India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నిర్మాణ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. బోట్ మెన్ అసోసియేషన్ల ద్వారా కూడా ఉచిత ఇసుకను అందిస్తామని పేర్కొన్నారు. సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు. లారీలకు సైతం అనుమతులిచ్చామన్నారు. గత ప్రభుత్వం మైనింగ్ వ్యవస్థలో దోచుకుందని ఆరోపించారు.
కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ మూడో వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అశ్విని ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అప్పూ మన జ్ఞాపకాల్లో, మనం చేసే పనుల్లో ఎప్పటికీ మనతో ఉంటారు. మన హృదయాల్లో ఓ మార్గదర్శిగా శాశ్వతంగా ఉండిపోతారు’ అని ఆమె Xలో పోస్ట్ చేశారు. అభిమానులు సైతం పునీత్ చేసిన గొప్ప పనులను గుర్తుచేసుకుంటున్నారు. ఆయన స్థాపించిన సేవా సంస్థలు ఎంతోమందికి చదువు చెప్పిస్తున్న విషయం తెలిసిందే.
అమెరికా/GEకి కేంద్రం షాక్ ఇచ్చినట్టు సమాచారం. తేజస్ ఫైటర్ జెట్లకు ఇంజిన్ల సరఫరా ఆలస్యం చేయడంతో భారీ స్థాయిలో జరిమానా విధించినట్టు తెలుస్తోంది. నిజానికి 2023 మార్చి నాటికే డెలివరీ ఆరంభించాల్సింది. మోదీ, రాజ్‌నాథ్ చాలాసార్లు దీనిపై చర్చించినా US ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టులోని పెనాల్టీ క్లాజ్‌ను ఉపయోగించి ఒకటి కన్నా ఎక్కువ సార్లే ఫైన్ వేశారని వార్తలొస్తున్నాయి.
AP: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ‘2027లో జరిగే పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేస్తాం. 8 కోట్ల మంది పుష్కరాలకు వస్తారని అంచనా. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. భద్రతా ఏర్పాట్లపై CM, Dy.CMతో చర్చిస్తాం’ అని తెలిపారు. జిల్లా కేంద్రమైన రాజమండ్రిని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని MP పురందీశ్వరి తెలిపారు.
ఈమధ్య ఆడ, మగ తేడా లేకుండా పియర్సింగ్(చెవులు, ముక్కు, శరీరంలో నచ్చిన చోటు కుట్టించుకోవడం) చేయించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కుట్టినచోట బుడిపె వంటి కాయ వచ్చే అవకాశం ఉంది. దాన్ని గ్రాన్యులోమా అంటారు. ఇలా వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. కుట్టిన చోట మచ్చ ఏర్పడినా, అలర్జీలు వచ్చినా డర్మటాలజిస్ట్‌ను కలవాలి. కుట్టిన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాజాలో 55 మంది మృతి చెందారు. వీరిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. గాజాలోని బీట్ లాహియాలోని ఓ భవనంపై ఐడీఎఫ్ దాడి చేసింది. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా జబాలియా, బీట్ లాహియా, బీట్ హనౌన్‌లలో ఆహారం, నీరు లేక లక్ష మంది అల్లాడుతున్నట్లు సమాచారం. మరోవైపు హమాస్ మిలిటెంట్ల ఏరివేత పూర్తయ్యే వరకు దాడులు ఆపేదే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
AP: ప్రయాణికులను విమానయాన సంస్థలు దోచుకుంటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. విమాన టికెట్ల ధరలపై ఆయన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి లేఖ రాశారు. ‘మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంటే ప్రైవేటు విమానయాన సంస్థలు అడ్డగోలుగా రేట్లు పెంచుతున్నాయి. ప్రయాణ దూరం మారనప్పుడు రేట్లు ఎలా పెంచుతారు? సామాన్య ప్రజలు విమానం ఎక్కేలా ధరల్ని నియంత్రించాలి’ అని పేర్కొన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ సందర్భంగా తనను డబ్బులు అడిగినట్లు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చెప్పారు. లండన్ వెళ్లిన సమయంలో అత్యవసరంగా కాల్ చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తనను ఇవ్వమని కోరినట్లు తెలిపారు. టాటా అలా అడగడాన్ని తాను నమ్మలేకపోయానని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో వెల్లడించారు. పారిశ్రామిక ఐకాన్‌గా వెలుగొందిన టాటా కొన్ని రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కలిసి తన పెళ్లికి హాజరుకావాలని ఆయనను కోరారు. ఈమేరకు ఆయనకు ఆహ్వానపత్రికను అందించారు.
AP: వైద్యరంగంలో సరికొత్త సేవలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఎయిమ్స్‌లో ప్రయోగాత్మకంగా డ్రోన్ సేవలను ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ నుంచి 12KM దూరంలోని నూతక్కి PHCకి డ్రోన్‌ని పంపారు. అక్కడ మహిళా రోగి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి తిరిగొచ్చింది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్ల వాడకంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 11 చోట్ల ఈ సేవలను పరీక్షించారు.
Sorry, no posts matched your criteria.