News September 4, 2025

భారత జట్టుకు దూరం.. భువి రియాక్షన్ ఇదే!

image

జాతీయ జట్టుకు ఎంపికవడం తన చేతుల్లో లేదని, దానిపై సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని భారత బౌలర్ భువనేశ్వర్ అన్నారు. ‘మైదానంలో బాగా ఆడటం, ఫిట్‌గా ఉండటం, బౌలింగ్ చేసేటప్పుడు లైన్&లెంగ్త్‌పైనే నా ఫోకస్ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత బాగా ఆడినా అదృష్టం కలిసిరాదు. అవకాశం వస్తే స్టేట్, జాతీయ జట్లకు నా బెస్ట్ ఇస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భువి IND తరఫున చివరగా 2022 నవంబర్‌లో NZతో జరిగిన T20 మ్యాచులో ఆడారు.

News September 4, 2025

గ్యాలరీలో ఈ ఫొటోలు పెట్టుకుంటున్నారా?

image

మొబైల్ గ్యాలరీలో ఆధార్, పాన్ కార్డ్ ఫొటోలు పెట్టుకోవద్దని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన హ్యాక్ ప్రూఫ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్‌కు సంబంధించిన ఫొటోస్ డిజీలాకర్లలో స్టోర్ చేసుకోవాలన్నారు. కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటాయని, అందుకే ఫొటోలు ఉంచడం సురక్షితం కాదని తెలిపారు.

News September 4, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

✦ SLBC టన్నెల్ పనులను 2028 జనవరి నాటికి పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
✦ ఆస్పత్రుల్లో 8 ఏళ్లు దాటిన మెషీన్లను స్క్రాప్ చేయాలి.. మంత్రి రాజనర్సింహ ఆదేశాలు
✦ గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు డిగ్రీ ఉంటే గ్రేడ్-3 క్లర్క్ పోస్టులు: సింగరేణి
✦ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 2,116 మందిని ఎంపిక చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు

News September 4, 2025

ఈ బైకుల ధరలు తగ్గుతాయి

image

ప్రస్తుతం అన్ని రకాల బైకులపై 28% GST విధిస్తున్నారు. 350 cc కంటే ఎక్కువ కెపాసిటీ ఉంటే అదనంగా 2-3% సెస్ విధిస్తున్నారు. తాజా మార్పులతో 350 cc, అంతకంటే తక్కువ ఉన్న బైకులపై 18%, అంతకంటే ఎక్కువ ఉన్న బైకులపై 40% ట్యాక్స్ పడనుంది. కొత్త విధానంలో సెస్ ఉండదు.
*350 cc కంటే తక్కువ కెపాసిటీ బైకులు: యాక్టివా, షైన్, TVS జూపిటర్, బజాజ్ పల్సర్, హీరో స్ప్లెండర్, గ్లామర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, హంటర్ etc.

News September 4, 2025

118 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 5 వరకు https://www.tgprb.in/ వెబ్‌సైట్‌‌‌లో దరఖాస్తులు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు SC, ST అభ్యర్థులకు ₹1000, మిగతా వారికి ₹2000. అభ్యర్థులు క్రిమినల్ కోర్టుల్లో 3 ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 4, 2025

నెలాఖరు వరకు పొగాకు కొనుగోళ్లు: అచ్చెన్న

image

AP: సెప్టెంబర్ నెలాఖరులోగా నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలో 80 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. మార్క్‌ఫెడ్, ప్రైవేటు కంపెనీలు 55 మిలియన్ల కిలోలు కొన్నాయి. మిగిలిన పొగాకులో నెలాఖరులోగా 5 మి. కిలోలు మార్క్‌ఫెడ్, 20 మి. కిలోలు ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేయాలి. వచ్చే రబీలో ఎవరూ నల్ల బర్లీ పొగాకు పండించొద్దు’ అని సూచించారు.

News September 4, 2025

అప్పటివరకు పాత శ్లాబ్‌లోనే సిగరెట్, గుట్కా, బీడీ

image

కొత్తగా తీసుకొచ్చిన GST సంస్కరణలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. అయితే SIN(హానికర) ట్యాక్స్ పరిధిలో ఉన్న సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, టొబాకో, జర్దా, బీడీలపై విధించిన 40% ట్యాక్స్‌ అమల్లోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. తదుపరి తేదీ ప్రకటించే వరకు ఇవి 28% శ్లాబ్‌లోనే కొనసాగనున్నాయి. ప్రస్తుతం సిగరెట్లపై సైజ్‌లను బట్టి GST, సెస్‌ కలిపి గరిష్ఠంగా 64% ట్యాక్స్ అమల్లో ఉంది.

News September 4, 2025

అన్ని కార్ల ధరలు తగ్గుతాయ్..

image

కొత్త జీఎస్టీ విధానంలో లగ్జరీ <<17606719>>కార్లను<<>> 40% శ్లాబులోకి (గతంలో 28%) తెచ్చారు. అయితే ఇంజిన్ కెపాసిటీతో సంబంధం లేకుండా అన్ని కార్ల ధరలు తగ్గుతాయని మీకు తెలుసా? ఎలా అంటే..
*ప్రస్తుతం 1200 cc (పెట్రోల్ ఇంజిన్) కంటే ఎక్కువ ఉన్న కార్లపై 28% జీఎస్టీతో పాటు 22% సెస్ వేస్తున్నారు. దీంతో పన్ను 50% పడుతోంది. కొత్త విధానంలో 40% జీఎస్టీలోకి తెచ్చారు. కానీ సెస్ పూర్తిగా తొలగించారు. దీంతో 10% పన్ను మిగిలినట్లే..

News September 4, 2025

స్వాగతిస్తున్నాం.. కానీ చాలా ఆలస్యమైంది: చిదంబరం

image

GST సంస్కరణలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, MP చిదంబరం స్పందించారు. ‘జీఎస్టీ హేతుబద్ధీకరణ, గూడ్స్&సర్వీసెస్‌పై ట్యాక్స్ తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ చాలా ఆలస్యమైంది. 8 ఏళ్ల క్రితం GST ప్రవేశపెట్టినప్పుడే ఈ పని చేయాల్సింది. ఇంతకాలం రేట్లను తగ్గించాలని మేం ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? ట్రంప్ సుంకాలా? బిహార్ ఎన్నికలా?’ అని ప్రశ్నించారు.

News September 4, 2025

నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయమై చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు.