India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వదేశంలో భారత్ 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ను లైనప్‌లో కిందకి నెట్టి, వాషింగ్టన్ సుందర్‌ను ముందు పంపడం వంటి వ్యూహాలు అర్థరహితంగా అనిపించాయి. బ్యాటింగ్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ అనేది టీ20 వ్యూహం. రోహిత్ ఆ మైండ్‌సెట్ నుంచి బయటపడాలి’ అని సూచించారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు, డైరెక్టర్ పార్థిబన్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కాగా పార్థిబన్ దాదాపు 70కిపైగా సినిమాల్లో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై YCP చీఫ్ జగన్ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంట్ ఛార్జీలు పెంచడమేనా చంద్రబాబు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేవారిమని చెప్పి, ఇప్పుడు భారీ స్థాయిలో పెంచి మాట తప్పడమే చంద్రబాబు నైజమని రుజువు చేశారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు.
పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ను పీసీబీ నియమించింది. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా, జింబాబ్వే సిరీస్‌లో ఆయన జట్టుకు సారథ్యం వహిస్తారు. సల్మాన్ అలీ అఘాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. టెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్సీ చేస్తున్నారు. కాగా వన్డే, టీ20 కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ ఇటీవల గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది దీపావళిని జవాన్లతో కలిసి చేసుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో తవాంగ్ జిల్లాలో బోర్డర్ వద్ద గస్తీ కాస్తున్న సైనికులతో కలిసి ఆయన వేడుక జరుపుకోనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు భారత వాయుసేనకు చెందిన ఉత్తరాఖండ్ వార్ మెమోరియల్ కార్ ర్యాలీ తవాంగ్‌కు చేరుకోనుంది. ఆ ర్యాలీకి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ స్వాగతం పలకనున్నారు.
TG: రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 563 పోస్టులకు ఈ నెల 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. వరుసగా 7 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. జీవో 29ను రద్దు చేశాకే పరీక్షలు జరపాలని కొందరు అభ్యర్థులు ఆందోళన చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. త్వరలో టీజర్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. మరో 75 రోజుల్లో సినిమా రిలీజ్ కానుందని పేర్కొంది. పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. కాగా ఇప్పటికే విడుదలైన ‘రా మచ్చా మచ్చ’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
TG: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో రైడ్ చేశామని FIRలో తెలిపారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు తేలిందని, మిగతా వారు టెస్టులకు సహకరించలేదని చెప్పారు. రాజ్ సూచించడంతోనే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు విజయ్ చెబుతున్నారని పేర్కొన్నారు.
TG: కాంగ్రెస్‌ను నమ్మి అన్ని వర్గాలు మోసపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ఆరు గ్యారంటీలు, 400 హామీలను ఎలా అమలు చేస్తుంది? పెన్షన్లు, దళితబంధు, నిరుద్యోగ భృతి గురించి సర్కార్ ఆలోచించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మూసీ బాధితుల కోసం కరసేవ చేసేందుకు మేం సిద్ధం’ అని ఆయన ప్రకటించారు.
ఇండియాలో 2024కి గాను అత్యుత్తమ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ SBIని బెస్ట్ బ్యాంకుగా ఎంపిక చేసింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ సేవలు, ఖాతాదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో ఎస్బీఐ ముందంజలో ఉందని ఆ మ్యాగజైన్ తెలిపింది. మన దేశంలో SBIకి 22500 బ్రాంచులు, 62వేల ఏటీఎంలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.