News September 4, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది.

News September 4, 2025

బెస్ట్ లెక్చరర్స్‌కు అవార్డుల ప్రకటన

image

TG: యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో విశేష సేవలందించిన అధ్యాపకులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. OU నుంచి నలుగురు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, చాకలి ఐలమ్మ, అంబేడ్కర్ ఓపెన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ప్రొ.జయశంకర్ వర్సిటీల్లో ఒక్కొక్క లెక్చరర్‌ను, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్సిటీలో ఇద్దరిని బెస్ట్ లెక్చరర్స్‌గా ఎంపిక చేసింది. లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 4, 2025

సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏం చేయాలంటే?

image

ఈనెల 7న సంభవించే <<17544453>>సంపూర్ణ చంద్రగ్రహణం<<>> సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. గ్రహణం ఆదివారం రాత్రి 9.56గంటలకు మొదలై అర్ధరాత్రి 1.26 గంటల వరకు ఉండనుంది. ‘గర్భిణులు దర్భలను(గరిక) తమ దగ్గర పెట్టుకోవాలి. నిద్రించే స్థలంలోనూ ఉంచుకోవాలి. గ్రహణానికి ముందు, తర్వాత తల స్నానం చేయాలి. సాయంత్రం 6లోపు ఆహారం తినాలి. ఆహార వస్తువులు, పూజ గదిలో దర్భలను వేయాలి’ అని సూచిస్తున్నారు.

News September 4, 2025

ఒకటే క్లాస్: ఒకరి ఫీజు రూ.10లక్షలు.. మరొకరికి ఫ్రీ

image

రిజర్వేషన్ల కారణంగా ఒకే క్లాసులోని విద్యార్థులు వేర్వేరు ఫీజులు చెల్లించడాన్ని ఓ ప్రొఫెసర్ Xలో లేవనెత్తారు. పుణేలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలోని ఫస్ట్ ఇయర్ ఫీజు చార్టును ఆమె షేర్ చేశారు. ఇందులో ఓపెన్ కేటగిరీకి రూ.10L, EBC & OBC విద్యార్థులకి రూ.6 లక్షలు ఫీజు చెల్లించాలని ఉంది. అదే SC&ST వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు. ‘ఇది సమానత్వం అనుకుంటారా?’ అని ట్వీట్ చేయగా వైరలవుతోంది.

News September 4, 2025

క్యాబినెట్ భేటీలో సుగాలి ప్రీతి కేసు ప్రస్తావన

image

AP: క్యాబినెట్ భేటీ సందర్భంగా సుగాలి ప్రీతి కేసు విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. అయితే ప్రీతి ఫ్యామిలీకి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. కాగా అధికారంలోకి వచ్చాక పవన్ తన కూతురి కేసును పట్టించుకోవడం లేదని ఇటీవల ప్రీతి తల్లి ఆరోపించారు.

News September 4, 2025

ఏసీబీకి పట్టుబడ్డ మరో అవినీతి అధికారిణి

image

TG: లంచగొండులు తరచూ ACBకి <<17121380>>పట్టుబడుతున్నా<<>> ఇతర అధికారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరితారెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే జరగడం కొసమెరుపు. ఇలాంటి అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News September 4, 2025

విద్యార్థులు ప్లేట్లు కడగడం సిగ్గుపడేదేం కాదు: CJ AK సింగ్

image

TG: ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థులు ప్లేట్లు, టాయిలెట్లు కడగడం సిగ్గుపడాల్సిన పనేం కాదని హైకోర్టు CJ AK సింగ్ పేర్కొన్నారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టారు. ‘చదువుకునేటప్పుడు నేనూ ప్లేట్లు కడిగాను, టాయిలెట్లు క్లీన్ చేశాను. అదేం తప్పుకాదు. ఈ ఘటనలపై వివరణ, నివారణ చర్యల గురించి తెలియజేయాలి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ SEP 19కి వాయిదా వేశారు.

News September 4, 2025

‘సోనియాపై FIR నమోదుకు ఆదేశించండి’

image

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని వికాస్ త్రిపాఠి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. 1980లో ఆమె భారత సిటిజన్ షిప్ లేకుండానే ఓటు నమోదు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 1982లో ఆమె ఓటును డిలీట్ చేసి 1983లో తిరిగి చేర్చారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. కాగా సోనియాకు భారత పౌరసత్వం 1983లో లభించింది.

News September 4, 2025

కంప్యూటర్ సైన్స్ చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు

image

డిగ్రీ, పీజీ లెవల్లో కంప్యూటర్స్ చదివిన వారికి ప్రభుత్వ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. మాస్టర్స్, PHD చేసి టీచింగ్/రీసెర్చ్‌లో కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. రైల్వే, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల్లోనూ వీరికి అనేక నియామకాలుంటాయి. రాష్ట్ర స్థాయిలో కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటారు. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా, సిస్టమ్స్‌ అనలిస్ట్‌గా, సిస్టమ్స్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

News September 4, 2025

GST: సినిమా టికెట్లు, పాప్ కార్న్‌పై ఇలా..

image

<<17605492>>జీఎస్టీ<<>> శ్లాబుల్లో మార్పుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కాస్త ఊరట లభించనుంది. రూ.100, ఆ లోపు టికెట్లపై GSTని 12% నుంచి 5%కి కేంద్రం తగ్గించింది. అయితే రూ.100పైన టికెట్లకు మాత్రం 18% వసూలు కొనసాగనుంది. దీంతో మల్టీప్లెక్స్‌లో ఎప్పటిలాగే టికెట్ల ధరలు ఉండనున్నాయి. ఇక పాప్‌కార్న్ ధరలపై విమర్శలు ఉండగా ప్యాకేజీతో సంబంధం లేకుండా సాల్ట్ పాప్‌కార్న్ 5శాతం, క్యారమిల్ పాప్‌కార్న్‌ 18శాతంలోకి రానుంది.