News September 4, 2025

BEMLలో 100 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

image

బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 100 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాసవ్వాలి. వయసు 29ఏళ్లు మించరాదు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.bemlindia.in/<<>>

News September 4, 2025

APPLY: నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్

image

2025-26 విద్యాసంవత్సరంలో ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏఐసీటీఈ శుభవార్త చెప్పింది. వారికి గేట్/సీఈఈడీ స్కోర్ ఆధారంగా నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్ అందించనుంది. విద్యార్థులు సంబంధిత సంస్థ నుంచి ఐడీని తీసుకుని <>https://www.aicte.gov.in/<<>> వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు అవకాశం ఉంది.

News September 4, 2025

ఫోన్లపై GST.. నో ఛేంజ్

image

ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై 18% GST వసూలు చేస్తున్నారు. నిన్నటి కౌన్సిల్ భేటీలో దీన్ని తగ్గించలేదు. దీంతో ఫోన్ల ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. పెట్రోల్, ఆల్కహాల్‌ను ఈసారి కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. వాటిపై రాష్ట్రాలు ఒక్కో రకమైన వ్యాట్ విధిస్తున్నాయి. ఫలితంగా వాటి ధరలు కూడా తగ్గే అవకాశం లేదు. మరోవైపు రూ.2,500 దాటిన దుస్తులు, పాదరక్షల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.

News September 4, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

దాదాపు పది రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,06,860కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.97,950 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 4, 2025

ఫ్రీ బస్.. లోకల్ అడ్రస్ ఉంటే చాలు: అధికారులు

image

TG: అప్‌డేట్ చేయని ఆధార్ కార్డులపై రాష్ట్రం పేరు AP అని ఉంటే మహిళలకు జీరో టికెట్ ఇచ్చేందుకు కొందరు బస్ కండక్టర్లు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గ్రేటర్ RTC ED రాజశేఖర్ స్పందించారు. ఆధార్‌పై తెలంగాణ లోకల్ అడ్రస్ ఉంటే చాలని స్పష్టం చేశారు. ఒకవేళ కండక్టర్లు నిరాకరిస్తే 04069440000 TOLL FREE నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. అయితే ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే మంచిదని అధికారులు సూచించారు.

News September 4, 2025

GST సంస్కరణలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

కేంద్రం తీసుకొచ్చిన GST సంస్కరణలతో స్టాక్ మార్కెట్లలో కొత్త జోష్ కనిపించింది. దేశీయ సూచీలు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 630కు పైగా పాయింట్లు లాభపడి 81,198 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకు పైగా లాభపడి 24,895 వద్ద ట్రేడ్ అవుతోంది. M&M, HDFC, ICICI, బజాజ్ ఫైనాన్స్, ITC, భారతి ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

News September 4, 2025

ఆధార్ PVC కార్డు కోసం ఇలా చేయండి!

image

UIDAI ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. https://myaadhaar.uidai.gov.inలోకి వెళ్లి మీ ఆధార్ నంబర్, మీ ఫోన్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయాలి. మీ వివరాలు వెరిఫై చేసుకుని ఆన్‌లైన్‌లోనే రూ.50 ఫీజు చెల్లించాలి. అనంతరం 28 డిజిట్ల సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ SMS వస్తుంది. 5-15 రోజుల్లో PVC కార్డు మీ ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు. ఇందులో QR కోడ్ సెక్యూర్‌గా ఉంటుంది. ట్యాంపర్ చేయడం కుదరదు.

News September 4, 2025

పోటీ పరీక్షలు రాసే దివ్యాంగులకు అలర్ట్

image

పోటీ పరీక్షల్లో దివ్యాంగులే సొంత స్క్రైబ్(సహాయకులు)ను తెచ్చుకునే విధానానికి కేంద్రం ముగింపు పలకనుంది. అవకతవకలు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, SSC, UPSC వంటి సంస్థలు సొంతంగా తయారుచేసుకున్న స్క్రైబ్‌లనే కేటాయించాలని ఆదేశించింది. అభ్యర్థి కన్నా స్క్రైబ్ వయసు 2, 3 విద్యా సంవత్సరాలు తక్కువుండాలి. ఇద్దరూ ఒకే పోటీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉండకూడదని తెలిపింది.

News September 4, 2025

అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదా?

image

అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జండీ తెలిపారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం 2.7% ఉంటే అది వచ్చే ఏడాదికి 3%-4%కి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఉద్యోగాలు పోతున్నాయని పేర్కొన్నారు. టారిఫ్స్ పెంచడంతో అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయని వివరించారు. కాగా 2008 మాంద్యాన్ని అంచనా వేసిన తొలి ఆర్థికవేత్త ఈయనే.

News September 4, 2025

దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక: పవన్

image

AP: GST సంస్కరణలను Dy.CM పవన్ స్వాగతించారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇచ్చిన మాటను PM మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ మార్పులతో పేద, మధ్య తరగతి, రైతులకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా విద్య, జీవిత బీమాపై GST తొలగింపు కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక. నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.