India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
LICలో 884 పోస్టులకు ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అసిస్టెంట్ ఇంజినీర్స్/ స్పెషలిస్ట్(ఇంజినీరింగ్ అర్హత) 514, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(డిగ్రీ అర్హత) పోస్టులు 370 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ OCT 3న, మెయిన్స్ NOV 8న నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://licindia.in/
TG: అవినీతిపరులను బీజేపీలో చేర్చుకోబోమని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామ్‌చందర్ రావు స్పష్టం చేశారు. కవితను బీజేపీలో చేర్చుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కవిత వ్యాఖ్యలపై తాను స్పందించనని, మీడియా వాళ్లు కూడా ఆమె చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. స్టాలిన్ మీటింగ్‌కు, గవర్నర్ వద్దకు రెండు పార్టీలు కలిసే వెళ్లాయి కదా’ అని ఉదహరించారు.
రేపు 5 ఆసక్తికర సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘ఘాటి’, ఏఆర్ మురుగదాస్, శివకార్తికేయన్ కాంబోలో రూపొందిన ‘మదరాసి’, వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ‘ది బెంగాల్ ఫైల్స్’, మౌళి&శివాని నటించిన ‘లిటిల్ హార్ట్స్’, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ‘బాఘి 4’ (హిందీ) విడుదల అవుతున్నాయి. వీటిలో మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు? కామెంట్ చేయండి.
కేంద్రం GST శ్లాబులను తగ్గించడం కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘సిమెంట్, గ్రానైట్, మార్బుల్, ఇటుకల వంటి ముఖ్యమైన నిర్మాణ సామగ్రిపై GST 12% నుంచి 5%/ 28% – 18% తగ్గడంతో నిర్మాణ వ్యయం తగ్గనుంది. దీంతో మొత్తం నిర్మాణ వ్యయంలో సుమారు 5% వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఇళ్ల ధరలు తగ్గి సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’ అని అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో CC కెమెరాలు లేకపోవడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ ఏడాది గత 8 నెలల్లో 11 మంది పోలీస్ కస్టడీలో చనిపోయారన్న నివేదిక ఆధారంగా విచారణకు స్వీకరించింది. 2020లో ఓ కేసు విచారణ సందర్భంగా దేశంలోని అన్ని పీఎస్‌లలో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. అయినప్పటికీ కొన్ని స్టేషన్లలో ఇంకా కెమెరాలు లేవని, ఉన్నా పని చేయట్లేదన్న ఆరోపణలున్నాయి.
నారుమడిలో 160 గ్రాముల కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను విత్తనం మొలకెత్తిన 10 – 15 రోజులప్పుడు వేయాలి. నాటేముందు నారు వేర్లను క్లోరిఫైరిఫాస్ (2ml/లీటరు నీటికి) ద్రావణంలో 12 గంటలు ఉంచి నాటితే ఉల్లికోడు నుంచి పంటను కాపాడుకోవచ్చు.
☛ నాటిన 10 నుంచి 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేయాలి. పైపాటుగా లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ (లేదా) క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ కలిపి పిచికారీ చేయాలి.
వానాకాలంలో నేల చిత్తడిగా మారి గుంతల్లో, మురుగు కాల్వల్లో ఈగలు, దోమలు వృద్ధి చెందుతాయి. ఇవి పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. దీని వల్ల పశువుల శరీరంపై పుండ్లు పడటంతో పాటు అవి రక్తహీనతకు గురవుతాయి. వీటిని వదిలించుకోవడానికి పశువులు తోక, చెవులను ఊపుతూ అసహనానికి గురవుతాయి. దీని వల్ల మేత సరిగా మేయవు. ఫలితంగా పాల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడుతుంది. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పశువుల షెడ్ చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చిత్తడి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఉదయం, సాయంత్రం పశువుల పాకలో ఎండు పిడకలు, వేపాకుతో పొగబెట్టాలి. సాయంత్రం పశువుల శరీరంపై వేపనూనె రాయాలి. సీజన్‌కు తగినట్లుగా టీకాలు వేయించాలి. అవకాశాన్ని బట్టి పశువుల పాకలకు దోమ తెరలను ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల పశువుల పాకలోకి దోమలు, ఈగలు ప్రవేశించే అవకాశం ఉండదు.
TG: BRSకు, MLC పదవికి రాజీనామా చేసిన కవిత తన ప్రధాన అనుచరులతో నిన్న రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. జాగృతి SM ప్రతినిధులతో సమావేశం అయ్యారని, కొందరు BRS కార్యకర్తలు కూడా ఆమెను కలిసినట్లు సమాచారం. ఉద్యమం సమయంలో యాక్టివ్‌గా ఉండి, BRSలో ప్రాధాన్యం దక్కని నేతలను జాగృతిలో చేరాలని ఆమె కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇవాళ ఆమె మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసే అవకాశముంది.
బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచి, లోకాలను కాపాడిన వామనుడి జయంతి నేడు. దీన్నే కేరళలో ‘ఓనం’గా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన వామనుడికి ప్రత్యేక పూజలు చేసి, పేదలకు బియ్యం, పెరుగు, చక్కెర వంటి ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ప్రశాంతమైన జీవితం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Sorry, no posts matched your criteria.