India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పామాయిల్‌పై సుంకాలను తగ్గించాలని, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్లకు ఆర్థిక సాయం అందించాలని కోరామన్నారు. సాయంత్రం అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి కేంద్ర ప్రభుత్వ సాయం కోరతామని చెప్పారు. భట్టి వెంట మంత్రి తుమ్మల ఉన్నారు.
నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు అనంత చతుర్దశి రోజున గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. 9 రోజుల పూజలతో ఆయన విగ్రహానికి లభించిన శక్తులు నిమజ్జనంతో సర్వత్రా వ్యాపిస్తాయని భక్తుల నమ్మకం. ‘అనంత’ అంటే వినాయకుడు అంతం లేనివాడని అర్థం. మట్టి నుంచి ఉద్భవించిన వినాయకుడు నీటిలో కలిసి ప్రకృతికి, మానవాళికి తన శక్తులను ప్రసాదిస్తాడని.. అందుకే భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం చేయాలని పురోహితులు చెబుతున్నారు.
AP: రాష్ట్రంలో PPP విధానంలో 10 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో ఈ కాలేజీలు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్ఎఫ్‌పీ(రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్) జారీకి మంత్రివర్గం అనుమతిచ్చింది. మొదటి దశలో నాలుగు చోట్ల, రెండో దశలో ఆరు చోట్ల వీటిని ఏర్పాటు చేయనుంది.
AP: లిక్కర్ కేసులో భార్గవ్‌పై ఆరోపణలు అవాస్తవమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘భీమ్ స్పేస్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదు. అకౌంట్ లేని కంపెనీ ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతాయి?. భీమ్ స్పేస్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న ప్రద్యుమ్న గతంలో ఓ టీవీ ఛానల్‌లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ ఛానల్‌తో నారా లోకేశ్ సన్నిహితంగా ఉండేవారు. లోకేశ్‌కి ప్రద్యుమ్న సన్నిహితుడు కావొచ్చు’ అని అభిప్రాయపడ్డారు.
పంజాబ్, HP, ఉత్తరాఖండ్, J&Kలో వరదల బీభత్సంపై SC తీవ్రంగా స్పందించింది. అక్రమంగా అడవుల నరికివేతే విపత్తులకు కారణమంది. పెద్దఎత్తున చెట్ల దుంగలు వరదల్లో కొట్టుకొచ్చినట్లు SMలో వీడియోలు చూసినట్లు పేర్కొంది. దీనిపై 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాలకు నోటీసులు పంపింది. కొండ ప్రాంతాల్లో పర్యావరణ పతనంపై దర్యాప్తు కోరుతూ పర్యావరణవేత్త అనామిక పిటిషన్‌పై విచారణ సందర్భంగా SC ఈ వ్యాఖ్యలు చేసింది.
కోహ్లీ-రోహిత్ మరికొన్నేళ్లు క్రికెట్ ఆడగలరని టీమ్ ఇండియా మాజీ కీపర్ దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డారు. ‘ఏ ఆటగాడినైనా వయసు రీత్యా రిటైరవ్వమని చెప్పే హక్కు ఎవరికీ లేదు. పర్ఫామ్ చేస్తుంటే కొనసాగడంలో తప్పేంటి? ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెప్పనప్పుడు.. ఎప్పుడు ఆపాలో ఎలా చెప్తారు’ అని ప్రశ్నించారు. కోహ్లీ-రోహిత్ T20, టెస్టుల నుంచి రిటైరైన విషయం తెలిసిందే.
అధిక వర్షాల వల్ల నారుమడిలో జింకు లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 నుంచి 5 గ్రాముల అన్నభేది, 0.5-1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. వరద ముంపునకు నారు చనిపోతే ఎకరానికి 15-20 కిలోల స్వల్పకాలిక రకాలైన MTU-1010, KNM-118 విత్తనాలను పొలాన్ని బాగా దమ్ముచేసి డ్రమ్ సీడర్‌తో లేదా వెదజల్లే పద్ధతిలో విత్తుకోవాలి.
ఈరోజుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరిని మదర్ గిల్ట్ బాధిస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నామనే భావనే మదర్ గిల్ట్. ఈ విషయంపై ఒత్తిడి చెందితే మానసిక ఆరోగ్యం దెబ్బతిని ఆ ప్రభావం ఇంట్లోనూ, ఆఫీసు పనిపై పడుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి కుదిరినప్పుడల్లా వారితో ఎక్కువ సమయం గడపడం, విహారయాత్రలకు వెళ్లడం ద్వారా ఆ లోటును తీర్చుకోవచ్చంటున్నారు.
ఈ రోజుకు బృహస్పతి అధిపతి. అందుకే ఈరోజున సాయిబాబా, దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామిలతో పాటు బృహస్పతిని కూడా పూజించాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే విష్ణువును పూజించడం కూడా శుభప్రదమని చెబుతున్నారు. పసుపు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తికి పసుపు పువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలని, అలా చేస్తే ఆ దేవుని అనుగ్రహం కలుగుతుందని, దాంపత్య జీవితంలో శాంతి, ఆనందం లభిస్తాయని అంటున్నారు.
కొన్ని కార్లపై GST 28%శ్లాబు నుంచి 18శాతానికి తగ్గింది. దీంతో ఒక్కో కారుపై ఎంత ధర తగ్గుతుందనే అంచనా వివరాలు కింద చూడొచ్చు.
మారుతీ స్విఫ్ట్(రూ.88వేలు), టాటా నెక్సాన్(రూ.1,05,000), మారుతీ బాలెనో(రూ.85వేలు), మహీంద్రా 3XO(రూ.95వేలు), హ్యుందాయ్ వెన్యూ(రూ.79వేలు), టాటా టియాగో(రూ.50వేలు), కియా సోనెట్(రూ.90వేలు), టాటా ఆల్ట్రోజ్(రూ.82వేలు), హ్యుందాయ్ i20(రూ.75వేలు), హోండా అమేజ్(రూ.85వేలు).
Sorry, no posts matched your criteria.