India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విరాట్ కోహ్లీ ఫామ్‌పై భారత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా విమర్శలు కురిపించారు. ‘టెస్టుల్లో విరాట్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. గడచిన ఐదేళ్లలో 2 సెంచరీలు మాత్రమే చేశారు. సగటు చూస్తే 2020లో 19, 2021లో 28, 2022లో 26గా ఉంది. గత ఏడాది రెండు సెంచరీలు చేసినా అందులో ఒకటి అహ్మదాబాద్‌లోని నిర్జీవమైన పిచ్‌పై వచ్చింది. ఇక ఈ ఏడాది 8 ఇన్నింగ్స్ ఆడినా సగటు 32గానే ఉంది’ అని పెదవి విరిచారు.
లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఒకవేళ ఏదైనా మూవీ రీమేక్ చేయాల్సి వస్తే ఏది చేస్తారని యాంకర్ సుమ ఆయనను ప్రశ్నించారు. దీనికి బదులుగా తాను 1989లో పుట్టానని, అదే సంవత్సరం ఆర్జీవీ శివ మూవీ వచ్చిందన్నారు. ఈ మూవీ రీమేక్ చేయాలని ఉందన్నారు. ప్రస్తుతం విజయ్ #VD12లో నటిస్తున్నారు.
దేశంలో మౌలిక వసతుల కల్పనలో బీజేపీ సర్కారు విఫలమైందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విటర్లో ఆరోపించారు. ‘భారత్‌లో మౌలిక వసతుల కల్పన దారుణంగా దిగజారింది. ముంబై రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట అందుకో ఉదాహరణ. గత ఏడాది బాలాసోర్ రైలు ప్రమాదంలో 300మంది చనిపోయారు. ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే కూలిపోయింది. BJPకి కావాల్సింది పబ్లిసిటీ మాత్రమే తప్ప ప్రజల భద్రత కాదు’ అని విమర్శించారు.
ఐపీఎల్ 18 సీజన్ మెగా వేలానికి ముందు తమ కెప్టెన్లను వదులుకోవాలని ఆరు ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో శిఖర్ ధవన్-పంజాబ్ కింగ్స్, డుప్లెసిస్-ఆర్సీబీ, రిషభ్ పంత్-ఢిల్లీ క్యాపిటల్స్, శ్రేయస్ అయ్యర్-కేకేఆర్, కేఎల్ రాహుల్-లక్నో, శుభ్‌మన్ గిల్-గుజరాత్ టైటాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ ఆరుగురు కెప్టెన్లలో శిఖర్ ధవన్ మినహా అందరూ వేలంలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
TG: తమను రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబసభ్యులు, బంధువుల మీద కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ అన్నారు. 11 నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో తాము కేసులకు భయపడబోమని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం తరఫున ఒక్కరూ మాట్లాడట్లేదని విమర్శించారు.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ డివైన్(79), సుజీ బేట్స్(58) రాణించడంతో 259 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ టాపార్డర్ విఫలమవ్వడంతో 183 పరుగులకే ఆలౌటైంది. జట్టులో రాధా యాదవ్(48) టాప్ స్కోరర్. NZ విజయంతో సిరీస్ సమమైంది. కాగా సిరీస్ విజేతను నిర్ధారించే మూడో వన్డే 29న జరగనుంది.
తెలంగాణ రాజకీయాల్లో జన్వాడ ఫాంహౌస్ పార్టీ సంచలనంగా మారింది. KTR బావమరిది పాకాల రాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు KTRను టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఫాంహౌస్‌లో డ్రగ్స్ లభించలేదని, పర్మిషన్ లేని లిక్కర్ వాడినంత మాత్రాన కేసులేంటని BRS కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. ఇది రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ పార్టీ అంటున్నారు.
AP: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ.10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు.
AP: ఐదేళ్ల <<14468148>>జగన్<<>> దరిద్రపు పాలనలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని TDP ఆరోపించింది. ERC ప్రతిపాదన పాపం జగన్‌దేనని మండిపడింది. ‘గత ప్రభుత్వం ప్రజలపై రూ.6,072 కోట్ల భారం మోపింది. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు. ఆ భారమంతా కూటమి ప్రభుత్వంపైనే పడింది. విద్యుత్ కొనుగోలులోనూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు ఛార్జీలు పెంచుతామని ఎక్కడా చెప్పలేదు’ అని పేర్కొంది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆటగాళ్లతో అత్యుత్తమ టెస్టు జట్టును తయారుచేస్తే దానికి ఓపెనర్‌గా తాను రోహిత్‌నే ఎంచుకుంటానని తెలిపారు. ‘రోహిత్ చాలా ప్రమాదకర ప్లేయర్. నిర్భయంగా తన షాట్స్ ఆడతారు. అవసరమైతే అద్భుతంగా డిఫెండ్ కూడా చేసుకోగలరు. అతడు క్రీజులో ఉన్నప్పుడు బౌలర్లు ఒత్తిడికి గురవుతారు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.