News September 4, 2025

క్రేవింగ్స్‌కి ఇలా చెక్

image

చాలామంది అమ్మాయిలకు పీరియడ్స్, ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పోషకలోపానికి సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, డీ హైడ్రేషన్, హార్మోన్ల అసమతుల్యత వల్ల తీపి పదార్థాలవైపు మనసు మళ్లుతుంది. ఇలాంటప్పుడు మూల కారణాలు సరిదిద్దటంపై దృష్టి సారించాలి. ఒకవేళ క్రేవింగ్స్ వస్తే డార్క్ చాక్లెట్, స్వీట్‌కార్న్, ఖర్జూరాలు, డ్రై‌ఫ్రూట్స్ వంటివి తినడం మంచిది.

News September 4, 2025

కష్టాల నుంచి విముక్తి పొందాలంటే..

image

ధర్మంగా ఉండేవారికీ కష్టాలు ఎందుకు వస్తాయనే ప్రశ్నకు సాయిబాబా ఇలా సమాధానం ఇచ్చారు. మనిషిలోని సత్వ, రజో, తమో గుణాల వల్ల సత్యాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు. గతంలో చేసిన చెడు కర్మల ఫలితమే ప్రస్తుత కష్టాలకు కారణం. ఆ కష్టాలు పోవాలంటే ఎవరికైతే అన్యాయం చేశామో వారిని క్షమించమని వేడుకోవాలి. లేదా వారికి సహాయం చేయాలి. ఇలా చేస్తే జీవితంలో శాంతి, సౌభ్రాతృత్వం లభిస్తాయి.

News September 4, 2025

884 ఉద్యోగాలు.. 4 రోజులే గడువు

image

LICలో 884 పోస్టులకు ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అసిస్టెంట్ ఇంజినీర్స్/ స్పెషలిస్ట్(ఇంజినీరింగ్ అర్హత) 514, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(డిగ్రీ అర్హత) పోస్టులు 370 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ OCT 3న, మెయిన్స్ NOV 8న నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://licindia.in/

News September 4, 2025

అవినీతిపరులను మా పార్టీలో చేర్చుకోం: రామ్‌చందర్

image

TG: అవినీతిపరులను బీజేపీలో చేర్చుకోబోమని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామ్‌చందర్ రావు స్పష్టం చేశారు. కవితను బీజేపీలో చేర్చుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కవిత వ్యాఖ్యలపై తాను స్పందించనని, మీడియా వాళ్లు కూడా ఆమె చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. స్టాలిన్ మీటింగ్‌కు, గవర్నర్ వద్దకు రెండు పార్టీలు కలిసే వెళ్లాయి కదా’ అని ఉదహరించారు.

News September 4, 2025

రేపు ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

రేపు 5 ఆసక్తికర సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘ఘాటి’, ఏఆర్ మురుగదాస్, శివకార్తికేయన్ కాంబోలో రూపొందిన ‘మదరాసి’, వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ‘ది బెంగాల్ ఫైల్స్’, మౌళి&శివాని నటించిన ‘లిటిల్ హార్ట్స్’, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ‘బాఘి 4’ (హిందీ) విడుదల అవుతున్నాయి. వీటిలో మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు? కామెంట్ చేయండి.

News September 4, 2025

కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్

image

కేంద్రం GST శ్లాబులను తగ్గించడం కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘సిమెంట్, గ్రానైట్, మార్బుల్, ఇటుకల వంటి ముఖ్యమైన నిర్మాణ సామగ్రిపై GST 12% నుంచి 5%/ 28% – 18% తగ్గడంతో నిర్మాణ వ్యయం తగ్గనుంది. దీంతో మొత్తం నిర్మాణ వ్యయంలో సుమారు 5% వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఇళ్ల ధరలు తగ్గి సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’ అని అంచనా వేస్తున్నారు.

News September 4, 2025

PSలలో లేని CC కెమెరాలు.. సుమోటోగా తీసుకున్న SC

image

దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో CC కెమెరాలు లేకపోవడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ ఏడాది గత 8 నెలల్లో 11 మంది పోలీస్ కస్టడీలో చనిపోయారన్న నివేదిక ఆధారంగా విచారణకు స్వీకరించింది. 2020లో ఓ కేసు విచారణ సందర్భంగా దేశంలోని అన్ని పీఎస్‌లలో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. అయినప్పటికీ కొన్ని స్టేషన్లలో ఇంకా కెమెరాలు లేవని, ఉన్నా పని చేయట్లేదన్న ఆరోపణలున్నాయి.

News September 4, 2025

వరిలో ఉల్లికోడు నివారణకు సూచనలు

image

నారుమడిలో 160 గ్రాముల కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను విత్తనం మొలకెత్తిన 10 – 15 రోజులప్పుడు వేయాలి. నాటేముందు నారు వేర్లను క్లోరిఫైరిఫాస్ (2ml/లీటరు నీటికి) ద్రావణంలో 12 గంటలు ఉంచి నాటితే ఉల్లికోడు నుంచి పంటను కాపాడుకోవచ్చు.
☛ నాటిన 10 నుంచి 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేయాలి. పైపాటుగా లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ (లేదా) క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ కలిపి పిచికారీ చేయాలి.

News September 4, 2025

వర్షాకాలంలో పాడి పశువులకు ఇబ్బందులు

image

వానాకాలంలో నేల చిత్తడిగా మారి గుంతల్లో, మురుగు కాల్వల్లో ఈగలు, దోమలు వృద్ధి చెందుతాయి. ఇవి పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. దీని వల్ల పశువుల శరీరంపై పుండ్లు పడటంతో పాటు అవి రక్తహీనతకు గురవుతాయి. వీటిని వదిలించుకోవడానికి పశువులు తోక, చెవులను ఊపుతూ అసహనానికి గురవుతాయి. దీని వల్ల మేత సరిగా మేయవు. ఫలితంగా పాల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడుతుంది. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

News September 4, 2025

వర్షాలు – పాడి పశువుల విషయంలో జాగ్రత్తలు

image

పశువుల షెడ్ చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చిత్తడి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఉదయం, సాయంత్రం పశువుల పాకలో ఎండు పిడకలు, వేపాకుతో పొగబెట్టాలి. సాయంత్రం పశువుల శరీరంపై వేపనూనె రాయాలి. సీజన్‌కు తగినట్లుగా టీకాలు వేయించాలి. అవకాశాన్ని బట్టి పశువుల పాకలకు దోమ తెరలను ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల పశువుల పాకలోకి దోమలు, ఈగలు ప్రవేశించే అవకాశం ఉండదు.