీ గుణపాఠమని చెప్పారు. వ్యక్తిగత సంబంధాలు కొన్నిసార్లు సహాయపడినా, చెత్త నిర్ణయాల నుంచి మాత్రం రక్షించలేవన్నారు. ప్రస్తుతం అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతినడం రష్యా, చైనాతో మోదీ సన్నిహితంగా మారేలా చేశాయని అభిప్రాయపడ్డారు. US విషయంలో భారత్‌కు చైనా ప్రత్యామ్నాయంగా మారిందన్నారు.

News September 4, 2025

AP క్యాబినెట్ మరిన్ని నిర్ణయాలు

image

క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరించారు.
* 2025 ఆగస్టు 31 వరకు ఉన్న అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు నిర్ణయం
* చిత్తూరు జిల్లాలో 2 పరిశ్రమల ఏర్పాటుకు సమ్మతం
* మడకశిరలో HFCL కంపెనీ ఏర్పాటుకు ఆమోదం
* విశాఖ, అమరావతి, మంత్రాలయంలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు పచ్చజెండా
* పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం