News September 4, 2025

GST తగ్గింపు.. సామాన్యులు ఖుషీ!

image

8 ఏళ్ల తర్వాత GST తగ్గడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ సామగ్రి, నోట్ బుక్స్, పెన్స్, ఏసీలు, టీవీలు, బైకులు, కార్లు.. ఇలా రోజువారీ జీవితంలో ఉపయోగపడే చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్ను రేట్లు అమల్లోకి వస్తాయి. అప్పటివరకు ఆగి ఆ తర్వాత కొనేందుకు సామాన్యులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. GST తగ్గింపుపై మీ కామెంట్?

News September 4, 2025

ధోనీ అభిమానులకు క్రేజీ న్యూస్!

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరో ఏడాది ఐపీఎల్ ఆడొచ్చని క్రీడావర్గాలు వెల్లడించాయి. N శ్రీనివాసన్ తిరిగి CSK ఫ్రాంచైజీ పగ్గాలు తీసుకున్నారని, ధోనీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపాయి. మరో సీజన్ కూడా ఆడాలని శ్రీనివాసన్ ధోనీని ఒప్పించే అవకాశం ఉందన్నాయి. కాగా 44 ఏళ్ల ధోనీ గత సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడారు. ధోనీ వచ్చే సీజన్ ఆడటం అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది.

News September 4, 2025

కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. PPP మోడల్‌లో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలకు ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ తయారీ, అమలుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

News September 4, 2025

GST 2.0: పెరగనున్న IPL టికెట్ రేట్లు

image

కేంద్రం తీసుకొస్తున్న GST 2.0తో IPL అభిమానులకు షాక్ తగలనుంది. ఇప్పటివరకు 28% జీఎస్టీ శ్లాబులో ఉన్న ఐపీఎల్ టికెట్లపై ఇకపై 40% పన్ను పడనుంది. అంటే రూ.వెయ్యి టికెట్‌ ఇప్పుడు రూ.1280 ధరుంటే.. ఈ నెల 22 తర్వాత అది రూ.1400కు చేరుతుంది. అయితే, టీమ్ ఇండియా ఆడే అంతర్జాతీయ మ్యాచులకు మాత్రం టికెట్ ధరపై 18% జీఎస్టీనే కంటిన్యూ అవుతుంది. దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

News September 4, 2025

ధవన్‌కు ఈడీ నోటీసులు

image

టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై ఆయన్ను ప్రశ్నించనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ఇప్పటికే ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

News September 4, 2025

NCC, డిగ్రీ అర్హతతో 70 లెఫ్టినెంట్ పోస్టులు

image

NCC సర్టిఫికెట్ ఉన్న పురుష అభ్యర్థులు స్పెషల్ ఎంట్రీ కింద 70 లెఫ్టినెంట్ ఉద్యోగాలకు ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 మార్కులతో డిగ్రీ పాసైన వారు అర్హులు. 19-25ఏళ్లలోపు వయసుండాలి. NCC, డిగ్రీ మార్కులు, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో నెలకు ₹56,100 స్టైఫండ్, విధుల్లో చేరిన తర్వాత ₹లక్షకు పైగా జీతం పొందొచ్చు.
వెబ్‌సైట్: <>https://joinindianarmy.nic.in/<<>>

News September 4, 2025

పిల్లలకు ఫార్ములా పాలు పడుతున్నారా?

image

డెలివరీ తర్వాత తల్లికి పాలు పడకపోయినా, పాలు పట్టలేని స్థితిలో ఉన్నా శిశువులకు ఫార్ములా పాలు ఇస్తుంటారు. వీటిని సరైన కొలతలతో, జాగ్రత్తగా పట్టాలి. ఒక స్పూన్ పాలపొడికి ఎన్ని నీళ్లు కలపాలో సరిగ్గా చెక్ చేసుకోవాలి. లేదంటే చిన్నారులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలు కలిపిన వెంటనే వారికి పట్టించాలి. అలాగే వారు ఒకసారి కాస్త తాగి వదిలేసిన వాటిని మళ్లీ ఇవ్వకూడదు. కాచి చల్లార్చిన నీటితో మాత్రమే పాలు కలపాలి.

News September 4, 2025

Parenting: పిల్లల్ని ఒంటరిగా పెంచుతున్నారా?

image

అమ్మానాన్న విడిపోవడం లేదా ఎవరో ఒకరు చనిపోయినపుడు ఒంటరిగానే పిల్లలను పెంచాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, స్వీయసానుభూతి దూరం చేసుకోవాలి. ఉద్యోగం, పిల్లల సంరక్షణపై శ్రద్ధ చూపిస్తూ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. పిల్లలు కుంగుబాటుకు గురవకుండా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. అప్పుడే వారు జీవితంలో ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.

News September 4, 2025

సోలో ట్రిప్‌కి వెళ్తున్నారా?

image

ప్రస్తుతకాలంలో అమ్మాయిలూ సోలో ట్రిప్‌లు చేస్తున్నారు. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే మీరు వెళ్లే ప్రదేశంలో ఆహార, వసతి, రవాణా సౌకర్యాల గురించి తెలుసుకోండి. చిన్న కీపాడ్ మొబైల్‌ని తీసుకెళ్తే అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా తక్కువ లగేజ్‌ ఉండేలా చూసుకోవాలి. కార్డులతో పాటు క్యాష్‌ తీసుకెళ్లడం మంచిది. ఎప్పటికప్పుడు మీ లొకేషన్‌ని సన్నిహితులకు తెలియజేయాలి.

News September 4, 2025

BEMLలో 100 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

image

బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 100 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాసవ్వాలి. వయసు 29ఏళ్లు మించరాదు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.bemlindia.in/<<>>