India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొన్ని కార్లపై GST 28%శ్లాబు నుంచి 18శాతానికి తగ్గింది. దీంతో ఒక్కో కారుపై ఎంత ధర తగ్గుతుందనే అంచనా వివరాలు కింద చూడొచ్చు.
మారుతీ స్విఫ్ట్(రూ.88వేలు), టాటా నెక్సాన్(రూ.1,05,000), మారుతీ బాలెనో(రూ.85వేలు), మహీంద్రా 3XO(రూ.95వేలు), హ్యుందాయ్ వెన్యూ(రూ.79వేలు), టాటా టియాగో(రూ.50వేలు), కియా సోనెట్(రూ.90వేలు), టాటా ఆల్ట్రోజ్(రూ.82వేలు), హ్యుందాయ్ i20(రూ.75వేలు), హోండా అమేజ్(రూ.85వేలు).
అఖిల్ ‘హలో’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. ‘కొత్త లోక’ మూవీ సక్సెస్‌తో ఆమె పేరు మార్మోగుతోంది. మంచి కథ దొరికితే తెలుగులో సినిమా చేస్తానని సక్సెస్ మీట్‌లో కళ్యాణి చెప్పారు. తన మొదటి ప్రేక్షకులు తెలుగువారేనని, వారి ప్రేమను ఎప్పటికీ మరిచిపోనని ఆమె తెలిపారు. తెలుగులోనూ ‘కొత్త లోక’ను హిట్ చేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.
AP: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాంటి పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధివిధానాలను రూపొందించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారథి ఉంటారు. తప్పుడు పోస్టుల నివారణ, బాధ్యులపై కఠిన చర్యలకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కమిటీ సూచనలు చేయనుంది.
* 5జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులకు ఆమోదం
* వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
* గ్రామీణ తాగునీటి సరఫరా నిర్వహణ, పర్యవేక్షణ పాలసీపై చర్చ
* కుప్పంలో రూ.586 కోట్లతో హిందాల్కో పరిశ్రమకు ఆమోదం
* ప్రైవేటు వర్సిటీల చట్టంలో పలు సవరణలకు గ్రీన్ సిగ్నల్
* SIPB, CRDA నిర్ణయాలకు ఆమోదం
* SEP 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశముంది.
రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
APలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ భేటీ అయిన మంత్రివర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని అమలు చేయనుంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానాన్ని రూపొందించింది. 1.63 కోట్ల కుటుంబాలకు హైబ్రిడ్ విధానంలో 3,257 చికిత్సలు అందించనుంది.
ఈ లోపం మొక్క మధ్య ఆకుల మీద కనిపిస్తుంది. ఆకులు, ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్యభాగం పసుపు పచ్చగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. జింక్ లోపం గల నేలల్లో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మొక్క మీద లోప లక్షణాలు గమనించినప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
చాలామంది అమ్మాయిలకు పీరియడ్స్, ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పోషకలోపానికి సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, డీ హైడ్రేషన్, హార్మోన్ల అసమతుల్యత వల్ల తీపి పదార్థాలవైపు మనసు మళ్లుతుంది. ఇలాంటప్పుడు మూల కారణాలు సరిదిద్దటంపై దృష్టి సారించాలి. ఒకవేళ క్రేవింగ్స్ వస్తే డార్క్ చాక్లెట్, స్వీట్‌కార్న్, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ వంటివి తినడం మంచిది.
ధర్మంగా ఉండేవారికీ కష్టాలు ఎందుకు వస్తాయనే ప్రశ్నకు సాయిబాబా ఇలా సమాధానం ఇచ్చారు. మనిషిలోని సత్వ, రజో, తమో గుణాల వల్ల సత్యాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు. గతంలో చేసిన చెడు కర్మల ఫలితమే ప్రస్తుత కష్టాలకు కారణం. ఆ కష్టాలు పోవాలంటే ఎవరికైతే అన్యాయం చేశామో వారిని క్షమించమని వేడుకోవాలి. లేదా వారికి సహాయం చేయాలి. ఇలా చేస్తే జీవితంలో శాంతి, సౌభ్రాతృత్వం లభిస్తాయి.
LICలో 884 పోస్టులకు ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అసిస్టెంట్ ఇంజినీర్స్/ స్పెషలిస్ట్(ఇంజినీరింగ్ అర్హత) 514, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(డిగ్రీ అర్హత) పోస్టులు 370 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ OCT 3న, మెయిన్స్ NOV 8న నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://licindia.in/
Sorry, no posts matched your criteria.