News September 9, 2025

సియాచిన్‌లో ప్రమాదం.. ముగ్గురు సైనికుల మృతి

image

లద్దాక్‌లోని సియాచిన్ సెక్టార్‌ బేస్ క్యాంపులో విషాదం జరిగింది. డ్యూటీలో ఉన్న మహర్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు మంచులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, రెస్క్యూ టీమ్స్ 5 గంటల పాటు కష్టపడి కెప్టెన్‌ను రక్షించాయి. ప్రాణాలు కోల్పోయిన సైనికులు గుజరాత్, యూపీ, ఝార్ఖండ్‌కు చెందిన వారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సియాచిన్ సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.

News September 9, 2025

నేపాల్ తదుపరి PM.. ట్రెండింగ్‌లో బాలేంద్ర షా!

image

ఓలీ <<17657494>>రాజీనామాతో<<>> నేపాల్‌ తదుపరి PM ఎవరన్న చర్చ మొదలైంది. కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సివిల్ ఇంజినీర్, ర్యాపర్ అయిన షా 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మేయర్ అయ్యారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ SMలో యాక్టివ్‌గా ఉండే షాకు యువత మద్దతు ఉంది. ఆయన PMగా బాధ్యతలు చేపట్టాలని ఆన్‌లైన్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. కాగా కేవలం కాఠ్‌మాండూలోనే 18 మంది ఆందోళనకారులు మరణించారు.

News September 9, 2025

భరించలేకపోతున్నా.. నాకింత విషం ఇవ్వండి: దర్శన్

image

కొన్ని రోజులుగా జైలులో సూర్యరశ్మి తాకట్లేదని కన్నడ హీరో దర్శన్ కోర్టుకు తెలిపారు. తాను ఫంగస్‌తో బాధపడుతున్నానని, తన దుస్తులు స్మెల్ వస్తున్నాయని వాపోయారు. బయటకు వెళ్లేందుకు అనుమతివ్వాలని లేదా విషం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణను సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని గత నెలలో <<17401764>>దర్శన్<<>> బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

News September 9, 2025

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: అనంతపురం పట్టణంలో రేపు ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ సభకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు తెలిపారు. రేపు హాలిడే ఇస్తున్న కారణంగా రెండో శనివారమైన ఈ నెల 13న పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేస్తాయన్నారు.

News September 9, 2025

హిమాలయ జ్వాలకు 3 కారణాలు.. 3 రూపాలు!

image

1.హిమాలయ దేశం నేపాల్లో‌ నెలకొన్న అవినీతి, దానికి పరిష్కారం లేకపోవడంపై ఆ దేశ Zen Z(యువత) ‘అసహనం’తో ఉంది. 2.కొందరు నేతలు కుటుంబాలతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వీడియోలు ఇటీవల వైరలవగా ప్రజా ధనంతో పాలకుల జల్సాలా? అనే ‘ఆవేదన’ వ్యక్తమైంది. 3.దేశంలో రిజిస్టర్ కాలేదని SM సైట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో తమ గొంతును పాలకులు అణిచివేశారనే ‘ఆగ్రహం’తో నిరసన జ్వాల నియంత్రణ తప్పి కార్చిచ్చులా దహిస్తోంది.

News September 9, 2025

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకి మీడియాతో సమావేశం అవుతారని YCP ప్రకటనలో తెలిపింది. ఇవాళ యూరియా కొరతపై వైసీపీ నేతలు ‘అన్నదాత పోరు’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి నెలకొంది.

News September 9, 2025

ఐదుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలుకు సిద్ధమైన ACB

image

TG: ఫార్ములా ఈ-రేస్ <<16712706>>కేసులో<<>> కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్‌ సహా మరో నలుగురిపై న్యాయ విచారణకు ACB సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌, అరవింద్‌కుమార్‌, BLN రెడ్డి, కిరణ్‌, FEO సీఈవోపై ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందని సమాచారం.

News September 9, 2025

4 దశల్లో స్థానిక ఎన్నికలు: SEC

image

APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో <<17606799>>ఎన్నికలు<<>> జరుపుతామని SEC నీలం సాహ్ని చెప్పారు. మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. EVMలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌లో EVMలు వాడారని గుర్తు చేశారు. EVMల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.

News September 9, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్

image

ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఈ ఉదయం 10 గం. నుంచి సా.5 గంటల వరకు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 768 ఓట్లు పోల్ అయ్యాయి. సా.6 గం. నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

News September 9, 2025

నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు చామల కిరణ్, మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కర్ ఉన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాను ఇచ్చింది. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులు, రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని CM కోరారు.